Categories: TOP STORIES

హైడ్రా పేరుతో వసూళ్లు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు

ముఖ్యమంత్రి హెచ్చరిక

హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పందించారు. గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని.. కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, అటువంటి వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీఎం హెచ్చ‌రించారు.

ఇలాంటి వ‌సూళ్ల‌కు పాల్ప‌డే వారిపై ఫోక‌స్ పెట్టాల‌ని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల‌ను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. అయితే, మాదాపూర్‌లోని అయ్య‌ప్ప సొసైటీ ప‌రిధిలోని కొన్ని అక్ర‌మ క‌ట్ట‌డాల నుంచి చ‌ద‌ర‌పు అడుక్కీ ఏడు వంద‌ల నుంచి వెయ్యి రూపాయ‌లు దాకా కొంద‌రు వ‌సూలు చేస్తున్నార‌ని స‌మాచారం.

This website uses cookies.