Categories: TOP STORIES

హైద‌రాబాద్ టాప్ ప్రాజెక్ట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ 2025..

హైద‌రాబాద్‌లో అనేక నిర్మాణ సంస్థ‌లు ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నాయి. అందులో కొన్ని కంపెనీలు మాత్ర‌మే.. బ‌య్య‌ర్ల‌కు ఫ్లాట్ల‌ను హ్యాండోవ‌ర్ చేస్తాయి. ఎలాగూ ఈ ప్రాజెక్టుల‌కు టీజీ రెరా అనుమ‌తి ఉంది కాబ‌ట్టి ఎలాంటి ఇబ్బందులొచ్చినా వాళ్ల‌దే బాధ్య‌త‌. పైగా, టీజీ రెరా నిబంధ‌న‌ ప్ర‌కారం.. ప్రాజెక్టును బిల్డ‌ర్ హ్యాండోవ‌ర్ చేసిన త‌ర్వాత‌.. ఐదేళ్ల దాకా స్ట్ర‌క్చ‌ర్‌లో ఎలాంటి స‌మ‌స్య‌లొచ్చినా డెవ‌ల‌ప‌ర్ల‌దే బాధ్య‌త అనే విష‌యాన్ని ప్ర‌తిఒక్క‌రూ గుర్తించాలి. కాబ‌ట్టి, బిల్డ‌ర్లు త‌ప్ప‌కుండా నాణ్య‌తా ప్ర‌మాణాల్ని పాటిస్తూ.. ప్రాజెక్టుల్ని నిర్మించాల్సిందే. సో, హైద‌రాబాద్‌లో టాప్ ప్రాజెక్ట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ 2025 సెగ్మంట్‌లో మేం స‌జెస్ట్ చేస్తున్న కొన్ని ప్రాజెక్టుల వివ‌రాల్ని ఇక చూసేద్దామా..

హైద‌రాబాద్‌లో రెండు ద‌శాబ్దాల‌కు పైగా రియ‌ల్ రంగంలో అనుభ‌వమున్న శాంతా శ్రీరాం క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌, జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా, ముప్పా ప్రాజెక్ట్స్‌, రాధే గ్రూప్‌, హ‌రిహ‌రా ఎస్టేట్స్ వంటి కంపెనీలు.. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల్న నిర్మిస్తున్నాయి. శాంతాశ్రీరాం సంస్థ టీజీపీఏ జంక్ష‌న్ చేరువ‌లోని పిరంచెరువులో ద బోధివృక్ష అనే ప్రాజెక్టును నిర్మిస్తోంది. కోకాపేట్ త‌ర్వాత వ‌చ్చే కొల్లూరులో జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా జీహెచ్ఆర్ క‌లిస్టో ప్రాజెక్టును డిజైన్ చేసింది. ముప్పా ప్రాజెక్ట్స్ సంస్థ తెల్లాపూర్‌లో ముప్పా మెలోడి అనే ల‌గ్జ‌రీ ప్రాజెక్టును చేప‌ట్టింది. రాధే గ్రూప్ కొల్లూరు- వెలిమ‌ల‌లో స్కై అనే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఉప్ప‌ల్ త‌ర్వాత వ‌చ్చే పీర్జాదిగూడ‌లో హ‌రిహ‌రా ఎస్టేట్స్ సంస్థ‌.. శ్రీ సాయి యతిక ప్రాజెక్టును ఆరంభించింది. మ‌రి, ఈ ప్రాజెక్టుల ప్ర‌త్యేక‌త‌లేమిటి? బిల్డ‌ర్ల బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ? ఎక్క‌డ నిర్మిస్తున్నారు? మొత్తం క‌ట్టే ఫ్లాట్లు ఎన్ని? ఎప్పుడు హ్యాండోవ‌ర్ చేస్తారు?

బోధివృక్ష @ పిరంచెరువు, టీజీపీఏ జంక్ష‌న్‌

 

అటు గ‌చ్చిబౌలి ఇటు ఎయిర్‌పోర్టు మ‌ధ్య‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాల‌ని భావించేవారికి ప‌ర్‌ఫెక్టుగా సూట్ అవుతుంది శాంతాశ్రీరాం క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ డెవ‌ల‌ప్ చేస్తున్న బోధివృక్ష ప్రాజెక్టు. హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో సుమారు 29 ఏళ్ల అనుభ‌వ‌మున్న ఈ సంస్థ‌.. ఎన‌భై ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి.. ఎనిమిది వేల కుటుంబాల‌కు సొంతింటిని అంద‌జేసింది. 3 ట‌వ‌ర్ల‌లో 776 ఫ్లాట్ల‌ను నిర్మిస్తోంది. 1389 నుంచి 1975 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ల‌ను డిజైన్ చేసింది. క్ల‌బ్‌హౌజ్‌ను 39 వేల 701 చ‌ద‌ర‌పు అడుగుల్లో.. టూ ఎక్స్‌క్లూజివ్ ఫోర్ లెవెల్ క్ల‌బ్ హౌజుల్ని డెవ‌ల‌ప్ చేస్తోంది. ఒక్కో టవర్‌లో డెడికేటెడ్‌ ప్లే జోన్స్ ఉన్నాయ్‌. వీటికి 55 వేల 385 స్క్వేర్‌ఫీట్ స్థ‌లాన్ని కేటాయించారు.

రాధే స్కై ఎట్ కొల్లూరు- వెలిమ‌ల‌

2025లో హైద‌రాబాద్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని భావించేవారికి.. రెజ్‌టీవీ స‌జెస్ట్ చేస్తున్న రెరా అనుమ‌తి ప్రాజెక్టే.. స్కై ప్రాజెక్ట్ ఎట్ కొల్లూరు. ఎకానమీ ప్రైస్‌కే లగ్జరీ ఫెసిలిటీస్‌తో అపార్ట్‌మెంట్స్ కావాల‌ని కోరుకునేవారికి చ‌క్క‌టి ఆప్ష‌న్‌.. స్కై. రాధే కన్‌స్ట్రక్షన్స్ అనుబంధ సంస్థ అయిన క్లౌడ్స్‌వుడ్‌ కన్‌స్ట్రక్షన్స్ ఈ ప్రాజెక్టును డెవ‌ల‌ప్ చేస్తోంది. ఇందులో మొత్తం ఏడు బ్లాక్‌లు ఉండగా.. 1325 ఎస్ఎఫ్‌టీ నుంచి 2610 చదరపు అడుగుల్లో టూ బీహెచ్‌కే, త్రీ బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. రెగ్యులర్‌గా ఉండే క్లబ్‌హౌస్‌, ఇండోర్‌, ఔట్‌డోర్ ఎమినిటీస్‌తో పాటు స్టిల్ట్‌ ఎమెనిటీస్‌ ఉండటం ఈ కమ్యూనిటీ ప్రత్యేకత.

ముప్పా మెలోడి@ తెల్లాపూర్

హైద్రాబాద్‌లో ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్స్‌కి పెట్టింది పేరు ముప్పా ప్రాజెక్ట్స్‌.. రీనౌన్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌, రిమెంబర్డ్‌ ఫర్‌ కమిట్మెంట్‌ అంటూ గర్వంగా చెప్పుకునే ముప్పా సంస్థ‌.. భాగ్యనగరంలో అనేక గేటెడ్‌ కమ్యూనిటీస్‌, లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌, విల్లాస్‌ను విజయవంతంగా నిర్మించింది. చెప్పిన స‌మ‌యానికి ప్రాజెక్ట్‌ల‌ను డెలివరీ చేస్తూ బయ్యర్ల నమ్మకాన్ని పొందింది ముప్పా కంపెనీ. మోస్ట్ ప్రామిసింగ్ లొకేష‌న్‌లో అఫ‌ర్డ‌బుల్ ల‌గ్జ‌రీ ఫ్లాట్స్ కావాల‌ని కోరుకునేవారి కోసం రెజ్ టీవీ స‌జెస్ట్ చేస్తున్న ప్రాజెక్టే.. ముప్పా మెలోడి ఎట్ తెల్లాపూర్‌. సుమారు 8.33 ఎకరాల్లో విస్తరించిన ముప్పా మెలోడీలో 7 బ్లాక్‌లు ఉండ‌గా.. ఒక్కో బ్లాక్‌ను 17 ఫ్లోర్ల ఎత్తులో తీర్చిదిద్దారు. ఇందులో వ‌చ్చే ఫ్లాట్ల సంఖ్య‌.. 1045 ఫ్లాట్లు. 1010 నుంచి 1725 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో.. 2 బీహెచ్‌కే, 2.5, త్రీ బీహెచ్‌కే ఫ్లాట్లు అమ్మ‌కానికి సిద్ధంగా ఉన్నాయి.

ఈస్ట్‌హైద‌రాబాద్‌లో.. శ్రీ సాయి యతిక

ఈస్ట్‌ హైద్రాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌ని కొత్త పుంతలు తొక్కించిన సంస్థల్లో హరి హర ఎస్టేట్స్‌ది ఫస్ట్‌ ప్లేస్‌. గత 30 ఏళ్లుగా హైద‌రాబాద్‌ నిర్మాణ రంగంలో సుమారు 28 లక్షల చదరపు అడుగులకు పైగా డెవలప్‌ చేసింది. 34 ప్రాజెక్ట్‌లను డెలివరీ చేసిన ఈ సంస్థకు 1700 కి పైగా హ్యాపీ కస్టమర్లు ఉన్నారు. హ‌రిహ‌రా ఎస్టేట్స్ ఉప్ప‌ల్ త‌ర్వాత వ‌చ్చే పీర్జాదిగూడ‌లో.. శ్రీ సాయి యతిక ప్రాజెక్టును డెవ‌ల‌ప్ చేస్తోంది. 2.85 ఎకరాల్లో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌లో 280 ఫ్లాట్లను డెవలప్‌ చేస్తోంది. 1635 చదరపు అడుగుల నుంచి 2435 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో.. విశాలమైన త్రీ బీహెచ్‌కే ఫ్లాట్స్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. స్థిర నివాసం కోసమైనా.. పెట్టుబ‌డి కోస‌మైనా.. ఇంతకు మించిన బెస్ట్ ప్రాజెక్ట్ ఉండదేమో..!

జీహెచ్ఆర్ క‌లిస్టో @ కొల్లూరు

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో రెండు ద‌శాబ్దాల‌కు పైగా అనుభ‌వం జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా.. కొల్లూరులో 8.3 ఎక‌రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టే.. జీహెచ్ఆర్ క‌లిస్టో. ఇందులో నాలుగు ట‌వ‌ర్ల‌లో ప‌ద‌కొండు బ్లాకుల్ని నిర్మిస్తున్నారు. ఒక్కో బ్లాకును 18 అంతస్తుల ఎత్తులో డెవ‌ల‌ప్ చేస్తున్నారు. జీహెచ్ఆర్‌ క‌లిస్టో ప్రాజెక్టులో వ‌చ్చేవి 1190 ఫ్లాట్లు. ఫ్లాట్ల‌ను సుమారు 1195 నుంచి 1915 చ‌ద‌ర‌పు అడుగుల్లో క‌డుతున్నారు. 3300 చదరపు అడుగుల నుంచి 3385 చదరపు అడుగుల్లో స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. దాదాపు 50 వేల చదరపు అడుగుల్లో క్ల‌బ్ హౌజ్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ తో పాటు ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ వంటివి పొందుప‌రిచారు.

This website uses cookies.