ఏ భవనంలోనైనా ఓ భాగమైపోయింది
ఇక్కడ రైల్వే ట్రాక్స్, రోడ్డు, సైకిల్
ట్రాక్స్, వాక్ వేల ఏర్పాటు భేష్
వాటిని మన నగరాల్లోనూ అలాగే చేస్తే
జీవన నాణ్యత పెరుగుతుంది
పెట్టుబడులకు ఎంతో అనువైన నగరం హైదరాబాద్
రియల్ ఎస్టేట్ గురుతో సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్
అధిక జనసాంద్రత కలిగిన సిడ్నీలో ల్యాండ్ స్కేపింగ్ చాలా చక్కగా నిర్వహిస్తున్నారని.. ఈ విషయంలో సిడ్నీని చూసి మనం చాలా నేర్చుకోవచ్చని సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ పేర్కొన్నారు. ఇటీవల సిడ్నీలో జరిగిన క్రెడాయ్ నాట్ కాన్-2024 సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ గురు ఆయన్ను పలకరించింది. సిడ్నీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? క్రెడాయ్ నాట్ కాన్-2024 సదస్సు ఎలా జరిగింది? సుమధుర గ్రూప్ ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు చేపట్టింది? కొత్తగా ఆ సంస్థ నుంచి వస్తున్న ప్రాజెక్టులు ఏమిటి? ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంది? కొత్తగా ఇల్లు కొనాలా.. వద్దా అనే అంశాలపై ఆయన బోలెడు విషయాలు పంచుకున్నారు. అవన్నీ ఆయన మాటల్లోనే..
ల్యాండ్ స్కేపింగ్ ను నగరంలో లేదా భవనాల్లో ఎలా చేయొచ్చో ప్రధానంగా సిడ్నీలో అబ్జర్వ్ చేశాను. చాలా జనసాంద్రత ఉన్న భవనాల్లో సైతం ల్యాండ్ స్కేపింగ్ చాలా బాగా చేశారు. ఓవరాల్ ఇన్ ఫ్రాలో ల్యాండ్ స్కేపింగ్ ను చాలా చక్కగా భాగం చేశారు. అదే విధంగా వాకింగ్ ట్రాక్స్, సైకిల్ ట్రాక్స్ బాగున్నాయి. ఇంత జనసాంద్రత ఉన్నప్పటికీ.. రైల్ ట్రాక్స్, రోడ్డు, సైకిల్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ ఎంతగా చక్కగా ఏర్పాటు చేయొచ్చు అనేది ఇక్కడ చూడొచ్చు. వీటిని మన నగరాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజల జీవన నాణ్యత పెరుగుతుంది. లీడర్ షిప్, బిజినెస్ ఫోకస్ గురించి చాలా మంది ప్రముఖులు సందేశాలిచ్చారు. మన టీంను ఎలా డెవలప్ చేసుకోవాలి అనేదానిపై సెషన్స్ జరిగాయి. ఇలాంటి సెషన్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. ఈ ఈవెంట్ వల్లా చాలా తెలుసుకున్నాం.
క్రెడాయ్ గత 22 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఒక ఇంటర్నేషనల్, ఒక నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తోంది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో భాగంగా ఈ సారి సిడ్నీని ఎంపిక చేశాం. ఇంత జనసాంద్రత కలిగిన నగరంలో కూడా బిల్డింగ్ స్టక్చర్, ఇన్ ఫ్రాస్టక్చర్ వంటివి ఎలా మేనేజ్ చేస్తున్నారో నేర్చుకోవడానికి బాగుంటుదని సిడ్నీని ఎంపిక చేశాం. సుమధుర గ్రూప్ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ప్రారంభించి 29 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు 50కి పైగా ప్రాజెక్టులు, 12 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ డెలివరీ చేశాం. 50 మిలియన్ చదరపు అడుగులు నిర్మాణ దశలో 20 మిలియన్ చదరపు అడుగులు అనుమతుల దశలో ఉన్నాయి.
రెసిడెన్షియల్ పైనే ప్రధానంగా దృష్టి సారించాం. దీంతోపాటు కమర్షియల్, ప్లాటెడ్ డెవలప్ మెంట్, వేర్ హౌసింగ్ విభాగంలోనూ ఉన్నాం. హైదరాబాద్, బెంగళూరులోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ పుప్పాలగూడలో పాలే రాయల్ ప్రాజెక్టు మొదలుపెట్టాం. రెరా అనుమతి కూడా వచ్చింది. ఫౌండేషన్ కూడా అయింది. ఇది ఉబర్ లగ్జరీ ప్రాజెక్టు. 572 ఫ్లాట్లు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్, ఎమినిటీస్ తో 6 బేస్ మెంట్స్, గ్రౌండ్ ప్లస్ 53 అంతస్తులు ఉంటాయి. హైదరాబాద్ లో మరో రెండు ప్రాజెక్టులకు భూ సేకరణ జరుపుతున్నాం.
హైదరాబాద్ లో ఎన్నికల తర్వాత కాస్త వెయిట్ అండ్ వాచ్ మోడ్ ఉంది. ప్రస్తుతం కాస్త అమ్మకాలు తగ్గినట్టు తెలుస్తోంది. కానీ ఇది తాత్కాలికమే. ఒకటి లేదా రెండు త్రైమాసికాలు ఇలా నెమ్మదిగా ఉండొచ్చు. తర్వాత మంచి మార్కెట్ వస్తుంది. ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నందున కొనుక్కోవాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలు ఉన్న నగరం హైదరాబాద్.
ట్రిపుల్ ఆర్, స్కిల్ సిటీ వంటి వాటితో హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంది. ఏ ప్రాజెక్టు అయినా డెలివరీ అనేది అన్నింటికీ ముఖ్యం. ధర కాస్త తక్కువ వస్తుంది అనేదాని కంటే ఆ బిల్డింగ్ డెలివరీ పరిస్థితి ఏమిటి? ఆ బిల్డర్ గత ప్రాజెక్టులు ఆన్ టైమ్ కి డెలివరీ చేశారా లేదా? నాణ్యత ఎలా ఉంది అనే అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
This website uses cookies.