Categories: TOP STORIES

ఎమర్జింగ్‌ హాట్ స్పాట్స్‌లో పెరిగిన డిమాండ్‌..

ప్రైమ్‌ లోకేషన్స్‌లో ఓన్‌ హౌస్‌ అందరికీ సాధ్యం కాని విషయం. ఈ కారణంతోనే సొంత ఇల్లు కావాలనుకునే వారు మిగిలిన ప్రాంతాల వైపు చూస్తుండటంతో నగరం చుట్టుపక్కల కొత్త ప్రాంతాల్లో నిర్మాణ రంగం అనుహ్య పెరుగుదలను నమోదు చేస్తోంది. కొంపల్లి, తెల్లాపూర్‌, కోకాపేట్‌, నల్లగండ్ల, షేక్‌పేట్‌ ప్రాంతాలు ఎమర్జింగ్ హాట్‌ స్పాట్స్‌గా అవతరించాయ్‌.

2015 నుంచి 2024 మధ్యలో ఈ ఏరియాల్లో రియల్‌ ఎస్టేట్‌ 135 శాతం వృద్ధి చెందింది. ప్రణాళికా బద్ధంగా నిర్మిస్తోన్న రెసిడెన్షియల్‌ కమ్యూనిటీస్‌, ఎటు చూసినా నిండైన పచ్చదనం, ఉన్నత జీవన ప్రమాణాలు, అందుబాటు ధరల్లో సకల సౌకర్యాలున్న గృహాలు లభించడం, కనెక్టివిటీ ఉండటం.

ఇవన్నీ కలిసి ఎమర్జింగ్ మార్కెట్లో రియల్‌ ఎస్టేట్‌ వేగంగా విస్తరించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయ్‌. ఆసక్తికరమైన విషయమేంటంటే- ప్రీమియం లోకేషన్లతో పొల్చితే ఇక్కడ మరిన్ని వసతులుండటంతో ఐటీ కంపెనీలు.. ఐటీ కారిడార్లు ఎమర్జింగ్‌ మార్కెట్స్‌లో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయ్‌.

ఇంకేముంది ఈ ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ స్పేస్‌కి డిమాండ్ పెరిగింది. ఇక ఉప్పల్‌, నాచారం, బాచుపల్లి, ఆదిభట్ల, పటాన్‌చెరు లాంటి ప్రాంతాలు మిడ్‌- సెగ్మెంట్‌లో ఇల్లు కొనాలనుకునేవారికి అనువుగా ఉన్నాయ్‌. ఇటు ఆఫీస్‌లు దగ్గరగా ఉండటంతో పాటు వసతి సదుపాయాలు పెరగడం, బడ్జెట్‌లో సొంత ఇంటి కోరిక నెరవేరుతుండటంతో ఈ ప్రాంతాల్లో ఇళ్లకు డిమాండ్‌ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.

This website uses cookies.