Categories: TOP STORIES

మెట్రో రైలుతో రియాల్టీకి జోష్‌?

హైద్రాబాద్‌ రేంజ్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లే ప్రకటన చేసింది రేవంత్‌ ప్రభుత్వం. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న మెట్రో రెండో దశను అనౌన్స్‌ చేసింది. ఇప్పటికే డెవలప్మెంట్‌, రియల్‌ ఎస్టేట్ సెక్టార్లో దూసుకుపోతున్న భాగ్యనగరం- మెట్రో రెండో దశ కూడా పూర్తైతే ఆకాశమే హద్దుగా చెలరేగడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

పీపీపీ విధానంలో నిర్మించిన ప్రపంచంలోని అతి పెద్ద మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ హైద్రాబాద్‌ మెట్రోనే. ఇక ఫేజ్‌ టూలో ప్లాన్‌ ఏ.. ప్లాన్‌ బీగా కారిడార్లను విభజించి పనులు చేపట్టనున్నారు. ప్లాన్‌ ఏలో 5 కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది మొత్తం 76.4 కిలోమీటర్లు ఉండనుంది. 40 కిలో మీటర్లు ప్రయాణించేలా ప్లాన్‌ బీలో ఒక కారిడార్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికే కారిడార్ వన్‌లో మియాపూర్‌ టూ ఎల్బీనగర్‌, కారిడార్‌ టూలో జూబ్లీ బస్‌స్టేషన్‌ టూ ఎంజీబీఎస్‌, కారిడార్‌ త్రీలో నాగోల్‌ నుంచి రాయ్‌దుర్గ్‌ వరకు మెట్రో నడుస్తోంది.

రెండోదశలోని పార్ట్‌-ఏలోని కారిడార్‌-ఫోర్‌లో నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కారిడార్‌- 36.8 కిలోమీటర్లు, కారిడార్‌ ఫైవ్‌లో రాయ్‌దుర్గ్‌ టూ కోకాపేట నియోపొలిస్‌ 11.6 కిలోమీటర్లు, కారిడార్‌ సిక్స్‌లో ఎంజీబీఎస్‌ టూ చాంద్రాయణగుట్ట 7.5 కిలోమీటర్లు, కారిడార్‌ సెవన్‌లో మియాపూర్‌ టూ పటాన్‌చెరు 13.4 కిలోమీటర్లు, కారిడార్‌ ఎయిట్‌లో ఎల్బీ నగర్‌ టూ హయత్ నగర్‌ 7.1 కిలోమీటర్లు మెట్రో రానుంది. పార్ట్‌ బీ కింద కారిడార్ నైన్‌లో రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి స్కిల్‌ యూనివర్శిటీ ఉన్న ఫోర్త్‌ సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించనున్నారు.

మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ హైద్రాబాద్‌ రియల్ ఎస్టేట్‌ ఎంటైర్‌ పిక్చర్‌ను మార్చేసింది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌ సూపర్‌ హిట్‌. గత ప్రభుత్వం రెండో దశ ప్రకటనపై టైం తీసుకోవడంతో పాటు ప్రతిపాదనల దగ్గర ఆగిపోయింది. నగరవాసుల ఎదురుచూపులకు బ్రేకేస్తూ రెండో దశను అనౌన్స్‌ చేసింది రేవంత్‌ ప్రభుత్వం. 5 మార్గాల్లో 76.4 కిలోమీటర్లు.. ఓవరాల్‌గా ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీ కలుపుకోని మొత్తం 116.4 కిలోమీటర్లు కవర్‌ అయ్యేలా మెట్రో రెండో దశ ప్లానింగ్ ఉండటంతో రియల్ ఎస్టేట్‌ సెక్టార్‌లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయ్‌.

మెట్రో సెకండ్ ఫేజ్‌లో ప్రతిపాదించిన మార్గాలన్నీ మొదటి దశలో ఉన్న 3 కారిడార్లకు కొనసాగింపుగా ఉన్నాయ్‌. అంటే అటు హయత‌నగర్‌ నుంచి ఇటు పటాన్‌చెరు వరకు.. అలాగే ఎయిర్‌పోర్ట్‌ వరకూ మెట్రో అందుబాటులోకి రానుంది.

  • ఎల్బీ నగర్‌, మైలాన్ దేవుపల్లి, జల్‌పల్లి, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు మొత్తం 22 స్టేషన్లు ప్రతిపాదించారు. అంటే విజయవాడ నేషనల్‌ హైవేలో కవరయ్యే హయత్‌నగర్‌.. ముంబై నేషనల్‌ హైవేలో పటాన్‌చెరు టూ సంగారెడ్డి.. బెంగళూర్‌ జాతీయ రహదారిపై శంషాబాద్‌ టూ షాద్‌నగర్‌.. అలాగే శంషాబాద్‌ నుంచి ఫోర్త్‌ సిటీ వరకు రియల్‌ ఎస్టేట్‌ ఊపందుకోవడం ఖాయమని చెప్పాలి. ఇప్పటికే మెట్రో రెండో దశ వస్తుందని ప్రకటించిన ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్నాయి ఇళ్ల నిర్మాణాలు. కాకపోతే సరైన ఇన్ఫ్రా లేకపోవడం.. ట్రాన్స్‌పోర్ట్‌ తక్కువ ఉండటంతో బయ్యర్లు ఇటువైపు రావడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదనే ప్రచారాలున్నాయ్‌. అందుకే మెట్రో రైల్‌ రెండో దశ ప్రకటించగానే డెవలపర్లలో ఉత్సాహాం కనిపిస్తోంది.
  • ట్రాన్స్‌పోర్టేషన్‌ పెరిగితే మిడిల్‌ క్లాస్‌, ఎగువ మధ్య తరగతి బయ్యర్లు ఆయా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గు చూపించడం ఖాయం. ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసమూ కొనుగోళ్లు చేసే వారి సంఖ్య కూడా పెరగనుంది. అందుకే మెట్రో పనుల ప్రారంభం కోసం అన్ని వర్గాల వారు ఎదురు చూస్తున్నాయ్‌.

This website uses cookies.