శంషాబాద్‌లోనే అతి పెద్ద కమర్షియల్ బిల్డింగ్.. రూ.36 లక్షులు ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతినెలా రూ.54 వేలు అద్దె చెల్లిస్తాం..
సదాశివపేట్‌లో సూపర్ వాణిజ్య భవనం.. రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతినెలా రూ.25 వేలు కిరాయి అందుకోండి..
ఈ మధ్య కొందరు అక్రమార్కులు ఎలా తయారయ్యారంటే.. ప్రజల నెత్తి మీద టోపి పెట్టడానికే ప్రయత్నిస్తున్నారు. జనం దగ్గర ముందే డబ్బులు లాగేసుకుని తీరిగ్గా అపార్టుమెంట్లను కట్టడానికి ఆలోచిస్తున్నారు. ముందు అయితే ఏదో ఒక ప్రీలాంచ్ స్కీము అనేసుకుని.. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనల్ని గుప్పించి.. రకరకాల మాయమాటలు చెప్పి.. రేటు తక్కువ అంటూ.. ఇంతకుమించితే బంగారు అవకాశం మరోటి రాదంటూ.. కష్టార్జితాన్ని లాగేస్తున్నారు.
మార్కెట్లోకి మరోరకమైన అక్రమార్కులు ప్రవేశించారు. వాణిజ్య సముదాయాల్లో అద్దె గ్యారెంటీ అంటూ బయ్యర్ల చెవిలో పూవులు పెడుతున్నారు. శంషాబాద్ ఇంకా అభివృద్ధి చెందలేదు. అక్కడ నివసించడానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందనేలేదు. అలాంటి ఏరియాలో ఒక ప్రపంచ స్థాయి వాణిజ్య సముదాయం కడతారట.. అందులో ఎవరైనా రూ.36 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతినెలా అద్దె చెల్లిస్తారట. నగరంలోని ప్రధాన రహదారుల్లో ఉన్న వాణిజ్య భవనాలే.. కొంతకాలం నుంచి టెనెంట్స్ లేకుండా ఖాళీగా కనిపిస్తున్నాయి. వీటిలోకి అద్దెదారులు రాకుండా ఆయా భవన యజమానులు, అందులో పెట్టుబడి పెట్టేవారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఎక్కడో శంషాబాద్‌లోనో, సదాశివపేట్‌లోనో వాణిజ్య నిర్మాణాల్లో ప్రతినెలా మీకు అద్దె చెల్లిస్తామంటే ఎట్టి పరిస్థితిలో నమ్మకండి. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశాలేమిటంటే..
This website uses cookies.