poulomi avante poulomi avante

ప్లాట్లందు.. ఫామ్ ప్లాట్లే వేరయా!

తెలంగాణ రెరా అథారిటీ ఏర్పాటైన కొత్త‌లో డెవ‌ల‌ప‌ర్లు సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌ణాళికాబ‌ద్ధంగా, పార‌ద‌ర్శ‌కంగా నిర్మాణ‌ రంగం అభివృద్ధి చెందుతుంద‌ని ఆశించారు. ఈ రంగంలో జ‌వాబుదారీతనం పెరుగుతుంద‌ని భావించారు. కానీ, కొన్ని నెల‌ల‌కే సీన్ మొత్తం రివ‌ర్స్ అయ్యింది.

రెరాను త‌ప్పించుకోవాల‌నో.. పెరిగిన ఫ్లాట్ల ధ‌ర‌ల వ‌ల్ల విసుగు చెందో తెలియ‌దు కానీ.. కొంద‌రు వ్య‌క్తులు కొనుగోలుదారుల్ని బుట్ట‌లో వేసుకున్నారు. మాయ‌మాట‌లు చెప్పి ప్రీలాంచ్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించారు. మార్కెట్ రేటు కంటే త‌క్కువ అంటూ ఊద‌ర‌గొట్టారు. ఇంత‌కంటే గొప్ప అవ‌కాశం లేద‌న్నారు. భ‌విష్య‌త్తులో రాక‌పోవ‌చ్చ‌న్నారు. దీంతో కొంద‌రు కొనుగోలుదారులు ఊర్లో ఉన్న పొల‌మో ఇల్లో అమ్మేసి.. వ్య‌క్తిగ‌త రుణం తీసుకుని మ‌రీ.. ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను కొన్నారు. అంటే, కేవ‌లం పేప‌రు మీదే ఫ్లాట్ల‌ను కొన్నారు. దీంతో, అవి ఎప్పుడు పూర్త‌వుతాయా అంటూ ఆశ‌తో ఎదురు చూస్తున్నారు.

నిన్న‌టివ‌ర‌కూ కేవ‌లం బ‌డా సంస్థ‌ల‌కే ప‌రిమిత‌మైన ప్రీలాంచ్ స్కీమ్.. ప్ర‌స్తుతం గ‌ల్లీ సంస్థ‌లూ ఆరంభించాయి. అపార్టుమెంట్ ఎలా క‌ట్టాలో తెలియ‌నివారూ ఆకాశ‌హ‌ర్మ్యాల్ని క‌ట్టేందుకు నడుం బిగించారు. మొత్తానికి కొల్లూరు, వెలిమ‌ల‌, పాటిఘ‌న‌పూర్‌, నార్సింగి, మంచిరేవుల‌, ప‌టాన్‌చెరు, రుద్రారం, ఘ‌ట్‌కేస‌ర్‌, శంషాబాద్ వంటి ప్రాంతాల్లో ఒక్క‌సారిగా ప్రీలాంచ్ స్కామ‌ర్లు పెరిగిపోయారు. అంతెందుకు, సుమ‌ధురు ప్రాజెక్ట్స్ వంటి బ‌డా సంస్థ‌లూ ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌డం విశేషం. ఇక‌, బాచుపల్లి అర్బ‌న్ రైజ్ గురించి ఎంత త‌క్కువ చెబితే అంత మంచిది. తాజాగా, ఈ అవినీతి జాడ్యం ఫామ్ ప్లాట్ల విభాగంలోకి ప్ర‌వేశించి మ‌ధ్య‌త‌ర‌గ‌తిని క‌బ‌ళిస్తోంది.

గుంట‌ల్లో రిజిస్ట్రేష‌న్‌

రెరా అనుమ‌తి లేకుండా.. ఎక‌రాల స్థ‌లాన్ని గుంట‌ల్లో విక్ర‌యిస్తున్నారు. రిజిస్ట్రేష‌న్ కూడా చేస్తున్నారు. ఫ‌లితంగా, వంద‌లాది ఎక‌రాల్లో స్థానిక సంస్థ‌ల అనుమ‌తుల్లేకుండానే వెంచ‌ర్లు ఆరంభ‌య్యాయి. చూడ‌టానికి ఇవి లేఅవుట్లుగానే క‌నిపిస్తాయి. కానీ, వీటికి ఫామ్ ల్యాండ్ అని ముద్దుగా పేరు పెట్టి అమ్మేస్తున్నారు. గుంట‌ల్లో రిజిస్ట్రేష‌న్ చేయ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌ను స్థానిక స‌బ్ రిజిస్ట్రార్లు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు. ఎవ‌రు డ‌బ్బులిస్తే వారికి రిజిస్ట్రేష‌న్ చేస్తున్నారు. ఇలా వంద‌లాది ఎక‌రాల్లో పుట్ట‌గొడుగుల్లా ఫామ్ లేఅవుట్లు రిజిస్ట‌ర్ అవుతున్నా.. తెలంగాణ ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్త‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మేమో జాతీయ స్థాయికి ఎద‌గాల‌న్న క‌సితో రాష్ట్ర వ్య‌వ‌హారాల్ని పూర్తిగా గాలికొదిలేసింది. ఇప్పుడైనా ఈ ప్రీలాంచ్ స్కామ‌ర్ల‌ను నియంత్రించాలి. లేక‌పోతే, రేపొద్దున ప్రీలాంచ్ స్కాములే ప్ర‌భుత్వం మెడ‌కు చుట్టుకునే ప్ర‌మాదం లేక‌పోలేదు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles