Categories: TOP STORIES

గోద్రేజ్ అమ్మకాలు అదుర్స్

  • హైదరాబాద్ లోని మొదటి ప్రాజెక్టులో
  • రూ.1000 కోట్ల అమ్మకాలు

హైదరాబాద్ రియల్ మార్కెట్లో అడుగు పెట్టిన గోద్రేజ్ ప్రాపర్టీస్ అమ్మకాల్లో అదరగొట్టింది. కోకాపేటలో చేపట్టిన తన తొలి ప్రాజెక్టు గోద్రేజ్ మాడిసన్ అవెన్యూలో విక్రయాలు సూపర్ గా సాగాయి. ప్రాజెక్టు లాంచ్ చేసిన కొన్ని వారాల్లోనే 300 ఇళ్లు విక్రయించింది. మొత్తం 0.84 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1,000 కోట్లకు పైగా విలువైన ఇళ్లను అమ్మినట్టు మార్చి 25న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కోకాపేట హైదరాబాద్‌లోని అత్యంత డిమాండ్ ఉన్న నివాస, వాణిజ్య కేంద్రాలలో ఒకటి. ‘హైదరాబాద్‌లో మా మొదటి ప్రాజెక్టుకు వచ్చిన స్పందనతో చాలా సంతోషంగా ఉన్నాం.

ఈ విజయం హైదరాబాద్‌లోని గోద్రేజ్ ప్రాపర్టీస్‌కు అందుబాటులో ఉన్న భారీ వృద్ధి అవకాశాన్ని, కోకాపేటలో ప్రీమియం రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్‌లకు ఉన్న బలమైన డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తుంది. ఈ విజయం హైదరాబాద్‌లో విస్తరించాలనే మా ప్రణాళికకు మద్దతుగా నిలుస్తుంది. త్వరలోనే హైదరాబాద్ లో రెండో ప్రాజెక్టు ప్రారంభిస్తాం’ అని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండీ, సీఈఓ గౌరవ్ పాండే తెలిపారు. కాగా, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ ఏడాది మార్చిలో ఉత్తర బెంగళూరులోని యెలహంకలో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, సుమారు రూ.2,500 కోట్ల ఆదాయ అంచనాతో ఓ ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 1.5 మిలియన్ చదరపు అడుగుల అభివృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ప్రధానంగా ప్రీమియం రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్, హై-స్ట్రీట్ రిటైల్ కోసం ఉంటుందని కంపెనీ తెలిపింది.

This website uses cookies.