Categories: TOP STORIES

సముద్రపు ఒడ్డున పెంట్ హౌస్ ఇష్టం

రియల్ ఎస్టేట్ గురుతో ప్రముఖ నటి ఇషా కొప్పికర్

 

నటి ఇషా కొప్పికర్.. మంగళూరు సంతతికి చెందిన కొంకణి మరాఠీ కుటుంబంలో మహిమ్ లో జన్మించారు. సొంతింటి గురించి ఆమె అభిప్రాయాలు ఏమిటి? ఎలాంటి ఇల్లు ఆమెకు ఇష్టం తదితర విషయాలతోపాటు చిన్ననాటి సంగతులను కూడా ‘రియల్ ఎస్టేట్ గురు’తో పంచుకున్నారు.

‘నేను 2004లో సొంత ఇల్లు కొన్నాను. అది సిద్ధి వినాయకుని ఆలయానికి దగ్గరగా ఉంటుంది. ఆ సమయంలో అది నాకు చాలా కావాల్సిన ప్రాపర్టీ. ఐదేళ్ల తర్వాత సముద్ర లింక్ నిర్మించారు. ఇక అప్పటి నుంచి అది నా ఆల్ టైమ్ వ్యూగా మారింది. ఒకప్పుడు మనం నివసించిన ప్రదేశాల్లో తరచుగా చూడాలనుకునే ప్లేస్ అది’ అని పేర్కొన్నారు. చిన్నప్పటి సంగతులు గురించి ప్రస్తావిస్తూ.. ‘కాలంలో కొంచెం వెనక్కి వెళితే, అప్పట్లో ఓ కాలనీలో ఉండేవాళ్లం. నేను చాలా సంప్రదాయ వాతావరణంలో పెరిగాను. ఆ కాలనీ క్రమంగా ఏడెనిమిది భవనాల నుంచి అభివృద్ధి చెందడం ప్రారంభించింది. అక్కడ మాట్లాడుకోవడానికి చాలామంది ఇరుగు పొరుగువారు ఉండేవారు. అయితే, కమ్యూనిటీ లివింగ్ చాలా అనవసరమైన గప్ చుప్ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. మన మూలాలు కలిగిన ఆ ప్రయాణాలను ఎప్పటికీ మరచిపోలేం కదా? కలిసి పండుగలు జరుపుకోవడం యొక్క ప్రామఖ్యతను అక్కడే తెలుసుకున్నాను. ఆ కాలనీలో గడిపిన అత్యంత అందమైన, ఆనందకరమైన సమయం అది’ అని వెల్లడించారు.

దక్షిణాది సినిమాలతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఇషా.. ఇంటికి సంబంధించి మరిన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. ‘నేను ప్రముఖ నటిని అయినా, కాకపోయినా చాలా స్థలం కలిగి ఉండటాన్ని ఇష్టపడతాను. అయితే, ఎక్కువ ఫర్నిచర్ బోరింగ్ గా ఉంటుంది. నా ఇంటికి వెళ్లే మార్గం విశాలంగా ఉండాలి’ అని తెలిపారు. తాను ఏదైనా అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొంటే టాప్ ఫ్లోర్ లేదా గ్రౌండ్ ఫ్లోర్ లో ఇషా కొప్పికర్ నారంగ్ అని నేమ్ ప్లేట్ చూస్తారని వ్యాఖ్యానించారు. ‘నేను ప్రత్యేకంగా పెంట్ హౌస్ గురించి ఆలోచిస్తే.. దానిని సముద్ర ఒడ్డున నిర్మించడానికి ఇష్టపడతాను. అలాగని నేను నీటి బిడ్డను కాదు. కానీ అక్కడి సౌందర్యం నన్ను కట్టిపడేస్తుంది. అందమైన ప్రకృతి దృశ్యంతో మమేకం కావడం కంటే ఏం కావాలి చెప్పండి’ అని ప్రశ్నించారు.

ముంబైలో ఆమెకు ఉన్న అందమైన కలల భూమిలో ప్రశాంతత కలిగించే ప్రదేశం ఏదని అడగ్గా.. అది కచ్చితంగా తన బెడ్ రూం అని బదులిచ్చారు. ‘నేను ఉమ్మడి కుటుంబంతో కలిసి జీవిస్తున్నాను. అందువల్ల నా సొంత ప్లేస్ లో మాత్రమే హాయిగా ఉండగలుగుతాను. అక్కడ ఉన్నప్పుడే నాలో శక్తులు ద్విగుణీకృతమవుతాయి. మీకు తెలుసా? నేను ఇటలీ, గ్రీస్ సందర్శించినప్పుడు అక్కడి సంస్కృతి నన్ను ఆకట్టుకుంది. వెంటనే వాటిని నా ఇంటికి చేర్చాను. తెలుపు, నీలం రంగుల ప్యాటర్న్ బాగా నచ్చింది. నేను పర్వత ప్రేమికురాలిని కానప్పటికీ, మట్టి అనుభూతిని కలిగించే చెక్క కుటీరాన్ని అమితంగా ఇష్టపడతాను. చెక్క నన్ను బాగా ఆకర్షిస్తుంది. కానీ ముదురు రంగులు నాకు అంతగా నచ్చవు. ఇక నలుపు రంగంటే అసహ్యం’ అని ఇషా ముగించారు.

This website uses cookies.