Kokapet Neopolis is a Amazing skykraper
విదేశీ నగరాలతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్న హైదరాబాద్‌లోని కోకాపేట్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే.. జీవితం ఎంతో గొప్పగా.. ప్రతిఒక్కరూ వావ్ అనిపించేలా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్కిటెక్టులు కలిసికట్టుగా శ్రమించి.. అంతర్జాతీయ నిర్మాణ పోకడల్ని హైదరాబాద్ వాసులకు పరిచయం చేయాలన్న కృత నిశ్చయంతో.. అద్భుతంగా డిజైన్ చేసిన ప్రాజెక్టే.. ద క్యాస్కేడ్స్ ఎట్ నియోపోలిస్. జీహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బన్ బ్లాక్స్ రియాల్టీలు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తున్న ఆకాశహర్మ్యమిది.
ద క్యాస్కేడ్స్ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే..
ఇందులో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే వారి.. శారీరిక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగాలు వంటివి విలాసవంతమైన జీవనం యొక్క చేతుల్లో సామరస్యంగా సహజీవనం చేస్తాయని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఆనందకరమైన జీవనానికి అవసరమయ్యే ప్రతిఒక్క సూక్ష్మ విషయాన్ని ఈ ప్రాజెక్టు డిజైనింగ్‌లో పొందుపర్చారు. అందుకే, సస్టెయినబుల్ మరియు స్మార్ట్ లివింగ్ ఈ ప్రాజెక్టులో సాధ్యమవుతుందని చెప్పొచ్చు. ద క్యాస్కేడ్స్‌లో లభించే అపారమైన లైఫ్ స్టయిల్ మరియు ఆధునిక సౌకర్యం వంటివి ఎక్కడా సరిపోల్చలేని విధంగా ఉంటాయి. అందుకే, కోకాపేట్‌లో టీజీ రెరా అనుమతి పొందిన ద క్యాస్కేడ్స్ ప్రాజెక్టులో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోండి.
ప్రెస్టీజియస్ లొకేషన్..
హైదరాబాద్‌లోని ద మోస్ట్ ప్రెస్టీజియస్ లొకేషన్ అయిన కోకాపేట్ నియోపోలిస్‌లో.. 7.34 ఎకరాల్లో.. 63 అంతస్తుల 5 విలాసవంతమైన టవర్లను నిర్మిస్తున్నారు. అన్నీ వాస్తు సూత్రాలకు అనుగుణంగా విశాలమైన అపార్టుమెంట్లు కావడం విశేషం. మూడు మరియు నాలుగు బెడ్‌రూం ఫ్లాట్లతో బాటు ప్రైవేటు పూల్స్ తో కూడిన 10 ప్రత్యేకమైన ట్రిప్లెక్సులు, పెంట్ హౌస్‌లు వంటివి ఇందులో డిజైన్ చేశారు. క్లబ్ హౌస్‌తో పాటు పోడియం ల్యాండ్‌స్కేప్, టవర్ లాంజ్‌లు, స్కై లాంజ్, స్కై గార్డెన్, రెండు హెలిప్యాడ్ లు కూడా ఉన్నాయి. లగ్జరీని పీక్స్‌లో కోరుకునే వారికి.. నగర దృశ్యాలను ప్రత్యేకమైన లిఫ్టుల ద్వారా యాక్సెస్ చేయగల స్కై లాంజ్ సాటిలేని అనుభవాన్ని అందజేస్తుంది. విలాసవంతమైన డిజైన్ యొక్క గొప్పతనానికి మించి.. ఐజీబీసీ ప్రీ-సర్టిఫికేషన్‌తో.. సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తాయి.
ప్రపంచ అందాల సమ్మేళనం..
ది క్యాస్కేడ్స్ నియోపోలిస్ అద్భుతమైన రూపంగా అభివర్ణించొచ్చు. ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ది రాక్‌ఫెల్లర్ సెంటర్ వంటి ఐకానిక్ నిర్మాణాల చక్కదనం.. అర్జెంటీనాలోని ఇగ్వాజు జలపాతం, ఐస్లాండ్‌లోని సెల్జలాండ్స్ ఫాస్ వంటి జలపాతాల గంభీరమైన అందాల సమ్మేళనంగా ఉంటుందీ ఆకాశహర్మ్యం. భవనాల కిరీటం ఒక కొండ అంచు నుంచి పడే నీటిలా అనిపిస్తుంది. భవనం నుంచి కిందకు దిగే తెల్లటి నిలువు రిబ్బన్లు.. భవనానికి మరింత వన్నె తెస్తాయి. ఆ తెల్లటి రిబ్బన్ల వెంట ఉండే కాంస్య స్వరాలు నీటి ఉపరితలంపై మండుతున్న సూర్యుడిని తలపిస్తాయి. రాత్రి సమయంలో రిబ్బన్‌ల వెంట కాంతిస్వరాలు అద్భుతమైన దృశ్య ప్రభావాన్ని సృష్టిస్తాయి. ఇవన్నీ కలిసి ఐదు టవర్లను ప్రకృతి మధ్య స్వర్గధామంలో ఉన్న భారీ జలపాతాల శ్రేణిలా కనిపించేలా చేస్తాయి.
అన్నింటికీ దగ్గర్లో
హైదరాబాద్ కోకాపేటలోని నియోపోలిస్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణ అద్భుతం, ప్రకృతి ప్రశాంతతతో కలిసిపోయే నగర జీవనానికి ఒక చక్కని ఉదాహరణ. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ కూడా అదుర్స్ అనేలా ఉంటుంది. ప్రశాంతమైన కోకాపేట నియోపోలిస్.. కోరుకున్నప్పుడు నగరంతో సులభంగా కనెక్ట్ అయ్యే సదుపాయాలు కలిగి ఉంది. అంటే, పక్కపక్కనే రెండు విభిన్న ప్రపంచాలను మీరు ఆస్వాదించవచ్చన్నమాట. సకల సదుపాయాలూ దగ్గర్లోనే ఉన్నాయి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1ఏ కేవలం ఐదు నిమిషాల దూరంలో నే ఉంది. ప్రతిపాదిత నియోపోలిస్ మెట్రో స్టేషన్ 5 నిమిషాలు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం- 25 నిమిషాలు, లింగంపల్లి రైల్వే స్టేషన్ 30 నిమిషాలు దూరంలోనే ఉన్నాయి. పలు విద్యాసంస్థలు, ఆస్పత్రులకు ఇలా వెళ్లి అలా వచ్చేంత దగ్గర్లోనే ఉన్నాయి. వర్సిటీ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ కి కేవలం నిమిషంలోనే వెళ్లి రావొచ్చు.
స్కూళ్లు.. 10-26 నిమిషాల్లో..
రాక్‌వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ – 10 నిమిషాలు
బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్ 20 – నిమిషాలు
ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ – 20 నిమిషాలు
ది గ్లెండేల్ అకాడమీ – 25 నిమిషాలు
ది గాడియం స్కూల్ – 26 నిమిషాల దూరంలో ఉన్నాయి.
ఆస్పత్రుల విషయానికి వస్తే..
పొప్పాలగూడ యశోద ఆస్పత్రి – 10 నిమిషాలు
అపోలో హాస్పిటల్ – 15 నిమిషాలు
గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రి – 15 నిమిషాలు
గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ – 20 నిమిషాలు,
కిమ్స్ ఆస్పత్రి – 30 నిమిషాల దూరంలో ఉన్నాయి.
ఓరియన్ మాల్ 5 నిమిషాల దూరంలో ఉండగా.. సోలార్ సైక్లింగ్ ట్రాక్ 15 నిమిషాలు, ఎమార్ గోల్ఫ్ కోర్స్ 20 నిమిషాలు, హైదరాబాద్ పోలో క్లబ్ 20 నిమిషాలు, శరత్ సిటీ మాల్ 24 నిమిషాలు, హైదరాబాద్ గోల్ప్ క్లబ్ 34 నిమిషాల దూరంలో ఉన్నాయి. కార్పొరేట్, సెజ్ ల విషయానికి వస్తే.. గ్రావా బిజినెస్ పార్క్ 5 నిమిషాలు, గూగుల్ క్యాంపస్ 12 నిమిషాలు, అమెజాన్ ఇండియా క్యాంపస్ 15 నిమిషాలు, మైక్రోసాఫ్ట్ క్యాంపస్ 18 నిమిషాలు, మైండ్ స్పేస్ సెజ్ 30 నిమిషాలు, నాలెడ్జ్ సిటీ 35 నిమిషాల్లో వెళ్లొచ్చు.
ఆకాశంలోనే అన్నీ సౌకర్యాలు..
కోకాపేట్ నియోపోలిస్‌లోని ద క్యాస్కేడ్స్ ప్రాజెక్టులోని మరికొన్ని ప్రత్యేకతల్ని చూస్తే మీరు వావ్ అనుకుండా ఉండలేరు. ఇందులోని స్కై గార్డెన్.. హై ఎండ్ వినోదాన్ని అందించడంతోపాటు విశ్రాంతి కోసం చక్కని వ్యూతో కూడిన ప్రత్యేక స్థలాలు. ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్డ్ ఇన్ఫినిటీ ల్యాప్ పూల్ తోపాటు యోగా డెక్, అవుట్‌డోర్ జిమ్, అవుట్‌డోర్ సీటింగ్, యాంఫి థియేటర్ ఉంటాయి.
స్కై లాంజ్ విషయానికి వస్తే.. సెంట్రల్ టవర్ హబ్ లో అందరూ కలిసి వినోదం, విశ్రాంతి పొందే సౌకర్యాల కలయిక. ఇక్కడ ఇండోర్ స్కై పూల్, స్టూడియో జిమ్, హమ్మమ్ అండ్ సౌనా, బిజినెస్ లాంజ్ ఉంటాయి. టవర్ లాంజ్ ప్రత్యేకత గురించి చెప్పాల్సి వస్తే.. ప్రతి టవర్ పై భాగంలో ప్రత్యేకమైన సౌకర్యాలతో కూడిన వినోద కేంద్రం. ఇక్కడ టీవీ లాంజ్, ప్రైవేట్ డైనింగ్, కార్డ్ రూమ్, లైబ్రరీ ఉంటాయి.
ALSO READ: హైదరాబాద్‌లో ప్రప్రథమంగా కిడ్స్ సెంట్రిక్ ప్రాజెక్టు ఇదే!
ద క్యాస్కేడ్స్ క్లబ్ హౌజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. సామాజికంగా గడపడం, వ్యాయామం చేయడం, విశ్రాంతి తీసుకోవడానికి ఒక గొప్ప 8-అంతస్తుల ప్రపంచం. ఇక్కడ కేఫ్ & డైనింగ్, స్పోర్ట్స్ లాంజ్ & గేమ్‌లు, మినీ థియేటర్. మల్టీ-పర్పస్ హాల్, స్పా, జిమ్, పైలేట్స్ / యోగా స్టూడియో, స్క్వాష్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్ , ఔట్‌డోర్ ప్యాడిల్, టెన్నిస్ కోర్ట్ వంటివి ఉంటాయి.
ప్రతి టవర్ కింద సులభంగా యాక్సెస్ చేసే పలు సౌకర్యాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ గెస్ట్ లాంజ్ & లైబ్రరీ, గేమింగ్ జోన్/లాంజ్, కిడ్స్ ప్లే ఏరియా, క్రెష్, ఇండోర్ గేమ్‌లు, ఆర్ట్ /పాటరీ స్టూడియో, మల్టీ-పర్పస్ రూమ్, కో వర్కింగ్ స్పేస్, గెస్ట్ రూమ్స్, ఔట్‌డోర్ జిమ్, ఔట్‌డోర్ మినీ గోల్ఫ్ ఉంటాయి. పోడియం విషయానికి వస్తే.. విశ్రాంతి తీసుకోవడానికి రూపొందించిన ప్రదేశాల సమ్మేళనం. ఇక్కడ లగూన్ స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్, ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్స్, మల్టీపర్పస్ లాన్, కిడ్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, వాకింగ్ ట్రైల్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ కోర్టు, పికిల్‌బాల్ కోర్టు వంటివి ఉంటాయి. ఇక్కడ గ్రాండ్ ఎంట్రన్స్, వాటర్ ఫీచర్, గ్రాండ్ లాబీ, సైకిల్ లూప్, పెట్ కార్నర్ వంటివి ఉంటాయి. ఇవే కాకుండా ప్రత్యేకమైన టవర్ లాంజ్, స్కై బ్రిడ్జ్, రెండు ప్రత్యేకమైన గ్లాస్ ఎలివేటర్లతో పాటు రెండు హెలిప్యాడ్ లు కూడా ఉన్నాయి.
కళ్లు చెదిరే రీతిలో.. నభూతో న భవిష్యత్ అనే తరహాలో.. అత్యంత సుందరంగా, అంతకు మించిన సౌకర్యాలు, ఆటోమేషన్ తో అదిరిపోయేలా రూపుదిద్దుకుంటున్న ఈ అద్భుతమైన ప్రాజెక్టు వెనుక.. అంతే శక్తివంతమైన సంస్థలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. జీహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ ఫ్రా టెక్, అర్బన్ బ్లాక్స్ రియాల్టీలు కలిసి ఈ చిరస్మరణీయ ప్రాజెక్టును సాకారం చేస్తున్నాయి. విశ్వసనీయ ట్రాక్ రికార్డులు, దార్శనిక దృక్పథంతో కలిసి ఈ నిర్మాణ అద్భుతాన్ని సృష్టిస్తున్నాయి. జీహెచ్ఆర్ ఇన్ ఫ్రా 2019 నుంచి హైదరాబాద్‌లో నిర్మాణ కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. లక్ష్మీ ఇన్ ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2007 నుంచి ఈ రంగంలో ఉంది. ఇక అర్బన్ బ్లాక్స్ రియల్టీ 1980 నుంచే రియల్ ఎస్టేట్ జర్నీ చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ద కాస్కేడ్ నియోపోలిస్ ప్రాజెక్టులో మీ కలల గృహాన్ని సొంతం చేసుకోండి.
ప్రాజెక్టు ప్రత్యేకతలు..
This website uses cookies.