పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో భాగ్యనగర అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు నడుం బిగించారు. వీటిలో 26 చెరువులు జీహెచ్ఎంసీ పరిధిలో.. మిగతావి హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. ఈ మేరకు మంత్రి కేటీఆర్ నిర్మాణ సంఘాలకు చెరువుల సుందరీకరణ పనులకు సంబంధించిన ఎంవోయూ పత్రాల్ని అందజేశారు.
నెక్ట్స్ లెవెల్లో ఉంటుందా?
బిల్డర్లు చేపట్టే చెరువుల సుందరీకరణ పనులు సాదాసీదాగా ఉండవు. అందులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు. పచ్చదనంతో నింపేస్తారు. ఓపెన్ జిమ్, చిన్నారులకు ఆట స్థలాలు, గజీబోలు, యాంఫీ థియేటర్, టాయిలెట్స్ వంటివి అభివృద్ధి చేస్తారు. విదేశీ నగరాల తరహాలో.. ప్రజలంతా తీరికవేళలో సంతోషంగా గడిపే విధంగా తీర్చిదిద్దుతారు.
దుర్గం చెరువు ఎలాగైతే ప్రతీ సినిమాలో కనిపిస్తుందో.. అదే విధంగా వీటిని ముస్తాబు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇప్పటికే 13 చెరువుల్లో ఉన్న 115 ఎకరాల స్థలం ప్రైవేటు యజమానుల ఆధీనంలో ఉందని.. వారికి 200 శాతం మార్కెట్ విలువ గల టీడీఆర్‌లను అందజేశామన్నారు. బిల్డర్లు కేవలం చెరువులను అభివృద్ధి చేసి సుందరీకరణను చేపడతారని తెలిపారు.
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అవసరమయ్యే చర్యలన్నీ తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. నగరం నలువైపులా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని, మెడికల్ డివైజెస్ పార్కును విస్తరిస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం సిటీ, స్పోర్ట్స్ సిటీ వంటివి అభివృద్ధి చేస్తామన్నారు
ఇవే చెరువులు.. వీరే బిల్డర్లు
హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులను ఏయే బిల్డర్లు అభివృద్ధి చేస్తున్నారంటే..