తప్పనిసరిగా పర్యావరణ అనుకూల నిర్మాణ సామగ్రిని వినియోగించాలి. నగరాల భవిష్యత్తును రూపొందించేందుకు నీటిని సంరక్షించాలి. ఇందుకోసం నీటి రీసైక్లింగ్ మీద దృష్టి పెట్టాలి. మురుగునీటి శుద్ధి కర్మాగారాల్ని ఏర్పాటు చేయాలి. ప్రతి అపార్టుమెంట్‌లో విధిగా వాన నీటి సంరక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేయాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సముద్రాల్లోని ఉప్పు నీటిని మంచినీరుగా మార్చివేసే ప్రక్రియను విజయవంతం చేయాలి. ఇలా ప్రతి అంశాన్ని పక్కాగా జరిపితేనే.. సహజ వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. భవిష్యత్తులో నీటి నిర్వహణను సమర్థంగా చేపట్టడానికి వీలు కలుగుతుంది. నిర్మాణ సంఘాలన్నీ ఒక చోట కూర్చోని.. నీటి సంక్షోభాన్ని నివారించేందుకు అవసరమయ్యే ఉత్తమ పద్ధతులపై చర్చలు జరపాలి. చెరువుల్ని పూడ్చివేసి అపార్టుమెంట్లను నిర్మించకూడదు. చెరువుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయకుండా ఆకాశహర్మ్యాల్ని కట్టకూడదనే నిర్ణయాల్ని తీసుకోవాలి. ఇందుకు సంబంధించి అందరూ కలిసి శపథం చేయాలి.
This website uses cookies.