poulomi avante poulomi avante

హైదరాబాద్ విల్లా ప్రాజెక్ట్స్

హైదరాబాద్లో లగ్జరీ విల్లాలు ప్రతిఒక్కర్ని ఇట్టే ఆకర్షిస్తున్నాయి.. దాదాపు అన్నీ నాలుగు, ఐదు పడక గదుల వైవిధ్యమైన విల్లాలే.. అంతకుమించిన సైజుల్లో కావాలన్నా దొరుకుతాయి.. ఒక్కో ప్రాజెక్టుది భిన్నమైన డిజైన్.. ఆకట్టుకునే ఎలివేషన్లు.. విశాలమైన ఓపెన్ స్పేసెస్.. మనసకు నచ్చేలా పచ్చదనం.. ఆకర్షణీయమైన ల్యాండ్ స్కేపింగ్.. కొదవే లేని ఆధునిక సదుపాయాలు.. మొత్తానికి, ఓ విదేశీ నగరంలో నివసిస్తున్నామా అనే అనుభూతిని కలిగించేలా రూపుదిద్దుకుంటున్నాయి. భాగ్యనగరంలోని లగ్జరీ విల్లా ప్రాజెక్టులు. మరి, ఈ వారం వైవిధ్యమైన పలు లగ్జరీ విల్లా ప్రాజెక్టుల వివరాలు.. రియల్ ఎస్టేట్ గురు పాఠకుల కోసం ప్రత్యేకం.

1)
పేరు: ప్రెస్టన్ ఐవీ
ఎక్కడ: కాకతీయ హిల్స్
సైజు: 4-4.5 బీహెచ్కే విల్లాలు
సంఖ్య: 89
పూర్తి: మే 2023
ధర: రూ. 5.06 Cr +
జూబ్లీహిల్స్ చేరువలోని మాదాపూర్ కాకతీయ హిల్స్ లో ప్రెస్టన్ డెవలపర్స్ సంస్థ.. ప్రెస్టన్ ఐవీ అనే లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీని ఆరంభించింది. ఇందులో వచ్చేవన్నీ 4-4.5 పడక గదుల విల్లాలే. 2018 జనవరిలో ఆరంభమైన ఈ 89 విల్లాల ప్రాజెక్టును 2023 మేలోగా పూర్తి చేయాలని ప్రెస్టన్ డెవలపర్స్ ప్రణాళికల్ని రచిస్తోంది. మాదాపూర్ కి చేరువగా ఉండటమే ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణ. కొంతకాలం క్రితం వేసిన 200 అడుగుల రోడ్డు మీదుగా ప్రెస్టీన్ ఐవీకి సులువుగా వెళ్లొచ్చు.
2)
పేరు: హేల్సియాన్ హోమ్స్
ఎక్కడ: ఉస్మాన్ నగర్
సైజు: 4,5 బెడ్రూమ్ విల్లాలు
సంఖ్య: 49
పూర్తి: 2024 డిసెంబరు
ధర: రూ.4.5+ కోట్లుసీఎంజీ బిల్డర్స్ హేల్సియాన్ హోమ్స్ అనే లగ్జరీ విల్లా ప్రాజెక్టును తెల్లాపూర్ చేరువలోని ఉస్మాన్ నగర్లో నిర్మిస్తోంది. దాదాపు 5.5 ఎకరాల్లో 49 విల్లాల్ని నిర్మిస్తోంది. ఇందులో 4, 5 బెడ్రూం పడక గదుల విల్లాల్ని కడుతోంది. ఒక్కోటి 3,627 నుంచి 4600 చదరపు అడుగుల్లో నిర్మిస్తోంది. 2024 డిసెంబరులోపు కొనుగోలుదారులకు విల్లాల్ని అందించేందుకు ప్రణాళికల్ని రచిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో ఈ నిర్మాణాన్ని సంస్థ చేపడుతోంది.

 

 

3)
పేరు: ఎస్ఎంఆర్ వినయ్ కాసా కరీనో
ఎక్కడ: బండ్లగూడ (టీఎస్పీఏ జంక్షన్)
సైజు: 4 బెడ్రూమ్
సంఖ్య:143
పూర్తి: 2023
ధర: ₹ 6.46 Cr – ₹ 7.67 Crఎస్ఎంఆర్ డెవలపర్స్ బండ్లగూడలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఎస్ఎంఆర్ కాసా కరీనో అనే లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీని ఆరంభించింది. ఇందులో వచ్చేవన్నీ నాలుగు పడక గదుల విల్లాలే. ఒక్కో విల్లా విస్తీర్ణం దాదాపు 4310 నుంచి 5116 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. నివాసితులకు అవసరమయ్యే లగ్జరీ సదుపాయాలన్నీ ఇందులో పొందుపరుస్తోంది. విశాలమైన విల్లాల్లో నివసించాలని కోరుకునేవారికి ఈ ప్రాజెక్టు చక్కగా నప్పుతుంది.

hyderabad vill project1.jpeg

4)
పేరు: నార్త్ స్టార్ అల్లూరా
ఎక్కడ: కోకాపేట్
సైజు: 4 బెడ్రూమ్
సంఖ్య: 35
పూర్తి: 2024 మే
ధర: రూ. 5.09 Cr+నార్త్ స్టార్ హోమ్స్ కోకాపేట్లోని గండిపేట్ మెయిన్ రోడ్డులో ఆరు ఎకరాల్లో 35 లగ్జరీ విల్లాల్ని నిర్మిస్తోంది. 2019 మార్చిలో ఆరంభమైన నార్త్ స్టార్ అల్యూరా 2024 మే లోపు పూర్తి చేయడానికి ప్రణాళికల్ని రచిస్తోంది. ఇందులో వచ్చేవన్నీ ఫోర్ బెడ్రూమ్ విల్లాలే. విస్తీర్ణం 4244 నుంచి 4729 చదరపు అడుగుల్లో ఉంటుంది. ఈ ప్రాజెక్టు ఎలివేషన్ని కాస్త భిన్నంగా, ఆధునికంగా డిజైన్ చేసింది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
5) పేరు: గిరిధారి ప్రాస్పరా కౌంటీ
ఎక్కడ: కిస్మత్ పూర్
సైజు: 4 బెడ్రూమ్
సంఖ్య: 98
పూర్తి: 2023 సెప్టెంబరు
ధర: 14,000 (చ.అ.కీ.)గిరిధారి కన్ స్ట్రక్షన్స్ టీఎస్పీఏ జంక్షన్ చేరువలోని కిస్మత్ పూర్లో 12.9 ఎకరాల్లో ఆధునిక లగ్జరీ విల్లా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఒక్కో విల్లాను 240+ గజాల్లో నిర్మించింది. బిల్టప్ ఏరియా దాదాపు 4,750 చదరపు అడుగుల దాకా ఉంటుంది. ఈసా నది పక్కనే నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టుకు మరోవైపు ఆరు వేల ఎకరాల గ్రీన్ రిజర్వ్ ప్రాంతం ఉంది. అందుకే, ఈ ప్రాజెక్టులో విల్లాల్ని కొనేందుకు కొందరు ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. విల్లా ఎలివేషన్ వైవిధ్యంగా ఉండేలా సంస్థ తీర్చిదిద్దింది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles