చదరపు అడుక్కీ రూ.10,000
నగరానికి చెందిన మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ కోకాపేట్‌లో సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కొసరాజు గ్రూపుతో కలిసి ఆరంభించిన ఈ నిర్మాణానికి మై హోమ్ అపాస అని పేరు పెట్టింది. దాదాపు 13.52 ఎకరాల్లో నిర్మించే ఈ ప్రాజెక్టులో సుమారు 1338 ఫ్లాట్లను నిర్మిస్తుంది. ఇందులో మొత్తం వచ్చేవి ఆరు టవర్లు కాగా.. ప్రస్తుతం మూడు టవర్ల నిర్మాణ పనుల్ని ఆరంభించింది. అన్నీ ట్రిపుల్ బెడరూమ్ ఫ్లాట్లు గల ఈ నిర్మాణంలో.. 2765 నుంచి 3860 చదరపు అడుగుల్లో ఫ్లాట్లను తీర్చిదిద్దింది. జి ప్లస్ 44 అంతస్తుల్లో నిర్మించే ఈ మై హోమ్ అపాస్‌లో ధర విషయానికొస్తే.. చదరపు అడుక్కీ రూ.10,000 చెబుతోంది. సుమారు 72 వేల చదరపు అడుగుల్లో క్లబ్ హౌజ్‌ను డెవలప్ చేస్తుంది. ఓపెన్ స్పేస్ కోసం సుమారు 81.6 శాతం వదిలేశారు. ఈ నిర్మాణంలో సెంట్రల్ ల్యాండ్ స్కేప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
* అపాస్‌లో ఫ్లాట్లు కొనాలంటే మీకు సంస్థ పంపిన ఆహ్వానం ఉంటేనే సాధ్యమవుతుంది. ఇలా ఎందుకంటే, మై హోమ్ సంస్థ గత ప్రాజెక్టులైన నిషధ, తర్ష్క్య వంటి ప్రాజెక్టుల్లో అనేకమంది ఫ్లాట్లను కొనుగోలు చేయలేకపోయారు. కాకపోతే, వారంతా మై హోమ్ ఆరంభించే తదుపరి ప్రాజెక్టులో కొంటామని తెలిపారు. అందుకే, మై హోమ్ సంస్థ వారందరికీ అపాస్ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని పంపించింది. వారంతా కొనుగోలు చేశాకే మిగతావారికీ ఫ్లాట్లను కొనేందుకు అవకాశం కల్పిస్తుందని తెలిసింది. ఏదీఏమైనా, మై హోమ్ అపాస్ ప్రాజెక్టుకు కొనుగోలుదారుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.