poulomi avante poulomi avante

హైదరాబాద్లో ల‌గ్జ‌రీని మించిన విల్లాలు

Here are the few luxury villas to buy in 2023. After this, There are very few companies which will plan to start villas in Hyderabad. This is because of increasing skyscrapers trend currently in our city.

HYDERABAD LUXURY VILLAS TO BUY IN 2023
HYDERABAD LUXURY VILLAS TO BUY IN 2023

  • 2023లో విల్లాల‌కు అపూర్వ ఆద‌ర‌ణ‌!

హైద‌రాబాద్లో ఎన్ని ఆకాశ‌హ‌ర్మ్యాలు ఆరంభ‌మైనా ల‌గ్జ‌రీ విల్లాల‌కు ఆద‌ర‌ణ ఎంత‌మాత్రం త‌గ్గ‌ట్లేదు. కాస్త వైవిధ్య‌మైన ఆధునిక జీవ‌నాన్ని కోరుకునేవారు.. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో నివ‌సించాల‌ని భావించేవారు.. నేటికీ ల‌గ్జ‌రీ విల్లాల వైపే మొగ్గు చూపుతున్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్ వంటి ఖ‌రీదైన ప్రాంతాల్లో ఇల్లు క‌ట్టుకుని నివ‌సించాల‌ని భావించేవారిలో అధిక శాతం మంది.. ఈ విల్లాల వైపు మొగ్గు చూపుతున్నారు. మ‌రి, ఇలాంటి వారంద‌రికీ అందుబాటులో ఉన్న ప‌లు ల‌గ్జరీ విల్లాల స‌మాచారాన్ని రెజ్ న్యూస్ ప్ర‌త్యేకంగా అందిస్తోంది.

మోకిలాలో సామ్ బోల్వార్డ్‌

హైదరాబాద్లోని మోకిలాలో సరికొత్త అల్ట్రా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఆరంభమైంది. సామ్ బోల్వార్డ్ అని నామకరణం చేసిన ఈ ప్రాజెక్టును సుమారు నలభై ఎకరాల్లో ముస్తాబు చేస్తున్నారు. ఒక్కో విల్లా ప్లాటు విస్తీర్ణం.. 300, 400, 475 గజాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 275 విల్లాలు వస్తాయి. ఒక్కో విల్లాను గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తుల్లో కడతారు. క్లబ్ హౌస్ అత్యంత ఆధునికంగా నిర్మిస్తారు. సుమారు 48 వేల చదరపు అడుగుల్లో అత్యాధునికంగా డిజైన్ చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరువలో ప్రశాంతంగా నివసించాలని కోరుకునేవారికి ఈ ప్రాజెక్టు చక్కగా నప్పుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరెందుకు ఆలస్యం.. ఈ ప్రాజెక్టుకు ఒక్కసారి విచ్చేసి మీకు నచ్చిన విల్లాను ఎంచుకోండి. పూర్తిగా 4 ఎకరాల స్థలాన్ని ల్యాండ్ స్కేపింగ్, ఔట్ డోర్ సౌకర్యాల కోసం రిజర్వు చేశారు.

న్యూ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో న‌యా విల్లాలు

హైదరాబాద్లో కొత్తగా డెవలప్ అవుతున్న బిజినెస్ డిస్ట్రిక్టే.. కిస్మత్ పూర్. బుద్వేల్ ఐటీ పార్కు ఏర్పాటు, మెట్రో రైలు వంటి వాటిలో ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారముంది. ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకుని.. భవిష్యత్తు అభివృద్ధి ఫలాలు కొనుగోలుదారులకు అందించాలన్న ఓ ఉన్నతమైన లక్ష్యంతో.. గిరిధారి కన్ స్ట్రక్షన్స్..  గిరిధారి ప్రాస్పరా కౌంటీ పేరుతో కిస్మత్ పూర్లో ప్రారంభించిన ప్రీమియం లగ్జరీ ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేస్తోంది. గిరిధారి ప్రాస్పరా కౌంటీలో మొత్తం 98 హై ఎండ్ విల్లాలను డెవలప్ చేస్తోంది. 4, 4.5 బీహెచ్ కే, ట్రిప్లె క్స్ విల్లాలను మీకు నచ్చిన విల్లాల్ని ఎంచుకోవ‌చ్చు. 4 బీహెచ్ కే విల్లాలను చూస్తే 4750 చదరపు అడుగులు, 5180 చదరపు అడుగుల సైజుల్లో ఉన్నాయి. ఇక 4.5 బీహెచ్ కే విల్లా 6150 చదరపు అడుగుల్లో ఉంటుంది.ఈసా నది పక్కనే నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టుకు మరోవైపు ఆరు వేల ఎకరాల గ్రీన్ రిజర్వ్ ప్రాంతం ఉంది. అటు రివర్ వ్యూ, ఇటు నేషనల్ పార్కు.. చుట్టూ పచ్చదనం.. స్కూళ్లు, రెస్టారెంట్లు, గ్రాసరీ స్టోర్లు అన్నింటికీ దగ్గర్లోనే ఈ ప్రాజెక్టు ఉంది. వంద శాతం పవర్ బ్యాకప్ ఉండటం వల్ల విద్యుత్ సరఫరాకు ఆటంకమే ఉండదు.

విల్లాల్లో రారాజు.. హాల్ మార్క్ ఇంపీరియా

మీకు ఎక్స్ క్లూజివ్ గా ఉండే విల్లా కావాలా? అయితే మీరేమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా.. గోపన్ పల్లి ఉస్మాన్ నగర్ లో రూపుదిద్దుకుంటున్న హాల్ మార్క ఇంపీరియాకు విచ్చేయాల్సిందే. 20 ఎకరాల సువిశాల స్థలంలో 130 విల్లాల్ని డెవ‌ల‌ప్ చేస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ విల్లాను 427.75 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ 2030 చదరపు అడుగులు కాగా, ఫస్ట్ ఫ్లోర్ 1985 చదరపు అడుగులు, సెకండ్ ఫ్లోర్ 1240 చదరపు అడుగుల్లో మొత్తం 5255 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో తీర్చిదిద్దుతున్నారు. వెస్ట్ ఫేసింగ్ విల్లాను.. 427.75 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ 2030 చదరపు అడుగులు కాగా, ఫస్ట్ ఫ్లోర్ 1985 చదరపు అడుగులు, సెకండ్ ఫ్లోర్ 1360 చదరపు అడుగుల్లో మొత్తం 5375 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో నిర్మిస్తున్నారు.

కింగ్స్ కోసం కింగ్‌స్ట‌న్ పార్కు!

వ‌ర్టెక్స్ హోమ్స్ న‌ల్ల‌గండ్ల‌లో కింగ్ స్ట‌న్ పార్కు అనే ఆధునిక ల‌గ్జరీ గేటెడ్ క‌మ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. సుమారు న‌ల‌భై ఎక‌రాల సువిశాల విస్తీర్ణంలో 250 విల్లాల్ని నిర్మిస్తోంది. 2400 ఎక‌రాల గ్రీన్ స్పేస్ అయిన హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీకి చేరువ‌గా ఈ ప్రాజెక్టును ఆరంభించింది. ఇక్క‌డ్నుంచి ఇరవై నిమిషాల్లో జూబ్లీహిల్స్ వెళ్లొచ్చు. ప‌ది నిమిషాల్లో గ‌చ్చిబౌలి విప్రో జంక్ష‌న్‌కు చేరుకోవ‌చ్చు. ఒక్కో విల్లా విస్తీర్ణం సుమారు 4020 నుంచి 7500 చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మిస్తారు. ఇందులో పొందుప‌ర్చిన ఆధునిక స‌దుపాయమంటూ లేదు. నిర్మాణ ప‌నులు జోరుగా జ‌రుగుతున్న ఈ ప్రాజెక్టు నుంచి షాపింగ్ మాళ్లు, ఆస్ప‌త్రులు చేరువగా ఉంటాయి. ఇక్క‌డ్నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యానికి సులువుగా చేరుకోవచ్చు.

స‌రికొత్త ప్ర‌పంచం.. ఎస్ఎంఆర్ విన‌య్ కాసా కరీనో

HYDERABAD LUXURY VILLAS TO BUY IN 2023
HYDERABAD LUXURY VILLAS TO BUY IN 2023

ల‌గ్జ‌రీ జీవ‌నాన్ని కోరుకునేవారి కోసం రూపుదిద్దుకున్న మ‌హ‌త్త‌ర ప్రాజెక్టే.. ఎస్ఎంఆర్ విన‌య్ కాసా క‌రీనో. సీఎం కేసీఆర్ ఇటీవ‌ల శంకుస్థాప‌న చేసిన మెట్రో రైలు స్టేష‌న్‌కి స‌మీపంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సుమారు 22.175 ఎక‌రాల్లో 145 ల‌గ్జ‌రీ విల్లాల్ని సంస్థ డిజైన్ చేసింది. ఒక్కో ట్రిప్లేక్స్ విల్లాను 254 నుంచి 447 గ‌జాల్లో అభివృద్ధి చేస్తున్నారు. బిల్ట‌ప్ ఏరియా విష‌యానికి వ‌స్తే.. 3790 నుంచి 5499 చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మిస్తున్నారు. టెర్ర‌స్ పూల్‌ను ఈ ప్రాజెక్టు ద్వారా ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ప్ర‌వేశ‌పెట్టింది. వాస్తు సూత్రాల‌కు అనుగుణంగా నిర్మించిన ఈ ప్రాజెక్టులో క్ల‌బ్‌హౌజ్‌తో పాటు ల్యాండ్ స్కేపింగ్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. ప్ర‌తి విల్లాలో లిఫ్టు సౌక‌ర్యం క‌ల్పిస్తారు. వాట‌ర్ ఫౌంటెయిన్లు, చిల్డ్ర‌న్ ప్లే ఏరియాలు, జాగింగ్ ట్రాక్‌, విశాల‌మైన డ్రైవ్ వే వంటివి నివ‌సించేవారిని అమితంగా ఆక‌ట్టుకుంటాయి. అత్యాధునిక ప్ర‌పంచంలో నివ‌సిస్తున్నామ‌నే అనుభూతిని ఇందులో నివాసితుల‌కు క‌లిగే విధంగా సంస్థ ఈ విల్లా క‌మ్యూనిటీని తీర్చిదిద్దింది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles