డెవలపర్ చేసిన తప్పనకు కొనుగోలుదారును బాద్యుడు చేయడం సరికాదని రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఓ డెవలపర్ రుణం చెల్లించకపోవడంతో తొమ్మిది మంది కొనుగోలుదారుల నుంచి అపార్ట్ మెంట్లు స్వాధీనం చేసుకున్న బ్యాంకు వ్యవహారశైలిని తప్పుబట్టింది. వెంటనే ఫ్లాట్ల సీజ్ ప్రక్రియ ఆపేయాలని బ్యాంకును ఆదేశించింది. కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడే విషయంలో ఇది చరిత్రాత్మక తీర్పు అని రియల్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లోని న్యూ ఆలీపూర్లో ఐడియల్ ఎక్సోటికా ప్రాజెక్టులో అపార్ట్ మెంట్లను పలువురు కొనుగోలు చేశారు. ఇందులో అపార్ట్ మెంట్లు రూ.1.95 లక్షల నుంచి రూ.3.14 కోట్ల మధ్యలో ఉన్నాయి.
ఫ్లాట్లు కొనుగోలు చేసినవారు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, డెవలపర్ ఎస్ బ్యాంకు నుంచి రూ.320 కోట్ల అదనపు రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకు తొమ్మిది మంది ఫ్లాట్లను సీజ్ చేయడానికి ప్రయత్నించడంతో వివాదం మొదలైంది. దీంతో ఫ్లాట్ యజమానులు బెంగాల్ రెరాను ఆశ్రయించగా… వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది. దీనిని ఎస్ బ్యాంకు రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ లో సవాల్ చేసింది. వాదనలు విన్న ట్రిబ్యునల్ డెవలపర్ చేసిన తప్పునకు కొనుగోలుదారుల నుంచి ఫ్లాట్లు స్వాధీనం చేసుకోవడం సబబు కాదని పేర్కొంటూ రెరా తీర్పును సమర్థించింది.
This website uses cookies.