poulomi avante poulomi avante

హైద‌రాబాద్‌లో భూముల ధ‌ర‌లు త‌గ్గుతాయా?

111 జీవో పై ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ వేశామ‌ని.. ఆ క‌మిటీ నివేదిక రాగానే.. 111 జీవో ఎత్తివేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. భ‌విష్యత్తులో ఇక మీదట హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌కు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాలు అవసరం లేదని.. గోదావరి, కృష్ణా జలాలే పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదిక రాగనే జీవో నం.111ను ఎత్తివేస్తామని వెల్లడించారు. సుంక‌శిల ఇన్‌టేక్ ప్రాజెక్టు, మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ల వ‌ల్ల వ‌చ్చే వందేళ్ల దాకా హైద‌రాబాద్‌లో నీటి కొర‌త ఏర్ప‌డ‌ద‌న్నారు. అయితే, ఒకేసారి కాకుండా విడ‌త‌ల‌వారీగా 111 జీవో ఎత్తివేత కార్య‌క్ర‌మం చేప‌డ‌తామ‌న్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌త్యేకంగా మాస్ట‌ర్ ప్లాన్లు, గ్రీన్ జోన్లు వంటివి ఏర్పాటు చేస్తామ‌న్నారు. 6 మండలాల్లోని ‌83 గ్రామాల పరిధిలో ‌1,32,600 ఎకరాల భూమి జీవో 111 పరిధిలో ఉందని చెప్పారు. మరోవైపు దేవరాయాంజల్ భూముల్లో ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామని తెలిపారు.

 

భూముల ధ‌ర‌లు త‌గ్గుతాయా?

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే సీఎం కేసీఆర్ 111 జీవో ఎత్తివేస్తామ‌ని హామీ ఇచ్చారు. అందుకు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ప‌ని చేశారు. నీటి కొర‌త‌ను రాకుండా త‌గు చ‌ర్య‌లు తీసుకున్నారు. అందుకే, మంగ‌ళ‌వారం అసెంబ్లీలో ధైర్యంగా ప్ర‌క‌టించ‌గ‌లిగారు. 111 జీవో ఎత్తివేస్తే.. సుమారు ల‌క్షా 32 వేల 6 వంద‌ల ఎక‌రాలు అందుబాటులోకి వ‌స్తుంది. అంటే, భూమి స‌ర‌ఫ‌రా పెరుగుతుంది కాబ‌ట్టి, ఆటోమెటిగ్గా స్థ‌లాల ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. ప్లాట్ల స‌ర‌ఫ‌రా పెరిగితే.. కొనుగోలుదారులకు ప్ర‌త్యామ్నాయాలు పెరుగుతాయి. అందుకే, ఇప్పుడున్న గిరాకీ అయితే ఉండ‌దు. దీంతో క్ర‌మ‌క్ర‌మంగా ప్లాట్లు, ఆపై ఫ్లాట్ల ధ‌ర‌లు త‌గ్గుతాయి.

 

యూడీఎస్‌, ప్రీలాంచులకు చెక్‌!

స్థ‌లాల ధ‌ర‌లు అధికంగా ఉండ‌టం.. అప‌రిమిత సంఖ్య‌లో అంత‌స్తులు వేసుకునే వెసులుబాటు ఉండ‌టం వ‌ల్లే.. అధిక శాతం డెవ‌ల‌ప‌ర్లు యూడీఎస్‌, ప్రీలాంచ్ స్కీములంటూ ఆరంభిస్తున్నారు. అయితే, అధిక శాతం భూమి అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల యూడీఎస్‌, ప్రీలాంచ్ ప్రాజెక్టుల‌కు చెక్ ప‌డుతుంది. ప్ర‌ధానంగా కోకాపేట్‌, కొల్లూరు, వెలిమ‌ల‌, పాటి ఘ‌న‌పూర్ వంటి ప్రాంతాల్లో యూడీఎస్‌, ప్రీలాంచ్లో ప్రాజెక్టుల్ని ఆరంభించిన వారికి ఇది పెద్ద దెబ్బ త‌గులుతుంది. ఎందుకంటే, ప‌క్క‌నే అధిక భూమి అందుబాటులోకి వ‌చ్చిన‌ప్పుడు ఆటోమెటిగ్గా స‌ర‌ఫ‌రా పెరిగి గిరాకీ త‌గ్గుతుంది. ప్లాట్ల రేట్లు త‌గ్గితే అక్క‌డే కొనుక్కోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు త‌ప్ప‌.. అక్ర‌మ రీతిలో అమ్మే ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనేందుకు చాలామంది వెన‌క‌డుగు వేస్తారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles