poulomi avante poulomi avante

తొర్రూర్ లేఅవుట్లో కనీస గ‌జం ధ‌ర‌.. రూ.20,000

* 223 ప్లాట్ల వేలం ప్రక్రియకు హెచ్ఎండి సన్నాహాలు
* మార్చి 14, 15, 16, 17 తేదీల్లో ఎంఎస్​టిసి ద్వారా ఈ–ఆక్షన్​

(రెజ్ న్యూస్‌, హైదరాబాద్​) రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్​ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్​ లో 117 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండి) లేఅవుట్​ను అభివృద్ధి చేస్తుంది. దీనిలో దాదాపు వెయ్యి ప్లాట్ల వరకు ఉండే తొర్రూర్​ లే అవుట్​ లో ప్రస్తుతం 30 ఎకరాల్లో 223 ప్లాట్లను అభివృద్ధి చేసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్​టిసి ద్వారా ఈ– ఆక్షన్​ పద్దతిలో విక్రయించేందుకు హెచ్ఎండిఏ సన్నాహాలు చేస్తున్నది. దీనికి సంబంధించి శుక్రవారం(25వ తేదీన) ప్రీబిడ్​ మీటింగ్​ను హెచ్ఎండిఏ తోర్రూర్​ సైట్​ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.

మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా 300 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల వరకు ప్లాట్ల​ సైజుతో హెచ్ఎండిఏ లే అవుట్​ ను రూపొందించింది. లే అవుట్​ కు ముందు వంద అడుగుల ప్రధాన రహదారి(మాస్టర్​ ప్లాన్​ రోడ్​), లే అవుట్​ లోపల 60 అడుగులు, 40 అడుగుల వెడెల్పుతో రహదారులను హెచ్ఎండిఏ ఏర్పాటు చేస్తుంది. తొర్రూర్​ లే అవుట్​లో గజానికి కనీస (బేసిక్​ రేటు​) ధర రూ.20,000 లుగా ప్రభుత్వం నిర్ణయించింది. తొరూర్​ లే అవుట్​ లో ప్లాట్లను కొనుగోలు చేయాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్​టిసి కి రిజిస్ట్రేషన్​ ఫీజు కింద రూ.1,180లు చెల్లించి నమోదు చేసుకోవాలి. అంతే కాకుండా ఈ–ఆక్షన్​లో పాల్గొనేందుకు ప్రతి ప్లాట్​కు లక్ష రూపాయల చొప్పున ఎర్లీ మనీ డిపాజిట్ ​(ఈఎండి) చెల్లించాల్సి ఉంటుంది.

మార్చి మూడో వారంలో 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒక దఫా​, మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరొక దఫా చొప్పున నాలుగు రోజుల పాటు ఆన్​ లైన్​ పద్దతిలో ఎంఎస్​టిసి ద్వారా ప్లాట్ల ఈ–ఆక్షన్​ ప్రక్రియ జరుగుతుంది. హెచ్ఎండిఏ లే అవుట్లలో ప్లాట్ల విక్రయాలకు సంబంధించిన మరింత సమాచారం హెచ్ఎండిఏ వెబ్​ సైట్​ లోనూ, ఎంఎస్​టిసి వైబ్​ సైట్​ లో వివరాలు ప్రజానీకానికి అందుబాటులో ఉంచారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles