Categories: TOP STORIES

హైదరాబాద్ ఐటీ పార్కులు

కోవిడ్ తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా ఊపందుకుంది. కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోం విధానానికి చాలామంది అలవాటు పడినప్పటికీ తాజాగా భాగ్యనగరంలో భారీ స్థాయిలో ఐటీ పార్కులు ఏర్పాటు అవుతున్నాయి. ప్రపంచ స్థాయి డిజైన్లు, ఆధునిక సౌకర్యాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే సదుపాయాలతో ప్రీమియం గ్రేడ్- ఏ ఆఫీస్ స్పేస్ అందించడానికి పలు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ హైదరాబాద్లో భారీ స్థాయిలో ఆఫీసు సముదాయాలకు శ్రీకారం చుట్టాయి. కరోనా రాకపోయి ఉంటే, ఈపాటికే ఇందులో చాలా భవనాలు అందుబాటులోకి వచ్చేవే. ఏదీఏమైనా, రానున్న రెండేళ్లలో వీటి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పలు బడా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మరి, ఏయే నిర్మాణాలు అందుబాటులోకి రానున్నాయో మీరే ఒక లుక్కెయ్యండి.

సలార్ పూరియా సత్వా నాలెడ్జ్ పార్క్

మాదాపూర్
జీ + 30
రెండు ఆఫీస్ టవర్లు, ఒకటి 30 అంతస్తుల ప్రధాన టవర్.. రెండోది 26 అంతస్తుల సపోర్టింగ్ టవర్
మొత్తం 5.1 మిలియన్ల చదరపు అడుగుల ప్రీమియం గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది.
2023 నాటికి పూర్తి కానుంది.

సువర్ణ దుర్గా టెక్ పార్క్

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
జీ + 31
మొత్తం 1.1 మిలియన్ చదరపు అడుగుల ప్రీమియం ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది.
2023 రెండో త్రైమాసినికి పూర్తికానుంది.

రాజపుష్ప పారడిమ్

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
జీ + 18
2.63 ఎకరాలు
1.05 మిలియన్ చదరపు అడుగుల ప్రీమియం ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది.
దాదాపు పూర్తయింది.

ఇమేజ్ టవర్

జీ + 24
గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ ఆఫీసుల కోసం తెలంగాణ ప్రభుత్వం, సలార్ పురియా గ్రూప్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
1.6 మిలియన్ చదరపు అడుగుల లీజుకిచ్చే స్పేస్ అందుబాటులోకి వస్తుంది.

ఫీనిక్స్ బిజినెస్ హబ్

జీ + 30+ (ఆరు టవర్లు)
30 అంతస్తుల టవర్లు రెండు, 31 అంతస్తుల టవర్ ఒకటి, 36 అంతస్తుల టవర్లు రెండు, 47 అంతస్తుల టవర్ ఒకటి.
9 మిలియన్ చదరపు అడుగుల ప్రీమియం ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది.
ప్రస్తుతం మొదటి టవర్ నిర్మాణం జరుగుతోంది. మిగిలినవి మొదలు కావాలి.

రాజపుష్ప వెస్ట్ అవెన్యూ కోకాపేట సెజ్

జీ + 25 (రెండు టవర్లు)
3.6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది.
2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు.

అరబిందో ఆర్బిట్

జీ + 25
మొత్తం 1.1 మిలియన్ చదరపు అడుగుల ప్రీమియం ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి.
2022 ప్రథమార్థంలో పూర్తి కానుంది.

కళ్యాణీ టెక్ పార్క్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్

జీ + 24
మొత్తం 1.45 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది.
2023 నాటికి పూర్తి కానుంది.

ప్రెస్టీజ్ స్కై టెక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్

జీ + 26 (రెండు టవర్లు)
మొత్తం 2.71 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది.
2023 నాటికి పూర్తి చేయనున్నారు.

ఆర్ఎంజెడ్ నెక్సిటీ అండ్ స్పైర్ హైటెక్ సిటీ

 

జీ + 22 (మూడు టవర్లు), జీ + 27 (రెండు టవర్లు)
మొత్తం 5.1 మిలియన్ చదరపు అడుగుల ప్రీమియం ఆఫీస్ స్పేస్
2023 నాటికి పూర్తి కానుంది.

బీఎస్ఆర్ ఐటీ సెజ్ విప్రో లేక్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్

 

జీ + 21, జీ + 20 (రెండు టవర్లు)
మొత్తం 2.8 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్
ప్రస్తుతం ఒక టవర్ నిర్మాణం పూర్తి. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి.

వాసవి వాటర్ ఫ్రంట్  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్

జీ + 22 (రెండు టవర్లు)
మొత్తం 1.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్
నిర్మాణ దశలో ఉన్నాయి.

జీఏఆర్ లక్ష్మి ఇన్ ఫోబన్ కాంప్లెక్స్ కోకాపేట సెజ్

జీ + 21 నుంచి 40 అంతస్తులు (23 టవర్లు)
మొత్తం 25 మిలియన్ చదరపు అడుగుల ప్రీమియం ఆఫీస్ స్పేస్
మొదటి రెండు టవర్ల నిర్మాణం పూర్తి. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి.
వచ్చే ఐదేళ్లలో రెండు విడతల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మై హోం లైఫ్ హబ్ కోకాపేట సెజ్

జీ +35 (12 టవర్లు)
80 ఎకరాల్లో మొత్తం 12 టవర్లు
మొత్తం 35 మిలియన్ చదరపు అడుగుల ప్రీమియం ఆఫీస్ స్పేస్
వచ్చే 8 నుంచి పదేళ్లలో పూర్తిచేయాలనేది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

This website uses cookies.