ఇంటిని స్టైలిష్ గా, కొత్త ట్రెండింగ్ కు అనుగుణంగా ఉంచుకోవాలని చాలామంది భావిస్తారు. ఇందుకోసం రకరకాల ఇంటీరియర్ డిజైన్లను గమనిస్తారు. మరి, మీ అభిరుచికి తగ్గట్టుగా మీ ఇంటిని అద్భుతంగా మేకోవర్ చేసేందుకు కొన్ని అంశాలపై దృష్టి సారిస్తే చాలు..
మారుతున్న కాలం కొద్దీ చాలా అంశాల్లో మార్పులు వస్తున్నాయి. అది మన ఇంట్లో ఫర్నిచర్ కు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం చాలామంది స్మార్ట్ డిజైన్ మీదే దృష్టి పెడుతున్నారు. ఫర్నీచర్ కొన్నామంటే అది ఎంతవరకూ పనికొస్తుందనే అంశాన్ని గమనిస్తున్నారు. మొత్తానికి, ఇల్లంతా ఇంటెలిజెంట్‌గా కనిపించేందుకు ఆధునిక గృహ యజమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఒక గది నుంచి మరో గదికి సులభంగా తరలించే టేబుల్, కుర్చీలు.. చిన్న ప్రదేశాల్లో సైతం సులభంగా ఇమిడిపోయే స్లైడింగ్ డోర్ వార్డ్ రోబ్ ల గురించి ఆలోచించాలి. మీరు తరచుగా ఇళ్లు మారుతూ ఉంటే ఇవి బాగా సరిపోతాయి. మీ ఇల్లు చిన్నదైతే.. ఇలాంటి ఫర్నిచర్ వల్ల మీకు చాలా స్పేస్ కలిసి వస్తుంది. అందం, ఆకర్షణతోపాటు సరికొత్త ట్రెండ్ కు ఇవి నిదర్శనంగా ఉంటాయి.
ఎండీఎఫ్ తో చేసిన 2 రెండు స్లైడింగ్ డోర్ల వార్డ్ రోబ్ ని చూడండి. ఇది మీ బట్టలు, ఉపకరణాలతో పెట్టుకోవడానికి వీలుగా విశాలమైన అల్మారాలు కలిగి ఉంది. సొరుగులో విలువైన వస్తువులను ఉంచి తాళం వేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ తెల్ల రంగు వార్డ్ రోబ్ అన్ని రకాల కలర్ థీమ్ లతో బాగా కలిసిపోతుంది.
ప్రస్తుతం చాలామంది ఇంటి నుంచే పనిచేయడం.. విద్యార్థులు ఆన్ లైన్ తరగతులకు హాజరు కావడం వంటి పరిణామాలు వర్క్ ఫ్రం హోం ఫర్నిచర్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా రూపొందించిన స్టడీ టేబుల్, కుర్చీ లేదా బుక్ షెల్ఫ్ లను పరిశీలించండి. మీది చిన్న ఇల్లయితే మల్టీ ఫంక్షనల్ వర్క్ ఫ్రం హోం పర్నిచర్ తీసుకోండి. ఉదాహరణకు డైనింగ్ చైర్ గా మార్చడానికి వీలయ్యే ఆఫీసు కుర్చీ తీసుకోవచ్చు. అలాగే మీకు సరిగ్గా సరిపోయే స్టడీ టేబుల్ ఉండాలి. దాని సైజ్ మరీ పెద్దదిగా ఉండకూడదు.. అలాగే చిన్నదీ కాకూడదు. స్టోరేజ్ స్పేస్ తో కూడిన విశాలమైన ఆఫీస్ డెస్క్ కూడా ఉంది. ఇది డెస్క్ టాప్ కంప్యూటర్, సీపీయూ పెట్టుకోవడం కోసం వెసులుబాటు కలిగి ఉంది.
ప్రస్తుతం చాలామంది మినిమలిస్టిక్ ఫర్నిచర్ వైపు మొగ్గు చూపుతున్నారు. 2021లో ఎక్కువగా ప్రారంభమైన ఈ ధోరణి.. 2022లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మీ ఇంటి ఫర్నిచర్ ను ఎంపిక చేసుకునేటప్పుడు ఆలోచనాత్మకంగా, అర్థవంతంగా వ్యవహరించండి. ఇందుకోసం నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
This website uses cookies.