poulomi avante poulomi avante

హైద‌రాబాద్‌.. మినియేచ‌ర్ ఆఫ్ ఇండియా

  • రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ఒక “మినీయేచర్ ఆఫ్ ఇండియా”గా దిన‌దినాభివృద్ధి చెందుతోంద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ దినం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దినదినాభివృద్ధి చెందుతున్న మ‌న మహానగరంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు హెచ్.ఎం.డీ.ఏ పరిధిలో మురుగునీటి నిర్వహణ కోసం సీవరేజ్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నదన్నారు. నగరంలో నిరంతరం తాగునీటి సరఫరా కోసం 2,214 కోట్ల రూపాయలతో చేపట్టిన సుంకిశాల ఇన్ టేక్ వెల్ పనులు త్వరలో పూర్తి కానున్నాయని వెల్ల‌డించారు. ఇంకా ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..

రోజురోజుకూ పెరుగుతున్న విమాన ప్రయాణీకుల రవాణా సౌకర్యం కోసం హైదరాబాద్ నలుమూలల నుంచి విమానాశ్రయానికి మెట్రోరైలు విస్తరణకు రూపకల్పన చేసుకున్నాం. మొత్తం 6,250 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం తన సొంత నిధులతోనే వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలని సంకల్పించింది, దీనికి శంకుస్థాపన సైతం జరుపుకున్నాం.

రాజధాని నగరంలో మౌలిక వసతులు మెరుగు పరచడానికి ప్రభుత్వం పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించడం కోసం ఎస్సార్డీపీ కింద 67 వేల 149 కోట్ల రూపాయలతో 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్వోబీల అభివృద్ధి చేపట్టింది. వీటిలో చాలా భాగం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 275 కోట్ల రూపాయలతో 22 లింక్ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్ ను చూసినవారు ఆశ్చర్యానందాలకు గురవుతున్నారు. ప్రపంచంలోని ఏ ప్రతిష్టాత్మక నగరానికీ తీసిపోని స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని వారంతా కితాబునిస్తుండటం మనందరికీ గర్వకారణం.

తెలంగాణకు హరితహారం

సమైక్య రాష్ట్రంలో జరిగిన పర్యావరణ విధ్వంసం నుండి కోలుకునేందుకు, అడవుల పునరుద్ధరణ కోసం, రాష్ట్రవ్యాప్తంగా చెట్ల పెంపకం కోసం ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టింది. హరించుకుపోయిన వనాలను పునరుద్ధరించి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించుకున్నాం. ప్రజా సహకారంతో ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం.

గత తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 273 కోట్ల మొక్కలు నాటుకున్నాం. 2015-16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2023 నాటికి అది 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06 ఉన్నాయి. చెట్ల సాంద్రత 2014లో 2,549 చ.కి.మీ. ఉండగా.. ప్రస్తుతం అది 2,848 చ.కి.మీలకు పెరిగింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొనటం సంతోషదాయకం.
ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోనే పార్కులు అంతగా అందుబాటులో ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా వాటి నిర్వహణ సరిగా జరిగేది కాదు. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రతీ గ్రామంలో ఒక నర్సరీతోపాటు, 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2,725 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష కిలోమీటర్ల పొడవునా రహదారి వనాలు పూర్తిచేశాం. అందుకే ఇప్పుడు ఏ రోడ్డు వెంట వెళ్లినా పచ్చదనం కనువిందు చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వాళ్లు తెలంగాణ పొలిమేరల్లోకి రాగానే వర్ణశోభితమై కనువిందు చేస్తున్న చెట్లను చూసి పులకించి పోతున్నారు, ఇది మనకు గర్వకారణం. పట్టణాల్లో 700 కోట్ల రూపాయల వ్యయంతో 179 చోట్ల అర్బన్ ఫారెస్టు పార్కులు ఏర్పాటు చేసుకున్నాం. హరితహారం ఇచ్చిన సత్ఫలితాలతో మన హైదరాబాద్ నగరం ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా రెండుసార్లు గుర్తింపు పొందింది.
రానున్న వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగానే జూన్ 19వ తేదీన హరితోత్సవాన్ని జరుపుకుందాం. ఇందులో అన్ని సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, రహదారుల వెంట, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో అన్ని చోట్లా, అడుగడుగునా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఈ కార్యక్రమంలో ఆబాల గోపాలం భాగం పంచుకోవాలని పిలుపునిస్తున్నాను. హరితహారం ద్వారా ఫలసాయం ఇచ్చే మొక్కలతోపాటు, తాటి, ఈత మొక్కలను కూడా పెద్ద సంఖ్యలో నాటి గీతకార్మికుల ఉపాధికల్పనకు కూడా దోహదం చేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదు. చైనా, బ్రెజిల్ తర్వాత పచ్చదనాన్ని పెంచేందుకు జరుగుతున్న అతి పెద్ద మానవ మహా ప్రయత్నంగా తెలంగాణకు హరితహారం అంతర్జాతీయ ఖ్యాతి గడించిందన్నారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles