Categories: TOP STORIES

విశిష్ఠ‌మైన వ్య‌క్తుల కోసం.. మై హోమ్ 99

  • హైద‌రాబాద్‌లో మీకంటూ ఓ సొంత రాజ్యం ఉండాల‌ని కోరుకుంటున్నారా?
  • ఇప్పుడున్న ప‌రిస్థితిలో సొంత రాజ్యం ఎలా సాధ్య‌మ‌వుతుంద‌నేది మీ సందేహ‌మా?
  • సొంత రాజ్య‌మంటే.. పురాత‌న కాలం నాటి రాజ్యం కాద‌ని గుర్తుంచుకోండి..
  • ప్ర‌స్తుత రోజుల్లో.. మీ స్థాయికి త‌గ్గ‌ట్టు.. ఒక ప్ర‌త్యేక‌మైన క‌మ్యూనిటీ అని అర్థం..

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో ఆరంభం నుంచీ స‌రికొత్త పోక‌డ‌ల్ని ఆవిష్క‌రించే మై హోమ్ గ్రూప్‌.. కోకాపేట్‌లో విభిన్న‌మైన రీతిలో.. కేవ‌లం 99 మంది విశిష్ఠ‌మైన వ్య‌క్తుల కోస‌మే.. ఒక ప్ర‌త్యేక‌మైన ప్రాజెక్టును ఆరంభించింది. దీనికి మై హోమ్ 99 అనే నామ‌క‌ర‌ణం చేసింది. వాస్త‌వానికీ ప్రాజెక్టు గురించి మై హోమ్ సంస్థ ఎక్క‌డా పెద్ద‌గా ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌ట్లేదు. ఎందుకంటే, 99 మంది విశిష్ఠ‌మైన వ్య‌క్తులెవ‌రో కంపెనీకి ఎప్పుడో తెలుసు. కేవ‌లం మిత్రుల ద్వారా తెలుసుకున్నవారి ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టులో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవ‌డానికి సంసిద్ధత‌ను వ్య‌క్తం చేయ‌డం విశేషం.

మేఘాల‌తో స‌య్యాట ఆడాల‌ని భావించేవారికీ ప్రాజెక్టు చ‌క్క‌గా న‌ప్పుతుంది. ఎందుకంటే మై హోమ్ 99 ప్రాజెక్టును సుమారు జి+53 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తోంది. కొన్ని త‌రాల ప్ర‌జ‌లు జీవించాలి కాబ‌ట్టి.. అందుకు అనుగుణంగా స‌రిపోయేలా.. ఆక‌ర్ష‌ణీయంగా డిజైన్ చేశారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌తి సంద‌ర్భాన్ని ఆస్వాదించ‌డానికి 14 అడుగుల సిట‌వుట్ ఏరియాను.. బెడ్‌రూమ్ బాల్క‌నీల‌ను విశాలంగా క‌నిపించేందుకు ఆరు అడుగుల్లో అభివృద్ధి చేశారు. నాలుగు అంత‌స్తుల్లో క్ల‌బ్ హౌజ్‌ను డిజైన్ చేశారు. ఇందులోని ఇన్‌ఫినిటీ పూల్ ప్ర‌తిఒక్క‌రికీ విశేషంగా న‌చ్చుతుంది.
హైద‌రాబాద్ విశిష్ఠ‌త‌ను ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డంలో కోకాపేట్ ముఖ్య‌భూమిక‌ను పోషిస్తుంద‌నే విష‌యంలో సందేహం లేదు. మూడు నుంచి నాలుగేళ్ల‌లో ఈ ప్రాంతాన్ని చూసేవారెవ్వ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. స‌రిగ్గా ఇక్క‌డి కొండ ప్రాంతంలో.. మై హోమ్ గ్రావా ఐటీ హ‌బ్ ప‌క్క‌నే.. దాదాపు 1.74 ఎక‌రాల్లో.. నైరుతి దిశ‌లో ఉస్మాన్ సాగ‌ర్‌ను వీక్షిస్తూ.. ఆనంద‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని కోరుకునే వారికోస‌మే మై హోమ్ 99 రూపుదిద్దుకుంటోంది. 9299, 10,399 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్ల‌ను డిజైన్ చేశారు. ఇక్క‌డ్నుంచి రెండు కిలోమీట‌ర్ల దూరంలోనే ఔట‌ర్ రింగ్ రోడ్డు.. నిమిషాల వ్య‌వ‌ధిలో చేరుకునే ఐబీ హ‌బ్‌, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌, అంత‌ర్జాతీయ స్కూళ్లు, ఆస్ప‌త్రులు, రిక్రియేష‌న్ పార్కులు వంటివి ఉండ‌టం విశేషం. అలా న‌డుచుకుంటూ కానీ సైకిల్ మీద కానీ ఆఫీసుకు వెళ్లి రావొచ్చు.

This website uses cookies.