గురుగ్రామ్ లో భారీ అద్దె లావాదేవీ నమోదైంది. గురుగ్రామ్ కు చెందిన ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ ప్రొవైడర్ స్మార్ట్ వర్క్స్ ఇక్కడి డీఎల్ఎఫ్ సిటీ ఫేజ్-5లో ఆఫీస్ స్పేస్ ను ఆరేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. 4.7 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని రూ.94 కోట్లకు లీజుకు తీసుకుంది. ఐదు అంతస్తుల్లో ఈ స్పేస్ ఉంది. 2025 మార్చి నుంచి అద్దె ఒప్పందం ప్రారంభమవుతుంది. చదరపు అడుగుకు రూ.165 చొప్పున అద్దె పడినట్టయింది. అద్దె ఒప్పందం కోసం రూ.47.3 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. మూడేళ్ల తర్వాత అద్దె 9 శాతం చొప్పున పెరుగుతుంది. అలాగే 794 కార్ పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయి.
కాగా, స్మార్ట్ వర్క్స్ గతేడాది ఆగస్టులో పుణెలోని ఓ భవనంలో 6.13 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని నెలకు రూ.4.44 కోట్ల అద్దెకు ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. ఈ కంపెనీ పుణెలోని తన పోర్ట్ ఫోలియోను విస్తరించడం ద్వారా 3 మిలియన్ చదరపు అడుగులకు చేర్చింది. స్మార్ట్ వర్క్స్ కంపెనీకి బెంగళూరు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, హైదరాబాద్, గురుగ్రామ్, చెన్నై సహా పలు నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మార్చి 31, 2024 నాటికి 13 నగరాల్లో 8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 41 కేంద్రాలతో కూడిన పోర్ట్ ఫోలియోను కలిగి ఉంది. కాగా, గురుగ్రామ్ లో ఇటీవల అద్దె లావాదేవీలు బాగా ఖరీదయ్యాయి.
అంతకుముందు విరాట్ కోహ్లీ గురుగ్రామ్‌లోని 12 ఆఫీస్ స్పేస్‌లను తొమ్మిదేళ్లపాటు లీజుకు తీసుకున్నాడు, దీని ప్రారంభ నెలవారీ అద్దె రూ.8.85 లక్షలు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 68లోని కార్పొరేట్ టవర్ అయిన రీచ్ కమర్సియా అనే ప్రాజెక్టులో ఈ ఆఫీస్ స్పేస్ ఉంది. మొత్తం లీజు ప్రాంతం 18,430 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనికి 37 కార్ పార్కింగ్స్ వచ్చాయి. 2023 డిసెంబర్లో గుర్గావ్‌లోని ఇ-ఇన్నోవేషన్ సెంటర్ సెక్టార్ 75లో 6.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య స్థలాన్ని 21 సంవత్సరాలకు రూ.90 కోట్లకు పైగా వార్షిక అద్దెకు తీసుకునేందుకు ఎయిర్ ఇండియా లీజు ఒప్పందంపై సంతకం చేసింది.
This website uses cookies.