ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ దేశంలోని పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటని ఆ సంస్థకు చెందిన యోగేంద్ర జైశ్వాల్ తెలిపారు. తమ కంపెనీ 35 ఏళ్లుగా ఈ విభాగంలో సేవలందిస్తోందని వెల్లడించారు. క్రెడాయ్ తెలంగాణ స్టేట్ కాన్ కి హాజరైన సందర్భంగా ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడారు. వివిధ రకాల గృహరుణాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు.
ఇల్లు కొనుగోలు, నిర్మాణం, రెన్యువేషన్, ఇంప్రూవ్ మెంట్ వంటివాటికి రుణాలిస్తామన్నారు. ప్రాపర్టీని సెక్యూరిటీగా పెట్టుకుని లోన్లు మంజూరు చేస్తామని వివరించారు. అలాగే తాము ప్రాజెక్టు ఫండింగ్ కూడా చేస్తామని తెలిపారు. కొత్తగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు చేపట్టిన బిల్డర్లకు రుణాలిస్తామని వెల్లడించారు. బిల్డర్లు తమ ప్రాజెక్టును ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. అత్యుత్తమ వడ్డీ రేట్లకు, తక్కువ ప్రాసెసింగ్ ఫీజుతో, చక్కని సర్వీసు అందజేస్తామని స్ఫష్టం చేశారు. అంతే కాకుండా కొన్ని ప్రత్యేక పథకాలు కూడా తాము అందిస్తున్నామని జైశ్వాల్ చెప్పారు. సీనియర్ సిటిజన్ల కోసం గృహ వరిష్ట అనే పథకం ద్వారా 80 ఏళ్ల లోపు వయసున్నవారికి కూడా రుణాలిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఐటీఆర్ ఆధారంగా రుణాలు మంజూరు చేసేందుకు గృహ ఆశా పథకం కూడా ప్రవేశపెట్టినట్టు చెప్పారు. గత రెండేళ్ల ఐటీఆర్ ల ఆధారంగా రుణాలు ఇస్తామని వివరించారు. ఇలా తమ వద్ద గృహ రుణాలకు సంబంధించి చాలా పథకాలు ఉన్నాయని.. అందువల్ల అందరూ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ని ఎంచుకోవాలని ఆయన కోరారు.
This website uses cookies.