Categories: LATEST UPDATES

డేటా సెంటర్లలో.. భారీగా పెట్టుబడులు

  • 2025 నాటికి 20 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం

దేశలో డేటా సెంటర్లలో పెట్టుబడులు 2025 నాటికి 20 బిలియన్ డాలర్లను అధిగమించే అవకాశం ఉందని సీబీఆర్ఈ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ అధ్యయనం పేర్కొంది. ‘డేటా సెంటర్స్ ఇన్ ఇండియా: పవరింగ్ అప్ రియల్ ఎస్టేట్ ఇన్ డేటా హై ఎరా‘ అనే అంశంపై తాజాగా ఈ సంస్థ నివేదిక విడుదల చేసింది.

పెరుగుతున్న డిజిటలైజేషన్, బలమైన ప్రభుత్వ విధానాలు, ఓటీటీ, ఆన్ లైన్ గేమింగ్, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, ఈ కామర్స్, ఆన్ లైన్ స్కూలింగ్, మెషీన్ లెర్నింగ్, 5జీ, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలు దేశంలో డేటా సెంటర్ల వృద్ధికి తోడ్పడుతున్నాయని వివరించింది. 2022 తొలి అర్ధభాగం నాటికి దేశంలో 600 ప్లస్ మెగావాట్ల సామర్థ్యంతో 9 మిలియన్ చరదపు అడుగుల్లో డేటా సెంటర్లు ఉండగా.. 2024 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో 400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు నిర్మాణంలో ఉన్నాయి.

ఈ విషయంలో 48 శాతం వాటాతో ముంబై ముందుండగా.. బెంగళూరు(18 శాతం), చెన్నై(9 శాతం) ఉన్నాయి. ఈ మూడు నగరాలూ కలిపి దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం. ఇక ఢిల్లీ, పుణె, హైదరాబాద్, కోల్ కతా మిగిలిన 25 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ‘అన్ని రంగాల్లోనూ డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరించడంతో డేటా సెంటర్లు పెద్ద ప్రత్యామ్నాయ రియల్ ఎస్టేట్ తరగతిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో డేటా సెంటర్లు పెరుగుతూనే ఉంటాయి. టైర్-2, టైర్-3 నగరాలకు కూడా డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం’ అని సీబీఆర్ఈ ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా చైర్మన్ అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు.

This website uses cookies.