poulomi avante poulomi avante

పెట్టుబడులు తగ్గాయ్..

  • గతేడాది మంచి పురోగతి కనబరిచిన వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్
  • 2022 కంటే 21 శాతం అధిక శోషణ
  • వెస్టియన్ నివేదిక వెల్లడి

వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ రంగం గతేడాది మంచి పనితీరు కనబరిచిందని, 2023లో 37.8 మిలియన్ చదరపు అడుగుల శోషణ నమోదైందని వెస్టియన్ నివేదిక తెలిపింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 21 శాతం అధికమని పేర్కొంది. ఈ విభాగంలో 2021 నుంచి శోషణ పెరుగుతూనే ఉందని.. ఏటా క్రమంగా పెరుగుతూ వస్తోందని.. గతేడాది పెట్టుబడులు తగ్గినప్పటికీ, శోషణ మాత్రం కరోనా ముందు స్థాయి కంటే 15 శాతం ఎక్కువగా నమోదైందని వివరించింది.

గతేడాది ఈ రంగం 646 మిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు అందుకోగా, రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో ఇది 15 శాతం కావడం గమనార్హం. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు వేచి చూసే ధోరణి అవలంభిస్తుండటంతో 2023లో పెట్టుబడులు 2022 కంటే 65 శాతం తగ్గాయి. అనిశ్చితి ఉన్నప్పటికీ 3పీఎల్ కంపెనీలు తమ క్లయింట్లకు ఫ్లెక్సిబిలిటీని అందించడంతోపాటు ఖర్చును ఆప్టిమైజ్ చేసే సామర్థ్యం కలిగి ఉండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. పెట్టుబడిదారులు ప్రాధాన్య ఎంపికగా 3పీఎల్ కంపెనీలు వాటా పెరుగుతూ వస్తోంది.

2023లో మొత్తం శోషణలో 44 శాతం వాటా 3పీఎల్ దే. వీటి తర్వాత ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల వాటా 18 శాతం ఉండగా.. రిటైల్ రంగం 11 శాతం వాటాతో ఉంది. నగరాలవారీగా చూస్తే వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ లో 27 శాతంతో ముంబై టాప్ లో ఉంది. 2022లో 19 శాతం ఉండగా.. అది గతేడాది 27 శాతానికి పెరిగింది. అలాగే ఇక్కడ అద్దెలు కూడా 4 శాతం పెరిగాయి. మరోవైపు కోల్ కతాలో అత్యధికంగా 23 శాతం వార్షిక క్షీణత నమోదైంది. ఇది 2023లో 1.6 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.
దీని వాటా కూడా 7 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడంలో ఉన్న సవాళ్లు శోషణ తగ్గుదలకు దారి తీశాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ విషయానికి వస్తే 2022 కంటే 2023లో శోషణ 21 శాతం పెరిగింది. అలాగే మొత్తం వాటాలో ఢిల్లీ వాటా స్థిరంగా ఉంది. ఇక్కడ గోడౌన్లకు డిమాండ్ ఉన్నందున అద్దెల్లో వార్షికంగా 2 శాతం పెరుగుదల నమోదైంది. దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కలిసి 2022లో 34 శాతం వాటా ఉండగా.. 2023లో అది 27 శాతానికి తగ్గి, 10.2 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి సంబంధించిన ప్రకటనలు ఈ రంగంపై సానుకూల ప్రభావం చూపించే అవకాశం ఉందని వెస్టియన్ సీఈఓ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ‘2023లో పెట్టుబడులు తగ్గినందున 2024లో భారతీయ వేర్ హౌసింగ్ విభాగానికి సవాల్ గా ఉంటుంది. థర్ట్ పార్టీ లాజిస్టిక్స్, ఈ కామర్స్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఈ రంగం రాబోయే రెండేళ్లకు 10 నుంచి 13 సీఏజీఆర్ వద్ద విస్తరిస్తుందని అంచనా’ అని చెప్పారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles