poulomi avante poulomi avante

కేటీఆర్ మిష‌న్.. అభివృద్ది విజ‌న్‌

KTR Mission is Development Vision

  • ప్ర‌భుత్వ దూర‌దృష్టి వ‌ల్ల రియ‌ల్‌ వృద్ధి
  • న‌గ‌రంపై పెట్టుబ‌డుల వ‌ర్షం
  • అభివృద్ధిపై కేటీఆర్ అహ‌ర్నిశ‌లు కృషి
  • ముక్త‌కంఠంతో ప్ర‌శంసించిన నిర్మాణ రంగం
  • రెరాలో అత్య‌వ‌స‌రం ఇన్‌స్టంట్ అప్రూవ‌ల్

ప్ర‌శాంతంగా నిద్ర‌పోతున్నాం..

సీఐఐ తెలంగాణ ఛైర్మ‌న్ శేఖ‌ర్ రెడ్డి, క్రెడాయ్ నేష‌న‌ల్ సెక్ర‌ట‌రీకి ధ‌న్య‌వాదాలు. తొలుత నాలుగు ఛాప్ట‌ర్ల‌తో ఆరంభ‌మైన క్రెడాయ్ తెలంగాణలో ప్ర‌స్తుతం 15 ఛాప్ట‌ర్లకు పెంచుకున్నాం.

కేవ‌లం నిర్మాణాలే కాకుండా సీఎస్సార్ కార్య‌క్ర‌మాల్ని చేస్తున్నాం. హ‌రిత‌హారంలో భాగంగా ఒక రోజులో ల‌క్ష మొక్క‌ల్ని నాట‌డంతో పాటు మూడేళ్ల పాటు మెయింటెయిన్ చేశాం. బ్ల‌డ్ క్యాంపులు, లేబ‌ర్ క్యాంపులు, రేష‌న్ డిస్ట్రిబ్యూష‌న్‌, సీఎం స‌హాయ నిధికి విరాళాలు అందజేయ‌డం వంటివి చేశాం. లా అండ్ ఆర్డ‌ర్ మెరుగ్గా ఉండ‌టం వ‌ల్ల ప్ర‌శాంతంగా నిద్ర‌పోతున్నాం. ఎన్విరాన్‌మెంట‌ల్ క‌మిటీ జులై 31కి పూర్త‌వుతుంది. కాబ‌ట్టి, ఈ ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. 2018లో క‌మిటీ లేకుండా 18 నెల‌లు ఇబ్బంది ప‌డ్డాం. అందుకే దీనిపై దృష్టి పెట్టాల‌ని మంత్రిని కోరుతున్నాం.
– ముర‌ళీకృష్ణా రెడ్డి, అధ్య‌క్షుడు, క్రెడాయ్ తెలంగాణ‌

డైన‌మిక్ లీడ‌ర్ ఉన్నాక దిగుల్లేదు

అతి త‌క్కువ స‌మ‌యంలో అనేక మంది బిల్డ‌ర్లు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి విచ్చేసిందుకు ధ‌న్య‌వాదాలు చెబుతున్నాను.

పెరుగుతున్న ఇళ్ల కొనుగోలుదారుల అవ‌స‌రాల్ని తీర్చేందుకు క్రెడాయ్ తెలంగాణ ఎల్ల‌ప్పుడూ ముందంజ‌లో ఉంటుంది. అందుకే, తామంతా కూర్చోని నిర్మాణ రంగంలో నెల‌కొనే ప‌లు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి ఈ కార్యాల‌యం ప‌నికొస్తుంది. డైన‌మిక్ లీడ‌ర్ కేటీఆర్ వంటి వ్య‌క్తి పుర‌పాల‌క శాఖ మంత్రిగా ఉన్నందు వ‌ల్ల నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లకు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్కారం ల‌భిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
– ప్రేమ్ సాగ‌ర్ రెడ్డి, ప్రెసిడెంట్ (ఎల‌క్ట్‌), క్రెడాయ్ తెలంగాణ‌

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌పై ప్ర‌త్యేక దృష్టి..

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ గురించి ప్ర‌త్యేకంగా ఒక ప్ర‌జంటేష‌న్ రూపొందించాం. ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు 300 దాకా ఉన్నాయి.

అందులో 90 రోజుల పాటు యువ‌త‌కు శిక్ష‌ణ‌నిస్తే మెరుగైన ఫ‌లితం ల‌భిస్తుంది. గ‌తంలో పుణెలో లేబ‌ర్ సెస్స్‌తో ఇలాంటి శిక్ష‌ణ‌ను అంద‌జేశారు. దీని వ‌ల్ల మ‌న యూత్‌కి మెరుగైన ఉపాధి, ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తాయి. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన తొలినాళ్ల‌లో సీఎం కేసీఆర్ ఏక‌కాలంలో ప‌దిజీవోల‌ను మంజూరు చేసి నిర్మాణ రంగానికి ఆప‌న్న‌హ‌స్తం అందించారు. అప్ప‌ట్నుంచి రియ‌ల్ రంగం గాడిలో ప‌డింది. లేఅవుట్ల‌లో జీవో నెం. 105 విత్ డ్రా చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాను. కాళేశ్వ‌రం అందుబాటులోకి రావ‌డంతో జిల్లాల్లోని ఇత‌ర మార్కెట్లు మెరుగౌతోంది. మాస్ట‌ర్ ప్లాన్లు లేక‌పోవ‌డం వ‌ల్ల ర‌క‌ర‌కాల ఇబ్బందులు ఎదురౌతున్నాయి. కాబ‌ట్టి, వీటిని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాలి.
– రామ‌చంద్రారెడ్డి, ఛైర్మ‌న్‌, క్రెడాయ్ తెలంగాణ‌

కేటీఆర్ కృషి వ‌ల్ల న‌గ‌రానికి బ్రాండింగ్‌

హైద‌రాబాద్ ల్యాండ్‌స్కేపింగ్ కి ఎక్క‌డ్లేని డిమాండ్ పెరిగింది. మంత్రి కేటీఆర్ కృషి వ‌ల్ల హైద‌రాబాద్‌కు బ్రాండింగ్ అధిక‌మైంది.

ఇక్క‌డి అభివృద్ధిని చూసేందుక మ‌హారాష్ట్ర నుంచి 250 మంది బిల్డ‌ర్లు విచ్చేస్తున్నారు. దేశంలో ఎక్క‌డ మార్కెట్ గురించి చ‌ర్చ వ‌చ్చినా హైద‌రాబాద్ ప్ర‌స్తావ‌న త‌ప్ప‌కుండా వ‌స్తుంది. అంతెందుకు ఇజ్రాయేల్‌లో క్రెడాయ్ తెలంగాణ నిర్వ‌హించిన న్యాట్‌కాన్ స‌ద‌స్సులో పాల్గొన్న అనేక మంది జాతీయ బిల్డ‌ర్లు హైద‌రాబాద్ అభివృద్ధి గురించి ఎంతో సానుకూలంగా చెప్పారు. మ‌న తెలంగాణ అభివృద్ధి చెందుతున్నందుకు ఎంతో గ‌ర్వ‌కార‌ణంగా ఉంది. ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌క్క‌న గ్రోత్ కారిడార్‌లో గ్రిడ్ రోడ్ల‌ను అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌ర‌ముంది. క్రెడాయ్ తెలంగాణ‌కు సొంత ఆఫీసు ఉండాల‌నే క‌ల సాకారం అయినందుకు సంతోషంగా ఉంది. ఇందుకు స‌హ‌క‌రించిన ప్ర‌తిఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు
– గుమ్మి రాంరెడ్డి, సెక్ర‌ట‌రీ, క్రెడాయ్ నేష‌న‌ల్‌

ఇన్ స్టంట్‌గా రెరా అప్రూవ‌ల్ ఇవ్వాలి!

క్రెడాయ్ తెలంగాణ సొంత ఆఫీసును ఏర్పాటు చేసినందుకు అభినంద‌న‌లు. దీని వ‌ల్ల బిల్డ‌ర్ల మ‌ధ్య క‌నెక్టివిటీ పెరుగుతుంది. ముంబై త‌ర్వాత హైద‌రాబాద్‌లో ఆకాశ‌హ‌ర్మ్యాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని సీబీఆర్ఈ స‌ర్వేలో తేలింది. కేటీఆర్ అంటే కేవ‌లం మంత్రి కాదు.. ఆయన స్వ‌యంగా ఒక మిష‌న్ మీద ప‌ని చేస్తున్న న‌వ‌శ‌క్తి అని చెప్పాలి. ఆయ‌న ప్ర‌పంచ‌దేశాల్లో ప‌ర్య‌టిస్తూ.. పెట్టుబ‌డుల్ని ఆక‌ర్షించ‌డంతో పాటు హైద‌రాబాద్ ఇమేజ్‌ని పెంచుతున్నారు. ఈరోజు కొనుగోలుదారులు ఇళ్ల‌ను కొంటున్నారంటే.. అది కేటీఆర్ చేస్తున్న కృషి కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు. ఆయ‌న చేస్తున్న కృషి వ‌ల్ల వ‌స్తున్న ఐటీ ఉద్యోగులే రియ‌ల్ రంగానికి క‌స్ట‌మ‌ర్లనే విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు.

ఒకప్పుడు చైనాలో రాత్రిపూట భ‌వ‌నాలు వెలుగుల‌తో మెర‌వ‌డాన్ని చూశాం. కొన్నేళ్ల త‌ర్వాత హైద‌రాబాద్‌లో అలాంటి మిరుమిట్లు గొలిపే ఆకాశ‌హ‌ర్మ్యాలు హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. హైద‌రాబాద్ నిర్మాణ రంగానికి అవ‌స‌ర‌మ‌య్యే నోడ‌ల్ ఆఫీస‌ర్ ను క్ష‌ణాల్లో నియ‌మించినందుకు ధ‌న్య‌వాదాలు చేస్తున్నాం. రెరా అప్రూవ‌ల్‌ని ఇన్‌స్టంట్‌గా ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. ఐటీ కారిడార్‌లో లాస్ట్ నైట్ క‌నెక్టివిటీని ఏర్పాటు చేయాలి.
– శేఖ‌ర్‌రెడ్డి, ఛైర్మ‌న్‌, సీఐఐ తెలంగాణ

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles