poulomi avante poulomi avante

రెండేళ్లలో మురుగురహిత మూసీ నది

  • ముందుగా రూ. 3 వేల కోట్లు
  • ప్రాథమిక డీపీఆర్‌ రెడీ
  • ఇరువైపులా ట్రంక్‌ లైన్లు

మూసీ సుందరీకరణపై తొలి అడుగు పడుతోంది. ఇప్పటిదాకా మూసీని శుద్ధి చేసేందుకు ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించినా.. అవి పట్టాలెక్కలేదు. ప్రస్తుతం బాలరిష్టాలు అధిగమించి.. మూసీ నదిలోకి మురుగు ప్రవాహం ఆగాలనే లక్ష్యంతో మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎంఆర్‌డీసీఎల్‌) కసరత్తు ప్రారంభం చేసింది. సీఎం రేవంత్ ‌రెడ్డి సూచనలతో మూసీ నదికి ఇరువైపులా భారీ మురుగు ట్రంక్‌ లైన్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. రూ.3,100 కోట్లతో 2 దశల్లో పనులు చేపట్టి, రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో జలమండలి ఇంజినీర్లతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, మురుగు కలుస్తున్న ప్రాంతాలు, లోటుపాట్లను గుర్తించాక కార్యాచరణ ఉంటుందని ఎంఆర్‌డీసీఎల్‌ స్పష్టం చేస్తోంది.

రూ.3,100 కోట్లతో డీపీఆర్‌
హైదరాబాద్ మహానగరంలో రోజూ ఉత్పత్తి అవుతోన్న మురుగులో 80 శాతం మూసీకే చేరుతోంది. ఓఆర్‌ఆర్‌ మధ్యలో మూసీ నది ప్రవహిస్తున్న 55 కి.మీ పొడవునా మురుగుతో నిండి ఉంటోంది. ఓఆర్‌ఆర్‌ మధ్యలో మూసీ నది ప్రవహిస్తున్న 55 కి.మీ పొడవునా మురుగుతో నిండి ఉంటోంది. గతంలో జంట జలాశయాల నుంచి నార్సింగి వరకు కొంత స్వచ్ఛమైన నీరు కనిపించేది. ఎగువన జనావాసాలు రావడంతో పరిస్థితి మారిపోయింది. ఎగువన జనావాసాలు రావడంతో పరిస్థితి మారిపోయింది. నార్సింగి నుంచి గౌరెల్లి వరకు నదికి ఇరువైపులా 45కి.మీ పొడవునా 2,000ఎంఎం నుంచి 2,600ఎంఎం డయా పైపులైన్లతో మురుగును దారి మళ్లించాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. రూ.3,100 కోట్లతో డీపీఆర్‌ కూడా సిద్ధం అయింది. ఆ ప్రణాళికను అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.

* ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 52 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. సివరేజీ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం మరో 39 నిర్మించాల్సి ఉంది. ఆయా ఎస్టీపీలను నిర్మించి ట్రంక్‌లైన్లను కలుపుతారు. శుద్ధి అయిన నీటిని నదిలోకి వదులుతారు. ప్రాజెక్టుతో పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను తెలుపుతూ ఎంఆర్‌డీసీఎల్‌ నిధులు సమీకరించేందుకు ప్రయత్నం చేస్తోంది. దరఖాస్తు చేశామని, త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని అధికారులు అంటున్నారు.

అప్పటికల్లా క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. అడుగడుగునా మూసీలోకి పైపులైన్ల ద్వారా మురుగు వదులుతుండటంతో శుద్ధి కేంద్రాల లక్ష్యం నెరవేరటం లేదు. మూసీ నదికి ఇరువైపులా ట్రంక్‌లైన్లను నిర్మించి, భూగర్భ మురుగు నీటి పైపులైన్లను దానితో అనుసంధానం చేస్తారు. ఆ విధంగా మరుగు నీరు అంతా ట్రంక్‌లైన్లలోకి చేరుతుంది.

ప్రతిపాదనలు ఇవీ
* ఉత్తరం వైపున నానక్‌రామ్‌గూడ, తారామతి బారాదరి, కార్వాన్, ఇబ్రహీంచెరువు, నాంపల్లి, అంబర్‌పేట, నారాయణగూడ, పీర్జాదిగూడ, రామంతాపూర్, కొర్రేముల ప్రాంతాల మీదుగా 27.5 కి.మీ మేర రూ.1,054 కోట్లతో ట్రంక్‌లైన్‌ నిర్మాణం.
* దక్షిణం వైపు అత్తాపూర్, బాపూఘాట్, మలక్‌పేట్, చార్మినార్, నాగోల్, గౌరెల్లి ప్రాంతాల్లో 15 కి.మీ మేర రూ.1,048.95 కోట్లతో..
* మూసీ నదికి ఉత్తరం, దక్షిణాన హైదరాబాద్ నగరంలో రూ.996.96 కోట్లతో ట్రంక్‌లైన్‌ నిర్మాణం.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles