హైదరాబాద్‌కు చెందిన ఎస్ వీఏజీ ఎస్‌వీఏజీ పెట్ హోమ్స్ అనే స్టార్టప్ కంపెనీ బార్కిటెక్చర్ లోకి ప్రవేశించింది. దేశంలోని ఇది మొట్టమొదటి కాన్సెప్ట్ కావడం విశేషం. మానవ నివాసాల కోసం ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, కుక్కల కోసం రూపొందించే నిర్మాణాల కోసం బార్కిటెక్చర్ ఉంది. ఇది మన పెంపుడు జంతువుల కోసం విల్లాలు, పాడ్స్, డిజైనర్ ఫర్నిచర్ రూపకల్పనకు ఉపయోగపడుతుంది. తమ స్టార్టప్ కంపెనీ ఉత్పత్తులు బార్కీ విల్లాలు, బార్కీ పాడ్స్, బార్కీ ఫర్నిచర్ తదితరాలను ఎస్ వీఏజీ పెట్ హోమ్స్ వ్యవస్థాపకుడు సుశాంత్ కన్నెగంటి, విశాల్ బోత్రా, సహ వ్యవస్థాపకులు గోపాల్ వర్మ, అనుదీప్ వై హైదరాబాద్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెంపుడు జంతువులకు సంబంధించి బార్కిటెక్చర్ అనేది కొత్త ట్రెండ్ అని తెలిపారు. జంతువుల కోసం ఇళ్లు, విల్లాలు, పాడ్స్, ఫర్నిచర్ వంటి ఉత్పత్తులు ఇందులో ఉంటాయన్నారు. కోవిడ్ తర్వాత పెంపుడు జంతువులను, ముఖ్యంగా కుక్కలను దత్తత తీసుకోవడం గరిష్ట స్థాయికి చేరుకుందని చెప్పారు. దీంతో బార్కిటెక్చర్‌ను కూడా వచ్చిందని తెలిపారు. పెంపుడు జంతువుల ప్రేమికులకు ఇది సరికొత్త ఇంటీరియర్స్ ట్రెండ్ అని వివరించారు. ఇది మీ పెంపుడు జంతువు వ్యక్తిగత అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ఇంట్లోని నిర్దిష్ట ప్రాంతంలో ఏర్పాటు చేసే ఇంటీరియర్ డిజైన్ ట్రెండ్ అని విశాల్ బోత్రా పేర్కొన్నారు.
కరోనా సమయంలో కుక్కలు కీలకమైన సాంగత్యాన్ని, భావోద్వేగ మద్దతును అందించాయి. అందుకే చాలా మంది కుక్కలను పెంచుకోవడం ప్రారంభించారు. తాజాగా తమ పెంపుడు స్నేహితులకు అవసరమైన డిజైనర్ హోమ్‌ల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ వీఏజీ పెట్ హోమ్స్ దేశంలోనే తొలిసారిగా బార్కీ విల్లాస్, పాడ్స్, పెట్ ఫ్రెండ్లీ ఫర్నిచర్ ఉత్పత్తులను తీసుకొచ్చింది. వీటిని కుక్కలకు సౌకర్యవంతంగా, ఇంట్లో అందంగా కనపించేలా రూపొందించారు. ప్రస్తుతం బార్కీకి హైదరాబాద్ లోని ఆరామ్ ఘర్ లో తయారీ కేంద్రం ఉంది. అలాగే 25 స్టాక్ కీపింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ కంపెనీ కోసం రూ.1.8 కోట్ల పెట్టుబడి పెట్టారు. బార్కీ ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో www.barkkey.com తోపాటు అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆర్డర్ చేయవచ్చు. ఈ ఉత్పత్తుల ధరల శ్రేణి రూ.15వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. అలాగే వీధి కుక్కల సంక్షేమం కోసం బి-బౌల్ ను కూడా ఈ కంపెనీ ప్రవేశపెడుతోంది. దీని ద్వారా ప్రతి వీధి కుక్కకు ప్రేమ, భోజనం అందిస్తారు. మరోవైపు బార్కీ ఫౌండేషన్ కు కూడా ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది.
This website uses cookies.