poulomi avante poulomi avante

ఆన్‌లైన్ సేల్స్‌కు ఆస‌క్తి

రియల్ రంగలో పెరుగుతున్న టెక్నాలజీ

భారత్ లో ఏడాదికి సుమారు 2వేల కోట్ల కమీషన్ ఆదా

రియల్ ఎస్టేట్ రంగంలో ఏం కొనాలన్నా మధ్యవర్తి ఉండాల్సిందే. ఇళ్లు, స్థలం.. ఏది కొన్నా దాని విలువను బట్టి కమీషన్ చెల్లించాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. స్థిరాస్తి లావాదేవీల్లో మధ్యవర్తుల స్థానంలో టెక్నాలజీ వచ్చేసింది. అవును ప్రస్తుతం రియల్ రంగంలో ఇంటి కొనుగోళ్లు ఎక్కువ‌గా ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఇలా ఆన్ లైన్ ద్వారా స్థిరాస్తి లావాదేవీల వల్ల.. భారత్ లో ఏడాదికి సుమారు రూ. 2 వేల కోట్ల రూపాయల బ్రోకరేజ్ ఆదా అవుతుందని అంచనా.

రియల్ ఎస్టేట్ రంగంలో బ్రోకరేజ్ లేదా కమీషన్ సర్వసాధారణం. మనం ఎక్కడైనా స్థిరాస్తి కొనుగోలు చేస్తే అందుకు సహకరించిన మద్యవర్తికి కమీషన్ చెల్లించాల్సిందే. అది వ్యక్తి అయినా, సంస్థ అయినా బ్రోకరేజ్ ఇవ్వాలి. ప్రాపర్టీ విలువను బట్టి బ్రోకరేజీ అమౌంట్ ఉంటుంది. బ్రోకరేజ్ అమౌంట్ భారీగా వస్తుందని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, హౌజ్ వైఫ్స్, నిరుద్యోగులు స్థిరాస్తి వ్యాపారంలో మధ్య‌వర్తులుగా వ్యవహరిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ అంశంలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం టెక్నాలజీ రియల్ రంగంలో మధ్యవర్తుల ప్రాధాన్యతను సాధ్యమైనంత వరకు తగ్గించింది. .

అంతా ఆన్‌లైన్‌లోనే..

ప్రస్తుతం ఇంటి కొనుగోళ్లకు సంబంధించి చాలా వరకు ఆన్ లైన్ లోనే సంప్రదింపులు జరుపుతున్నారు. నేరుగా ప్రాపర్టీ డెవలపర్ లేదా బిల్డర్ ను ఆన్ లైన్ లో కాంటాక్ట్ చేస్తున్నారు. ఇంటి ధర, అడ్వాన్స్ చెల్లింపులు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన‌ అగ్రిమెంట్‌ వంటి వివరాలన్నీ ఆన్ లైన్ లోనే తెలుసుకుంటున్నారు. సైట్ ను సైతం వీడియో వాక్ త్రూ ద్వారా చూసేస్తున్నారు. ఇంటి నిర్మాణ దశలను ఎప్పటికప్పుడు మొబైల్ లో వీక్షిస్తున్నారు. దీంతో ఇళ్ల కొనుగోళ్లకు సంబంధించి మధ్యవర్థుల అవసరం చాలా వరకు తగ్గిపోయింది. ఇంటి కొనుగోళ్లలో సుమారు 50 శాతం మంది కస్ట‌మర్లు ఆన్ లైన్ పైనే ఆధారపడుతున్నారని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. వీడియో వాక్‌త్రూ ద్వారా ప్రాపర్టీలను వీక్షించి, ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు.

ప్రాపర్టీ విజిట్స్, ఎంపిక, లావాదేవీలలో ఆన్‌లైన్‌లో వినియోగం విపరీతంగా పెరిగింది. మరీ ముఖ్యంగా బెంగళూరు, ముంబై, పుణే నగరాలలో ఆన్ లైన్ ప్రాపర్టీ సేల్స్ భారీగా పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగులు, ప్రముఖ వ్యాపారస్తులు ప్రాపర్టీ కొనుగోళ్లలో ఆన్ లైన్ పై ఆధారపడుతున్నారని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా.. ప్రాపర్టీ కొంటే వారికి కమీషన్ చెల్లించాల్సి రావడం కూడా ఆన్ లైన్ లావాదేవీలు పెరగడానికి ఓ కారణమని అంటున్నారు. అయితే బెంగళూరు, ముంబై, పుణేలు వంటి నగరాల్లో స్థిరాస్తి కొనుగోళ్లకు ఆన్ లైన్ పై ఆధారపడుతుండగా.. ఢిల్లీ, హైదరాబాదీలు ఇంకా బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎంత ఆన్ లైన్ వీడియో, వాక్ త్రూ ద్వార ప్రాపర్టీని చూసి, ఎంపిక చేసుకున్నా.. కొనాలన్న నిర్ణయానికి వచ్చాక.. క‌చ్చితంగా ఒకటికి రెండు సార్లు వ్యక్తిగతంగా సైట్ కు వెళ్లి అన్నీ బేరీజు వేసుకున్నాకే ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles