హైదరాబాద్‌లో ఎస్ఎంఆర్ వంటి నిర్మాణ సంస్థలు.. అడ్వాన్స్ స్టేజీలో సబ్ వెన్షన్ స్కీమును ప్రకటించిన విషయం తెలిసిందే. మరి, దీని వల్ల కొనుగోలుదారులకు కలిగే ప్రయోజనం ఏమిటి? రెజ్ న్యూస్ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం మీకోసం.
ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ టీఎస్‌పీఏ జంక్షన్‌లోని కిస్మత్‌పురాలో ఎస్ఎంఆర్ వినయ్ బౌల్డర్ వుడ్స్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మొత్తం ఎనిమిది ఎకరాల్లో రెండు టవర్లను కడుతోంది. ఇందులో వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 583 దాకా ఉంటాయి. ఎనిమిది ఎకరాలు లభిస్తే వెయ్యికి పైగా ఫ్లాట్లను కట్టే సంస్కృతి ఆరంభమైన హైదరాబాద్ రియల్ రంగంలో.. ఇంత తక్కువ సంఖ్యలో ఫ్లాట్లు రావడమంటే ఆనందించాల్సిందే. ఈ సంస్థ రెండు పడక గదుల ఫ్లాట్ విస్తీర్ణాన్ని 1340 చదరపు అడుగుల్లో కడుతోంది. ధర చదరపు అడుక్కీ రూ. 6500 చెబుతోంది. ఈ రేటు చొప్పున ఫ్లాట్ కొంటే.. అమినిటీస్, కారు పార్కింగును లెక్కిస్తే.. తుది ధర సుమారు కోటి రూపాయలు అవుతుంది. ఆరంభంలో బయ్యర్లు రూ.20 లక్షలు కడితే చాలు.. ఏడాది దాకా వడ్డీ కట్టక్కర్లేదు. అంటే, సుమారు రూ. 6 లక్షల వడ్డీ భారాన్ని సంస్థే భరిస్తుంది. ఈ మొత్తాన్ని మినహాయిస్తే.. గృహప్రవేశం చేసిన తర్వాత మీరు చెల్లించే నెలసరి ఈఎంఐ కేవలం రూ.57 వేల దాకా అవుతుంది. లేకపోతే, రూ.80 లక్షల రుణంపై నెలసరి వడ్డీ ఎంతలేదన్నా రూ.62 వేలు దాకా అవుతుందని గుర్తుంచుకోండి.
అంత ఎలా పెరుగుతుందా?
ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సంస్థ బండ్లగూడలో నాణ్యమైన గేటెడ్ కమ్యూనిటీల సముదాయాల్ని నిర్మించడానికి ప్రణాళికల్ని రచించింది. అంటే, ఒకే నాలుగు విభిన్నమైన గేటెడ్ కమ్యూనిటీలకు ఇక్కడ అభివృద్ధి చేస్తోంది. ప్రతి ప్రాజెక్టును విడివిడిగా తీర్చిదిద్ది.. అన్నింటికీ కలిపి ఓకే ప్రధాన రహదారిని ఏర్పాటు చేసింది. ప్రతి కమ్యూనిటీకి విడిగా ప్రవేశ మార్గం, భద్రత సదుపాయాలుంటాయి. అన్ని కమ్యూనిటీలకు కలిపి ప్రత్యేకంగా ఒక క్రికెట్ గ్రౌండ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. నాలుగేళ్ల క్రితం ఇందులో అనేక మంది చదరపు అడుక్కీ రూ.2700- 2,800కే ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడేమో ఫ్లాట్ ధర సుమారు రూ.6500కు చేరింది. కాబట్టి, వచ్చే నాలుగేళ్లలో కూడా రేటు ఇదేవిధంగా రెట్టింపయ్యే వీలుంది. కాబట్టి, మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్‌లో మీకు అన్నివిధాల నప్పే ఫ్లాటును సొంతం చేసుకోండి.
* ఫ్లాట్ తుది ధర, వడ్డీ రేటు, రుణ వ్యవధి, ఆరంభంలో చెల్లించే మొత్తం బట్టి.. నెలసరి ఈఎంఐ మారుతుందని గుర్తుంచుకోండి.