poulomi avante poulomi avante

2023 బ‌డ్జెట్లో రియాల్టీకి ఊతమివ్వాలి

  • పలు మినహాయింపులు కల్పించాలి
  • రియల్ ఎస్టేట్ నిపుణల అభిప్రాయాలు

వచ్చేనెల ఒకటో తేదీని కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రియల్ రంగానికి ఊతమిచ్చేదిగా ఉండాలని ఈ రంగంలోని పలువురు నిపుణులు ఆకాంక్షిస్తున్నారు. రియల్ రంగం వేగంగా ముందుకు దూసుకెళ్లాలంటే పలు మినహాయింపులు కల్పించాలని కోరుతున్నారు.

బడ్జెట్ పై భారీ అంచనాలు..

రియల్ ఎస్టేట్ రంగంలో గతేడాది కనిపించిన ఊపును కొనసాగించడానికి 2023-24 కేంద్ర బడ్జెట్ పై ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. రెసిడెన్షియల్ విభాగంపై ఉన్న అంచనాలు ఇళ్ల కొనుగోలుకు ఊతమిస్తాయి. అదే సమయంలో వాణిజ్య కార్యాలయాల వైపు కూడా కొంత అనుకూలత ఉంటుందని భావిస్తున్నాం. ప్రతిపాదిత డీఈఎస్ హెచ్ బిల్లుపై స్పష్టత ఇస్తే అది దేశీయ డిమాండ్ కు అనుగుణంగా వ్యాపారాలకు ఊతమిస్తుంది. 2026 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే భారతదేశ లక్ష్యాన్ని సాధించడానికి డీఈఎస్ హెచ్ హబ్ లు కీలక పాత్ర పోషిస్తాయి. దేశీయ తయారీ మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం.. భారతదేశ వినియోగం పెరుగుతుండటం, పెట్టబడుల అనుకూల విధానాలు కలిసి మనదేశ తయారీ సామర్థ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తాయి.
– రమేశ్ నాయర్, సీఈఓ, ఏసియా కొల్లియర్స్ ఇండియా ఎండీ

పెట్టుబడులను ప్రోత్సహించే ప్రకటనలు ఉండాలి..

పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యం ముప్పులో ఉన్న నేపథ్యంలో భారత దేశ జీడీపీ వృద్ధిని 6.5 నుంచి శాతం వద్ద కొనసాగించడానికి కేంద్ర బడ్జెట్ పై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించాలి. దేశంలో మూలధన పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను ప్రోత్సహించేలా ప్రకటనలతో కూడిన ధైర్యమైన, వృద్ధి ఆధారిత బడ్జెట్ ను ఆశిస్తున్నాం. రియల్ ఎస్టేట్ లో హౌసింగ్ అనేది 200కి పైగా అనుబంధ రంగాలకు ఊతమిచ్చే అంశం కాబట్టి.. ఇళ్ల డిమాండ్ అలాగే ఉండేలా చర్యలు తీసుకోవాలి. గృహ రుణాలపై వడ్డీ, అసలు మొత్తంపై పన్ను మినహాయింపులను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం ద్వారా అటు పరిశ్రమకు, ఇటు కొనుగోలుదారులకు భరోసా కల్పించాలి.
– అమిత్ గోయెల్, ఇండియా సౌత్ బీ ఇంటర్నేషన్ రియల్టీ సీఈఓ

హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలి..

ప్రస్తుతం గృహ కొనుగోలుదారులు తమ గృహ రుణంపై చెల్లించే వడ్డీపై ఆదాయపన్ను మినహాయింపు పొందవచ్చు. క్లెయిమ్ చేయగల గరిష్ట మొత్తం స్వయం ఆక్రమిత ఆస్తికి ఏడాదికి రూ.2 లక్షలు ఉంది. మధ్య, సరసమైన గృహాల డిమాండ్ పెంచడానికి ఈ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి. అలాగే హోమ్ లోన్ అసలు చెల్లింపుపై ప్రస్తుతం రూ.లక్షన్నర వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఇదే సెక్షన్ కింద పీపీఎఫ్, జీవిత బీమా, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీముల వంటివి ఉన్నందున.. హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ ను ప్రత్యేక పన్ను మినహాయింపు విభాగం కిందకు తీసుకురావాలి. అలాగే, సరసమైన గృహాలకు సంబంధించిన రూ.45 లక్షల పరిమితిని మరింతి పెంచాలి.
– పీయూష్ గుప్తా, కొల్లియర్స్ ఇండియా కేపిటల్ మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సర్వీసెస్ ఎండీ

లాజిస్టిక్స్ కు మినహాయింపులు ఇవ్వాలి..

కరోనా సమయంలో అత్యంత స్థితిస్థాపక రంగంగా మారిన లాజిస్టిక్స్ విభాగానికి కొన్ని మినహాయింపులు ఇవ్వాలి. ఈ రంగాన్ని పెంపొందించడానికి అవసరమైన నాణ్యమైన ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్ ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలపర్లకు నిర్మాణ వ్యయాన్ని తక్కువ చేసేందుకు కీలకమైన నిర్మాణ సామగ్రిపై తక్కువ సుంకాలు విధించాలి. అలాగే కీలక నగరాల్లో గిడ్డంగుల అభివృద్ధికి మూలధర రాయితీ, ఆర్థిక రాయితీ కల్పించాలి. అలాగు డీఈఎస్ హెచ్ విధానం మరింత స్పష్టత ఇవ్వాలి.
– శ్యామ్ ఆర్ముగం, కొల్లియర్స్ ఇండియా ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఎండీ

సరసమైన గృహాల పరిమితి పెంచాలి..

కరోనా తర్వాత గాడిన పడి ముందుకెళ్తున్న రియల్ రంగం వచ్చే కేంద్ర బడ్జెట్ నుంచి భారీగానే ఆశిస్తోంది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రాపర్టీ కొనుగోలుదారులు ఇంటి రుణాలపై చెల్లించే వడ్డీపై ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల పన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచాలి. తద్వారా ఎక్కువమంది సొంతింటి కల సాకారమవుతుంది. అలాగే సరసమైన గృహాల పరిమితిని మెట్రో నగరాల్లో రూ.45 లక్షల నుంచి రూ.80 లక్షలకు.. నాన్ మెట్రో నగరాల్లో రూ.65 లక్షలకు పెంచాలి.
– పీయూష్ బొతారా, స్క్వేర్ యార్డ్స్ సీఈఓ

సెటాఫ్ పరిమితి తొలగించాలి..

ఆదాయపు పన్ను హెడ్ హౌస్ ప్రాపర్టీ కింద లాస్ సెటాఫ్ ను పున:పరిశీలించాలి. దీని కింద సెటాఫ్ పరిమితిని ప్రభుత్వం రూ.2 లక్షలకు పరిమితం చేసింది. ఈ రంగంలో పెట్టుబడులను తిరిగి తీసుకురావడానికి ఈ పరిమితిని తొలగించాలి లేదా పెంచాలి. అంతేకాకుండా గత కొన్ని నెలల్లో అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన రుణ వ్యయం కారణంగా ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి. ముఖ్యంగా సరసమైన, మధ్య తరహా విభాగాల్లో ఇళ్లు కొనుగోళ్లు పెరగడానికి పన్ను మినహాయింపులు అత్యంత అవసరం. సరసమైన గృహాల కొనుగోలుదారులకు ఇంటిపై మొత్తం వడ్డీని మినహాయింపుగా అనుమతించాలి.
– ప్రదీప్ అగర్వాల్, సిగ్నేచర్ గ్లోబల్ ఫౌండర్ అండ్ చైర్మన్

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles