మనదేశంలో ఖరీదైన రియల్ ఎస్టేట్ కు కేరాఫ్ అడ్రస్ ముంబై.. అలాగే మన దేశంలో ఎంతో మందికి అమెరికా వెళ్లాలనుకోవడం కల. తాజాగా ఈ రెండింటి మధ్య పోలికలు చూస్తున్నారు. ముంబైలో సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కొనడం మంచిదా? లేక అమెరికాలో పెద్ద ఇల్లు కొనడం బెటరా అని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఎక్కడ పెట్టుబడి పెడితె తెలివైన నిర్ణయం అనేదానిపై విశ్లేషణలు సాగుతున్నాయి. ‘నేను అంధేరి వెస్ట్ లో ఇంటి కోసం వెతికాను. సింగిల్ బీహెచ్ కే రూ.1.80 కోట్లు చెప్పారు. పైగా అలాంటి ఇళ్లు చాలా వరకు రీ డెవలప్ మెంట్ కు వెళ్తాయి.
అదే ధరకు అమెరికాలోని చిన్న నగరంలో పెద్ద ఇల్లు వస్తుంది’ అని ఓ అమెరికన్ పోస్ట్ చేశారు. అయితే, ప్రారంభ ఖర్చు ఒకేలా ఉన్నప్పటికీ, ప్రాపర్టీ ట్యాక్సులు కూడా చూడాలని.. అలాగే అమెరికాలో జనరల్ మెయింటనెన్స్ చాలా ఖరీదని పేర్కొన్నారు. పరిమిత స్థలం కారణంగా చుక్కలను తాకుతున్న ప్రాపర్టీ ధరలతో ముంబై నగరం భారత్ లోనే ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా ఉంది. మరోవైపు పెద్ద ఇళ్లు, మెరుగైన మౌలిక సదుపాయాలు అందిస్తున్నప్పటికీ.. అధిక ప్రాపర్టీ ట్యాక్సులు, మార్కెట్ హెచ్చుతగ్గుదలతో అమెరికా హౌసింగ్ మార్కెట్ కూ కొన్ని సవాళ్లు ఉన్నాయి.
అమెరికాలో ఉద్యోగ అభద్రత నేపథ్యంలో ముంబైలో సింగిల్ బీహెచ్ కే కొనడంతో పోలిస్తే.. యూఎస్ లో పెద్ద ఇంటిని కొనడం కూడా మంచిది కాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. “ముంబై లో వేడి, ధూళి ధూళి దానిని నివాసయోగ్యంగా అనిపించకుండా చేస్తుంది. అదే సమయంలో టైర్2, 3 నగరాలు ఆచరణీయమైన ఎంపికలు కావు. అమెరికాలో ఇళ్ళు సరసమైనవి కావచ్చు, కానీ ఉద్యోగం లేకపోతే ఆర్థిక పరిస్థితులు త్వరగా క్షీణిస్తాయి. అయితే, మొత్తం జీవన నాణ్యత మాత్రం అక్కడ చాలా మెరుగ్గా ఉంటుంది” అని ఓ నెటిజన్ పోస్టు చేశారు. ఓ నెజిటన్ దీనికి వ్యూహాత్మక విధానం సూచించారు. అమెరికాలో ఇల్లు కొని అద్దెకు ఇవ్వాలని.. ఆ ఆదాయంతో ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని చెప్పారు.
ఒక విధంగా ఇది మెరుగైన ఆలోచని అని పలువురు మద్దతు పలికారు. అమెరికాలో అద్దె ఆదాయం బాగుంటుందని.. ఆ సొమ్ముతో ముంబైలో ఇల్లు కొనొచ్చని పేర్కొన్నారు. కొందరు నెటిజన్లు మాత్రం టైర్-2 నగరాలు కూడా ఆచరణీయమైన ఎంపికేనని పోస్టు చేశారు. టైర్ 2, 3 నగరాలు ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలని.. ముంబై వంటి టైర్ 1 నగరాల కంటే గణనీయంగా మెరుగైనవి, మరింత నివాసయోగ్యమైనవి అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. ముంబైలో ఇరుకైన సింగిల్ బీహెచ్ కే కి అవసరమైన అదే బడ్జెట్‌తో, టైర్ 2 లేదా 3 నగర శివార్లలో సురక్షితమైన, చక్కని ఇండివిడ్యువల్ ఇంటిని నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు.
This website uses cookies.