విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టును రెండు ఫేజుల్లో చేపడతామని ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణా రెడ్డి సీఎంకి వివరించారు. ఫేజ్-1లో 46 కిలో మీటర్ల మేర రూ.11,400 కోట్ల వ్యయంతో మెట్రో రైలు నిర్మిస్తామని, తరువాత ఫేజ్-2లో 30 కిలోమీటర్ల మేర రూ.5,734 కోట్లతో మెట్రో రైలు నిర్మిస్తామన్నారు.
ఫేజ్-1 మెట్రో రైలు పనులు మొదలు పెట్టి నాలుగేళ్లలోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే విజయవాడలో 38 కిలోమీటర్ల మేర రూ.11వేల కోట్లతో చేపట్టబోయే మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు.