poulomi avante poulomi avante

111 జీవో ప్రాంతాల్లో.. ఆక్ర‌మ‌ణ‌లు కనిపించట్లేదా?

రెజ్ న్యూస్‌, హైదరాబాద్: శంషాబాద్, నార్సింగి వంటి ప్రాంతాల్లో హెచ్ఎండీఏ అధికారులు అక్రమార్కులపై విరుచుకుపడ్డారు. యాభైకి పైగా ఎకరాల భూమిని కబ్జా నుంచి విముక్తి కలిగించారు. ఇటీవ‌ల వేకువ జామున మూడు గంటల్నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఆరంభించడం విశేషం. కాకపోతే, 111 జీవో ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ ఎందుకు దృష్టి సారించ‌ట్లేదు?

ట్రిపుల్ వ‌న్ జీవోను ర‌ద్దు చేశార‌ని చాలామంది భావిస్తున్నారు. కానీ, ప్ర‌భుత్వం తెలివిగా ఆ జీవోలోని మూడో పేరాగ్రాఫ్ ను తొలగించి కొత్తగా 69 జీవోను విడుద‌ల చేసింది. ఈ అంశంపై పర్యావరణవేత్తలు కోర్టులను ఆశ్రయించారు. గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం 111 జీవో అంశంపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఈ మొత్తం ప్రాంతానికి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో తెలిపారు. కాకపోతే, ఆ మాస్టర్ ప్లాన్ వచ్చేలోపు ఈ ప్రాంతమంతా మరో హుస్సేన్ సాగర్ తయారువుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు భవనాల్ని నిర్మిస్తున్నారు. అంతెందుకు బఫర్ జోన్లనూ వదలడం లేదు. ఇలా, ఎక్కడ పడితే అక్కడ కొత్త నిర్మాణాలు ఆరంభం కావడంతో.. ఈ ప్రాంతమంతా మురికికూపంగా మారేందుకు ఎక్కువ సమయం పట్టదని ప్రజలు అంటున్నారు.

అసలు 111 జీవోలో మూడో పేరా తొలగింపు కరెక్టేనా అనే స్పష్టత కోర్టుల నుంచి రావాల్సి ఉంది. కాకపోతే, అది వచ్చే లోపు ఈ ప్రాంతానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంద‌ని ప‌ర్యావర‌ణ‌వేత్త‌లు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొయినాబాద్‌, చేవేళ్ల‌, రాజేంద్ర‌న‌గ‌ర్ వంటి మండ‌ల్లాల్లోని గ్రామాల్లో కాలుష్య‌కార‌కాలైన‌ హోటళ్లు, నివాస స‌ముదాయాలు వంటివి కొత్త‌గా ఏర్పాటు చేయ‌కూడ‌ద‌ని ట్రిపుల్ వ‌న్ జీవోలో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. కాక‌పోతే, 69 జీవోను ప్ర‌భుత్వం విడుద‌ల చేసి చేతులు దులిపేసుకుంది. ఇదే అద‌నుగా భావించిన ప‌లువురు ప్ర‌బుద్ధులు ఎంచ‌క్కా కొత్త నిర్మాణాల్ని చ‌క‌చ‌కా క‌ట్టేస్తున్నారు. అక్క‌డ డ్రైనేజీ సౌక‌ర్య‌మే లేన‌ప్పుడు అందులో కొన్న‌వారేం చేస్తారు? జంట జ‌లాశ‌యాల్లోకి వ్య‌ర్థాల‌ను వ‌దిలేస్తున్నారు. ప్ర‌ధానంగా, బ‌ఫ‌ర్ జోన్ల‌లో ఉన్న హోట‌ళ్లు, గెస్ట్ హౌజ్‌లు, ఫార్మ్ హౌజులు వంటివి చేస్తున్న‌దిదే. అయినా, హెచ్ఎండీఏ క‌ళ్ల‌ప్పగించి చూస్తున్న‌దే త‌ప్ప‌..
ఎలాంటి చ‌ర్య‌ల్ని తీసుకోవ‌ట్లేదు. కాబ‌ట్టి, ఇప్ప‌టికైనా మొయినాబాద్ నుంచి చేవేళ్ల దాకా ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతంలోని జంట జ‌లాశ‌యాల‌కు అటూఇటూ నిర్మిస్తున్న కొత్త నిర్మాణాల్ని కూల్చివేయాలి. లేక‌పోతే, జంట జ‌లాశ‌యాలు మ‌రో మురికికూపంగా మారుతుంది
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles