poulomi avante poulomi avante

ముప్పా వెంక‌య్య చౌద‌రికి దూర‌దృష్టి ఎక్కువ‌: ముర‌ళీమోహ‌న్ ప్ర‌శంస‌

Tollywood veteran actor Murali Mohan appreciated Muppa Venkaiah Choudhary

  • ముప్పా క్లబ్ ఇంద్ర ప్రారంభోత్సవంలో మురళీమోహన్

ముప్పా వెంకయ్య చౌదరికి దూరదృష్టి ఎక్కువని, భూములు కొనడంలో ఆయన అనుభవం ఎనలేనిదని ప్రముఖ నటుడు మురళీ మోహన్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఎక్కడ భూమి కొంటే దాని విలువ పెరుగుతుందో ముప్పా చౌదరికి బాగా తెలుసన్నారు. ముప్పా ఇంద్ర ప్రస్తా విల్లాస్ లోని క్లబ్ ఇంద్ర ప్రారంభోత్సవం సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడారు. వంద ఎకరాల ఈ భూమిని కొన్న తర్వాత చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి లిటిగేషన్ రాకుండా అన్ని చర్యలూ తీసుకున్నారని ప్రశంసించారు. తెలివితక్కువ వాళ్లు ఇళ్లు కడతారు.. తెలివైన వాళ్లు అందులో అద్దెకు ఉంటారని ఒకప్పుడు సామెతి ఉండేది, అది ఇప్పుడు మారిందని.. తెలివైన వాళ్లు ఇళ్లు కట్టుకుంటుంటే తెలివితక్కువ వాళ్లు అందులో అద్దెకు ఉంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న నగరమని.. 360 డిగ్రీల్లో ఈ నగరం విస్తరిస్తోందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాలకు ప్లాన్ చేసి ఐటీ కంపెనీలను తీసుకురావడంతో హైదరాబాద్ అభివృద్ధికి నాంది పడిందన్నారు. ప్రస్తుతం ఈ చుట్టపక్కల ఉన్న రోడ్లన్నీ 100 అడుగుల రోడ్లు అవుతాయని.. అప్పుడు మీరు కొనుక్కున్న ప్రాపర్టీల విలువ భారీగా పెరుగుతుందని స్పష్టంచేశారు. మీరు కొన్నప్పటికి ఇప్పటికి రెండు మూడు రెట్లు పెరిగిందని.. త్వరలోనే ఈ విల్లాల విలువ రూ.10 కోట్లు కావడం ఖాయమన్నారు. తాము హైదరాబాద్ లో శిల్పారామం పక్కన మొట్టమొదటగా జూబ్లీ ఎన్ క్లేవ్ పేరుతో ఓ ప్రాజెక్టు చేపట్టి.. ప్లాట్లు చేసి విక్రయించామని తెలిపారు. అప్పుడు గజం రూ.600 చేసి అమ్మాని.. అది ఇప్పుడు గజం రూ.2 లక్షలకు చేరిందని వివరించారు. ఏ వ్యాపారం చేసినా ఇంత పెరగదన్నారు. అలా అని ఎవరు పడితే వాళ్లు.. ఎక్కడ పడితే అక్కడ కొంటే చేతులు కాలతాయన్నారు. అందువల్ల మంచి కంపెనీని ఎంచుకుని లిటిగేషన్ లేని భూములు కొనుక్కోవాలని మురళీ మోహన్ సూచించారు. అప్పుడు మాదాపూర్ లో కొనుక్కోలేదని బాధపడే కంటే ఇప్పుడు ఇక్కడ కొనుక్కోవడం మంచిదన్నారు.

దూరం అనేది హైదరాబాద్ లో చూసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చవకగా వచ్చిందని లిటిగేషన్ ల్యాండ్ కొని ఇబ్బందులు పడొద్దని సూచించారు. 300 విల్లాలతో కట్టిన ఈ ఇంద్రప్రస్థ అద్భుతమైన ప్రాజెక్టు అన్నారు. ఇందులో విల్లా కొనడం చక్కని నిర్ణయం అని మురళీ మోహన్ స్పష్టం చేశారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles