-
ప్రీలాంచుల్లో అమ్మే సంస్థకు
క్రెడాయ్ అవార్డు ఎలా ఇస్తుంది
-
క్రెడాయ్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను
ఉల్లంఘించినట్లు కాదా
-
4 నెలల్లో రూ. 34 కోట్లు ఎలా బదిలీ
మహేశ్వరం ఎమ్మార్వో, ఈఐపీఎల్ అక్రమాలపై దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడం.. అక్రమ మ్యుటేషన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక అడుగు ముందుకేసిన ఫిర్యాదుదారులు ఈడీని ఆశ్రయించారు. మహేశ్వరం ఎమ్మార్వో, ఈఐపీఎల్ సంస్థలు కలిసి.. కేవలం నాలుగు నెలల్లో.. దాదాపు రూ.31 కోట్ల మేరకు లావాదేవీలు జరిపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 1908 తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22 ప్రకారం నిషేధిత భూములపై ఇంత భారీ స్థాయిలో లావాదేవీలు జరగడమేమిటని ప్రశ్నించారు. ఆయా సొమ్మును ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారా? చెక్కుల ద్వారా అందజేశారా లేక డిమాండ్ డ్రాఫ్టు రూపంలో ఇచ్చారా? అనే విషయాన్ని సేల్ డీడ్‌లో ఎక్కడా పేర్కొనలేదని ఈడీ దృష్టికి తెచ్చారు.
మహేశ్వరం ఎమ్మార్వో పట్టాదారు పాస్ పుస్తకాల్ని ఖాదరున్నీసాకు అందజేసిన తర్వాత.. బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎన్ సంతోష్ కుమార్‌లు సుమారు రూ. 13.57 కోట్లు ఖాదరున్నీసాకు అందజేసినట్లు సేల్ డీడ్‌ల ద్వారా తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఆతర్వాత బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎన్ సంతోష్ కుమార్‌లు.. ఆ 40 ఎకరాల భూమిని రూ.17.49 కోట్లకు ఈఐపీఎల్ సంస్థకు 27.10.2021 నుంచి 08.02.2022 బదిలీ చేశారని ఆరోపించారు. ఇంత భారీ ఆర్థిక లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.