poulomi avante poulomi avante

భ‌ళా.. హైద‌రాబాద్ బిల్డ‌ర్లు!

  • సీఎస్సార్ నిధుల కింద 51 చెరువుల సుందరీకరణ
  • నగర ప్రజలకెంతో
  • పూర్తయితే దేశానికే మన బిల్డర్లు రోల్ మోడల్

బిల్డ‌ర్లంటే కేవ‌లం ఫ్లాట్లు, విల్లాలు అమ్మ‌డ‌మే కాదు.. స‌మాజ సేవ‌లోనూ ముందంజ‌లో ఉంటార‌ని.. న‌గ‌ర బిల్డ‌ర్లు మ‌రోసారి నిరూపించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప‌రిధిలోని 51 చెరువుల సుంద‌రీక‌ర‌ణ ప‌నుల్ని చేప‌ట్ట‌డానికి ముందుకొచ్చారు.

పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో భాగ్య‌న‌గ‌ర అందాన్ని మ‌రింత ద్విగుణీకృతం చేసేందుకు న‌డుం బిగించారు. వీటిలో 26 చెరువులు జీహెచ్ఎంసీ ప‌రిధిలో.. మిగ‌తావి హెచ్ఎండీఏ ప‌రిధిలో ఉన్నాయి. ఈ మేర‌కు మంత్రి కేటీఆర్ నిర్మాణ సంఘాల‌కు చెరువుల సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌కు సంబంధించిన ఎంవోయూ ప‌త్రాల్ని అంద‌జేశారు.

నెక్ట్స్ లెవెల్లో ఉంటుందా?

బిల్డ‌ర్లు చేప‌ట్టే చెరువుల సుంద‌రీక‌ర‌ణ ప‌నులు సాదాసీదాగా ఉండ‌వు. అందులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ప‌చ్చ‌ద‌నంతో నింపేస్తారు. ఓపెన్ జిమ్, చిన్నారుల‌కు ఆట స్థ‌లాలు, గ‌జీబోలు, యాంఫీ థియేట‌ర్‌, టాయిలెట్స్ వంటివి అభివృద్ధి చేస్తారు. విదేశీ న‌గ‌రాల త‌ర‌హాలో.. ప్ర‌జ‌లంతా తీరిక‌వేళ‌లో సంతోషంగా గ‌డిపే విధంగా తీర్చిదిద్దుతారు.

 

దుర్గం చెరువు ఎలాగైతే ప్ర‌తీ సినిమాలో క‌నిపిస్తుందో.. అదే విధంగా వీటిని ముస్తాబు చేయాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇప్ప‌టికే 13 చెరువుల్లో ఉన్న 115 ఎక‌రాల స్థ‌లం ప్రైవేటు య‌జ‌మానుల ఆధీనంలో ఉంద‌ని.. వారికి 200 శాతం మార్కెట్ విలువ గ‌ల టీడీఆర్‌ల‌ను అంద‌జేశామ‌న్నారు. బిల్డ‌ర్లు కేవ‌లం చెరువుల‌ను అభివృద్ధి చేసి సుంద‌రీక‌ర‌ణను చేప‌డ‌తార‌ని తెలిపారు.

  • హైద‌రాబాద్ ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే చ‌ర్య‌ల‌న్నీ తీసుకుంటున్నామ‌ని మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. న‌గ‌రం న‌లువైపులా ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను అందుబాటులోకి తెస్తామ‌ని, మెడిక‌ల్ డివైజెస్ పార్కును విస్త‌రిస్తామ‌ని చెప్పారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ఫిలిం సిటీ, స్పోర్ట్స్ సిటీ వంటివి అభివృద్ధి చేస్తామ‌న్నారు

ఇవే చెరువులు.. వీరే బిల్డ‌ర్లు
హైద‌రాబాద్‌లోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప‌రిధిలో ఉన్న చెరువుల‌ను ఏయే బిల్డ‌ర్లు అభివృద్ధి చేస్తున్నారంటే..

చెరువు ప్రాంతం బిల్డ‌ర్

  • మైస‌మ్మ చెరువులు మూసాపేట్ వాస‌వి హోమ్స్‌
  • మెడ్ల‌కుంట గోప‌న‌ప‌ల్లి వ‌ర్టెక్స్ వెగా డెవ‌ల‌పర్స్‌
  • పెద్ద చెరువు రాజేంద్ర‌న‌గ‌ర్ వైష్ణోయ్ డెవ‌ల‌ప‌ర్స్‌
  • చిన్నపెద్ద చెరువు గోప‌న‌ప‌ల్లి హాన‌ర్ ఎస్టేట్స్‌
  • ఎల్ల‌మ్మ చెరువు హైద‌ర్ న‌గ‌ర్ భ‌వ్య క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌
  • మ‌ణికొండ చెరువు ఖాజాగూడ నిహారిక ప్రాజెక్ట్స్‌
  • గోపి చెరువు శేరిలింగంప‌ల్లి అర‌బిందో రియాల్టీ
  • భ‌గీర‌థ‌మ్మ చెరువు నాన‌క్‌రాంగూడ మీనాక్షి ఇన్‌ఫ్రా
  • స‌ఖి చెరువు ప‌టాన్‌చెరు ఇన్‌కార్ ఇన్‌ఫ్రా
  • తిమ్మ‌క్క చెరువు ప‌టాన్‌చెరు ఏపీఆర్ ప్రాజెక్ట్స్‌
  • ఐడీఎల్ చెరువు కూక‌ట్‌ప‌ల్లి గ‌ల్ఫ్ ఆయిల్
  • రామ‌స‌ముద్రం మ‌దీనాగూడ వ‌ర్టెక్స్ హోమ్స్‌
  • కూక‌ట్‌ప‌ల్లి లేక్ కూక‌ట్ ప‌ల్లి న‌య‌న్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌
  • పెద్ద‌చెరువు లేక్ మ‌న్సూరాబాద్ గ్రీన్ లీవ్స్ ఇన్‌ఫ్రా
  • మేడికుంట నాన‌క్‌రాంగూడ టీఎస్ఐఐసీ
  • మొండికుంట ఖానామెట్ వాస‌వి హోమ్స్‌
  • గంగారం చెరువు చందాన‌గ‌ర్ శార్వాణీ వెంచ‌ర్స్‌
  • ఈర్ల చెరువు శేరిలింగంప‌ల్లి ఇండిస్‌స్మార్ట్ హోమ్స్‌
  • కొత్త‌చెరువు నోవాటెల్ హైటెక్స్ లిమిటెడ్‌
  • వెంగ‌ళ‌రావు నగ‌ర్ పార్క్ బంజారాహిల్స్ స‌త్వా బిల్డ‌ర్స్‌
  • కొత్త కుంట శేరిలింగంప‌ల్లి యునైటెడ్ వే ఆఫ్ హైద‌రాబాద్‌
  • ముండ్ల కుంట కూక‌ట్‌ప‌ల్లి యునైటెడ్ వే ఆఫ్ హైద‌రాబాద్‌
  • రంగాలాల్ కుంట నాన‌క్‌రాంగూడ యునైటెడ్ వే ఆఫ్ హైద‌రాబాద్‌
  • ఖాజాగూడ లేక్ ఖాజాగూడ దివ్య‌శ్రీ ఎన్ఎస్ఎల్ ఇన్‌ఫ్రా
  • గుట్ట‌ల బేగంపేట్ లేక్ మాదాపూర్ అయ్య‌న్న ఫౌండేష‌న్‌
  • ఇబ్ర‌హీంబాగ్ చెరువు ఇబ్ర‌హీంబాగ్ వెస్సెలా మిడోస్

హెచ్ఎండీఏ ప‌రిధిలోని చెరువులివే

  • అమీన్‌పూర్ లేక్ అర్బ‌న్ రైజ్ డెవ‌ల‌ప‌ర్స్‌
  • పాల్‌మాకుల్ లేక్ మై హోమ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌
  • నార్సింగి లేక్ త‌త్వా డెవ‌ల‌పర్స్‌
  • కోకాపేట్ చెరువు గార్ కార్ప్‌
  • పిరంచెరువు శాంతాశ్రీరాం డెవ‌ల‌ప‌ర్స్‌
  • వెంగ‌మాంబ చెరువు ఆల‌య ఇన్‌ఫ్రా
  • కందుకూర్ చెరువు కొహీనూర్ డెవ‌ల‌పర్స్‌
  • వ‌నం చెరువు, తెల్లాపూర్ అనుహార్ హోమ్స్‌
  • మేళ్ల చెరువు తెల్లాపూర్ ఏలియెన్స్ డెవ‌ల‌ప‌ర్స్‌
  • చెలికుంట, తెల్లాపూర్ రాజ‌పుష్ప ప్రాప‌ర్టీస్‌
  • బంధంకుంట అమీన్‌పూర్ అవంతికా ప్రైడ్ వాల్స్‌
  • నెరుడు చెరువు పెద్ద‌కంజ‌ర్ల అర‌బిందో త‌త్వా టౌన్‌షిప్‌
  • న‌ల్ల చెరువు నార్సింగి రాంకీ ఎస్టేట్స్‌
  • పాశ‌మైలారం చెరువు ఇస్నాపూర్ అప‌ర్ణా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌
  • రుద్రారం చెరువు, రుద్రారం ఎస్ఈఆర్ఏసీ ఎస్టేట్స్‌
  • ఇస్నాపూర్ పెద్ద‌చెరువు, ఇస్నాపూర్, గుడ్ టైమ్స్ బిల్డ‌ర్స్‌
  • టింబ‌ర్ లేక్‌, మంచిరేవుల మంత్రి డెవ‌ల‌ప‌ర్స్‌
  • బండ్ల‌గూడ జాగీర్ చెరువు కీర్తీ ఎస్టేట్స్‌
  • ఇబ్ర‌హీం చెరువు, నెక్నాంపూర్ ఆనందా హోమ్స్‌
  • రాయికుంట‌, శ్రీన‌గ‌ర్ మ‌హేశ్వ‌రం రాంకీ ఎస్టేట్స్‌
  • కోమ‌టికుంట‌, బౌరంపేట్ త్రిపుర క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌
  • మొండికుంట బౌరంపేట్ త్రిపుర క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌
  • ఎండీ ఉస్మాన్‌కుంట గాగిల్లాపూర్ వెంక‌ట్ ప్రణీత్ డెవ‌ల‌ప‌ర్స్‌
  • బొమ్మాయి చెరువు గౌడ‌వెల్లి సాకేత్ ఇంజినీర్స్
  • పెద్ద చెరువు దుండిగ‌ల్ అప‌ర్ణా కన్‌స్ట్ర‌క్ష‌న్స్
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles