నగరానికి చెందిన మై హోమ్ గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ సుమారు 2 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేసింది. నగరంలో దాదాపు పదహారు ఐకానిక్ గేటెడ్ కమ్యూనిటీలను నిర్మించిన ఘనత ఈ సంస్థకు దక్కుతుంది. రానున్న రోజుల్లో పలు బడా ఆకాశహర్మ్యాల్ని చేపట్టేందుకు ప్రణాళికల్ని రచిస్తున్న మై హోమ్ సంస్థ తాజాగా కోకాపేట్‌లో 45 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది. మై హోమ్ నిషధ అని పేరు పెట్టిన ఈ ప్రాజెక్టును సుమారు 16.7 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. సుమారు ఎనిమిది టవర్లలో.. ఒక అంతస్తులో వచ్చేవి కేవలం నాలుగు ఫ్లాట్లే. ఇందులో మొత్తం 1400 ఫ్లాట్లను నిర్మిస్తారు. ఇది హై ఎండ్ లగ్జరీ ప్రాజెక్టు కాబట్టి, ఇందులో కేవలం 3 మరియు 4 పడక గదుల ఫ్లాట్లకు మాత్రమే స్థానం కల్పించారు. వీటి విస్తీర్ణం.. 3600, 4000, 4600 చదరపు అడుగుల్లో ఉంటాయి. ఫ్లాట్ ధర విషయానికి వస్తే.. చదరపు అడుక్కీ రూ. 9,800గా నిర్ణయించినట్లుగా సమాచారం. కాకపోతే, ఇంతకంటే తక్కువకు విక్రయిస్తారా? లేక రేటును పెంచుతారా? అనే అంశం తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. మరి, ఎప్పటిలాగే మై హోమ్ గ్రూప్ ఈ 1400 ఫ్లాట్ల అమ్మకాల్లో ఎలాంటి రికార్డును సృష్టిస్తారో!
This website uses cookies.