హైదరాబాద్‌లో ఎప్పటికైనా ఓ సొంతిల్లు కొనుక్కోవాలనే కల చాలామందికి ఉంటుంది. కాకపోతే, కొందరే సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. మిగతావారు ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు సొంతింట్లోకి అడుగు పెట్టలేరు. కాస్త ధైర్యంగా అడుగు ముందుకు వేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. మరి, మీకు అన్నివిధాల నప్పే గృహాన్ని ఎంచుకోవాలంటే.. కాస్త సాహసం చేయాల్సిందే. ఎందుకో తెలుసా?
ఇల్లు కొనేటప్పుడు ఎక్కువ శాతం ఏం జరుగుతుందంటే.. మీరు అనుకుంటున్న బడ్జెట్‌కి.. మార్కెట్లో ఉన్న ఫ్లాట్ల రేటుకి.. కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం తేడా ఉంటుంది. ఈ విషయం తెలుసుకుని కొందరు కొనుగోలుదారులు ఒక్కసారిగా నీరసపడిపోతారు. ఈ జన్మకి సొంతిల్లు కొనలేమనే నిర్ణయానికి వస్తారు. అయితే, ఇలాంటప్పుడు కాస్త తెలివిగా ఆలోచించాలి. ఇప్పుడు మీ జీతం తక్కువే ఉండొచ్చు. ఒకట్రెండేళ్లలో మీ జీతం ఎలాగూ పెరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అలా కాకుండా, రెండేళ్ల తర్వాత జీతం పెరిగిన తర్వాత ఇల్లు కొనాలని అనుకుంటే మాత్రం.. ఇప్పుడున్న రేటు ఉండనే ఉండదు. కాబట్టి, మీరు ఎప్పుడు కొనాలని అనుకున్నా.. ఈ వ్యత్యాసమైతే కచ్చితంగా ఉంటుంది. అందుకే, సొంతింట్లోకి అడుగుపెట్టాలంటే ధైర్యంగా అడుగు ముందుకేస్తేనే సాధ్యమవుతుంది.
మీరు ఇప్పటివరకూ ఎంత పొదుపు చేశారో ఆ మొత్తంతో పాటు.. అవసరమైతే పీఎఫ్ విత్‌డ్రా చేసి.. ఉన్న బంగారమంతా బ్యాంకులో పెట్టి.. ఇంకా సరిపోకపోతే బంధుమిత్రుల వద్ద చేబదులు తీసుకుని అయినా సొంతిల్లు కొనుక్కోవాలి. అయితే, మీరు ఇల్లు కొన్న తర్వాత.. ఏడాది నుంచి రెండేళ్ల పాటు ఆర్థికంగా కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించేందుకు భార్యాభర్తలిద్దరూ ఆర్థిక వ్యవహారాల్లో పక్కా ప్రణాళికల్ని రచించుకోవాలి. ఈ ఒకట్రెండేళ్లు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే.. మీరు జీవితాంతం సొంతింటి ఆనందాన్ని ఆస్వాదిస్తారని గుర్తుంచుకోండి.
ఇల్లు కొనాలని భావించేవారిలో కొందరు ఎలా ఉంటారంటే.. ఎప్పుడు నిర్ణయాన్ని తీసుకోరు. రియల్ ఎస్టేట్ గురించి అంతా తనకే తెలుసని వీరు భావిస్తుంటారు. వీళ్ల వ్యవహారశైలి ఎలా ఉంటుందంటే.. అక్కడ రేటెక్కువ.. ఇక్కడ రేటెక్కువ.. నిన్నటివరకూ ఫలానా ప్రాంతంలో చదరపు అడుక్కీ ఐదు వేలే ఉండేది.. మొన్నటివరకూ నాలుగు వేలే ఉండేది.. ఇప్పుడు ఆరు వేలు అంటున్నారు అంటూ ఇంటి కొనుగోలును ఎప్పుడు వాయిదా వేస్తుంటారు. ఇలాంటి వారేంటంటే ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అయితే తప్ప ఇల్లు కొనలేరు. లేకపోతే ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉంటాయి తప్ప వీళ్లు మాత్రం ఎప్పటికీ సొంతిల్లు కొనుక్కోలేరు. కుటుంబ సభ్యులు తీవ్రంగా ఒత్తిడి చేస్తే తప్ప ఇలాంటి వారు ఎప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేరని గుర్తుంచుకోండి.
కొందరేమో ఇంటి అద్దెల కోసం ఫ్లాట్లను ఎంచుకుంటారు. కానీ, కరోనా తర్వాత ఈ పరిస్థితి మారిపోయింది. పెట్టుబడి కోణంలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఇలాంటి వారంతా రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో.. ఆరంభ దశలోనే కొనుగోలు చేస్తే బెటర్. అప్పుడే అది పూర్తయ్యేనాటికి మంచి అప్రిసియేషన్ లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్‌లో ఆర్‌వీ సాయి వనమాలి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును తీసుకుంటే.. చదరపు అడుక్కీ రూ.6500 చెబుతున్నారు. ఇది పూర్తయ్యే నాటికి ఎంతలేదన్నా చదరపు అడుక్కీ ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అవుతుంది. అదే గండిమైసమ్మ వద్ద అర్బన్ గ్రీన్స్ అనే రెడీ టు ఆక్యుపై కమ్యూనిటీలో.. డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ ధర రూ.55 లక్షలు చెబుతున్నారు. ఇందులో కొంటే, వచ్చే ఐదేళ్లలో ఊహించిన దానికంటే ఎక్కువ అప్రిసియేషన్ లభిస్తుంది. ఎందుకంటే, అప్పటికీ మెట్రో రైలు కనెక్టివిటీ, కండ్లకోయ ఐటీ కారిడార్ కు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.
మీరు కోకాపేట్లో నివసించాలని అనుకుంటే మాత్రం.. వచ్చే మూడు నెలల్లో హ్యాండోవర్ కానున్న పౌలోమీ అవాంతే గేటెడ్ కమ్యూనిటీని ఎంచుకోండి. ఇందులో చదరపు అడుక్కీ రూ.8000 చెబుతున్నారు. ఇక్కడే నియోపోలిస్ వద్ద ఆరంభమైన ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ ధర పది వేలు చెబుతున్నారు. ఇటీవల నియోపోలిస్ వేలంలో భూములు కొన్న సంస్థలు ఆరంభించే ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల ధరలు.. ఎంతలేదన్నా చదరపు అడుక్కీ రూ.12 వేల దాకా పెడతారు. అంటే, ఆయా ప్రాజెక్టులు పూర్తయ్యే నాటికి చదరపు అడుక్కీ కనీసం పదిహేను వేలకు టచ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఒక ప్రాజెక్టులో ఫ్లాట్ ధర ఏయే అంశాలపై ఆధారపడుతుందో మీకు చెబుతాను. ప్రాజెక్టు లొకేషన్, గేటెడ్ కమ్యూనిటీయా లేదా స్టాండ్ ఎలోన్ అపార్టుమెంటా, బిల్డర్ ఎంచుకున్న థీమ్, కన్‌స్ట్రక్షన్ స్టేటస్, ఆ నిర్మాణం హైట్, అందులో పొందుపరిచే ఎమినిటీస్ మరియు ఫెసిలిటీస్, ఎలివేషన్స్, గ్రాండియర్, బిల్డర్ అవసరం, మీరు చెల్లింపు చేసే పద్ధతి ఇలా అనేక అంశాల ఆధారంగా ఫ్లాట్ ఫైనల్ రేటు ఆధారపడుతుంది. అత్తాపూర్‌లో చదరపు అడుక్కీ 5500 నుంచి ఏడు వేల ఐదు వందల దాకా ఫ్లాట్ రేటు చెబుతున్నారు.
బాచుపల్లిలో నాలుగు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు, కిస్మత్‌పూర్‌లో ఐదు వేల నుంచి ఆరు వేల ఎనిమిది వందలు, మియాపూర్‌లో ఆరు వేల నుంచి ఏడు వేల రెండు వందలు.. ఇలా, వివిధ ప్రాంతాల రేట్లు ఉన్నాయి. మరిన్ని ఫ్లాట్ల రేట్లను తెలుసుకోవాలంటే.. మీరు రెజ్‌టీవీని ఫాలో అయితే తెలుస్తుంది. చివరగా.. మీరు స్థిర నివాసం కోసం చూస్తున్నట్లయితే కేవలం రెరా అనుమతి గల ప్రాజెక్టుల్ని మాత్రమే ఎంచుకోండి. రేటు తక్కువనే ఏకైక కారణంతో ప్రీలాంచుల్లో మాత్రం కొనకండి. అలా చేస్తే మీ కష్జార్జితం కాస్త బూడిదలో పన్నీరవుతుంది.
This website uses cookies.