* 223 ప్లాట్ల వేలం ప్రక్రియకు హెచ్ఎండి సన్నాహాలు
* మార్చి 14, 15, 16, 17 తేదీల్లో ఎంఎస్టిసి ద్వారా ఈ–ఆక్షన్
(రెజ్ న్యూస్, హైదరాబాద్) రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్ లో 117 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండి) లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తుంది. దీనిలో దాదాపు వెయ్యి ప్లాట్ల వరకు ఉండే తొర్రూర్ లే అవుట్ లో ప్రస్తుతం 30 ఎకరాల్లో 223 ప్లాట్లను అభివృద్ధి చేసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టిసి ద్వారా ఈ– ఆక్షన్ పద్దతిలో విక్రయించేందుకు హెచ్ఎండిఏ సన్నాహాలు చేస్తున్నది. దీనికి సంబంధించి శుక్రవారం(25వ తేదీన) ప్రీబిడ్ మీటింగ్‌ను హెచ్ఎండిఏ తోర్రూర్ సైట్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా 300 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల వరకు ప్లాట్ల సైజుతో హెచ్ఎండిఏ లే అవుట్ ను రూపొందించింది. లే అవుట్ కు ముందు వంద అడుగుల ప్రధాన రహదారి(మాస్టర్ ప్లాన్ రోడ్), లే అవుట్ లోపల 60 అడుగులు, 40 అడుగుల వెడెల్పుతో రహదారులను హెచ్ఎండిఏ ఏర్పాటు చేస్తుంది. తొర్రూర్ లే అవుట్లో గజానికి కనీస (బేసిక్ రేటు) ధర రూ.20,000 లుగా ప్రభుత్వం నిర్ణయించింది. తొరూర్ లే అవుట్ లో ప్లాట్లను కొనుగోలు చేయాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టిసి కి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1,180లు చెల్లించి నమోదు చేసుకోవాలి. అంతే కాకుండా ఈ–ఆక్షన్‌లో పాల్గొనేందుకు ప్రతి ప్లాట్‌కు లక్ష రూపాయల చొప్పున ఎర్లీ మనీ డిపాజిట్ (ఈఎండి) చెల్లించాల్సి ఉంటుంది.
మార్చి మూడో వారంలో 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒక దఫా, మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరొక దఫా చొప్పున నాలుగు రోజుల పాటు ఆన్ లైన్ పద్దతిలో ఎంఎస్టిసి ద్వారా ప్లాట్ల ఈ–ఆక్షన్ ప్రక్రియ జరుగుతుంది. హెచ్ఎండిఏ లే అవుట్లలో ప్లాట్ల విక్రయాలకు సంబంధించిన మరింత సమాచారం హెచ్ఎండిఏ వెబ్ సైట్ లోనూ, ఎంఎస్టిసి వైబ్ సైట్ లో వివరాలు ప్రజానీకానికి అందుబాటులో ఉంచారు.
This website uses cookies.