హైదరాబాద్‌కు చెందిన నవ్య డెవలపర్స్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని స్కంధాన్షీ ఇన్‌ఫ్రా, రాఘమయూరీ వంటి సంస్థలపై ఆదాయపన్ను శాఖ తనిఖీలను నిర్వహించిందని సమాచారం. దాదాపు నాలుగు రోజుల పాటు హైదరాబాద్, అనంతపురం, కర్నూలు, వైజాగ్, కడప, నందాల, బళ్లారిలో సోదాలు నిర్వహించారు.
ఈ మూడు సంస్థల్లో సుమారు రూ.800 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు రూ.1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థలు పన్నులు ఎగవేసి అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆదాయపన్ను శాఖకు చిక్కకుండా ఉండేందుకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేయడం లేదని.. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేసినట్లు సమాచారం. ఆ సాఫ్ట్ వేర్ని డిలీట్ చేసినట్లు తెలిసింది.
This website uses cookies.