TG RERA fine on Parijata Homes
ఫ్లాట్ అలస్యం కావడంపై వడ్డీతో పరిహారం చెల్లించాలని ఆదేశం
తెలంగాణ రెరా ఈమధ్య కీలక తీర్పు ఇచ్చింది. ఫ్లాట్ నిర్మాణం ఆలస్యం కావడంతో.. వడ్డీతో సహా పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్స్ అనే సంస్థ.. పారిజాత ప్రైడ్ అనే అపార్టుమెంట్‌లో ఫ్లాట్ కోసం.. హైదరాబాద్‌కు చెందిన కొల్లేపర వీర వెంకట సత్య వర ప్రసాద్ 27.50 లక్షలు చెల్లించారు. తన ఫ్లాట్ అప్పగించాలని 2023 నవంబర్, 2024 జనవరిలో బిల్డర్లతో సంప్రదింపులు జరిపారు. కానీ, ఆయనకు ఫ్లాట్ ఇవ్వడంలో ఆలస్యం చేశారు. దీంతో వర ప్రసాద్ రెరా అథారిటీలో పిటిషన్ దాఖలు చేశారు.
ALSO READ: బాత్‌టబ్ లేదని బిల్డర్‌పై కేసు
తాను నెలకు రూ. 7,500 చొప్పున ఇంటి అద్దె చెల్లించానని, నెలవారీ ఈఎంఐలు చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై విచారించిన రెరా.. ఆలస్యంపై పారిజాత ప్రైడ్ యజమాన్యానికి నోటీసులు ఇచ్చింది. కానీ, సరైన సమాధానం ఇవ్వలేదు. ఆలస్యానికి కారణాలు కూడా చెప్పకపోవడంతో.. పారిజాత ఫ్రైడ్ యాజమాన్యంపై రెరా ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్డర్ ఆలస్యం చేసినందుకు వడ్డీతో సహా పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కొనుగోలుదారిడికి నిర్ణీత గడువు ముగిసిన నాటి నుంచి ఫ్లాట్ అప్పగించిన తేదీ వరకు చెల్లించిన సొమ్ముకు 11.1 శాతం వడ్డీని పరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 2022, జనవరి నుంచి ఈ వడ్డీని లెక్కలేసి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
This website uses cookies.