- ఈ నెల 12 లేదా 14న ఆరంభం?
మై హోమ్ సంస్థ అంటే అనేక మంది బయ్యర్లకు ఒక నమ్మకం.. ఈ సంస్థ కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తుందంటే చాలు.. అందులో ఫ్లాట్లను కొనడానికి ఎన్ఆర్ఐలు సైతం పోటీ పడతారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మై హోమ్ సంస్థ వద్ద ఫ్లాట్లను కొనుగోలు చేసిన అనేకమంది బయ్యర్లు.. ఎప్పుడెప్పుడు ఈ సంస్థ కొత్త ప్రాజెక్టును ఆరంభిస్తుందా అని ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఈ కంపెనీ వద్ద ఫ్లాట్ బుక్ చేస్తే డెలివరీ పక్కా అని బయ్యర్ల గట్టి నమ్మకం. అందుకే, అలా ప్రాజెక్టును ప్రకటిస్తుందో లేదో.. వేడి పకోడిల్లా ఫ్లాట్లు అమ్ముడవుతుంటాయి. మై హోమ్ అవతార్, మంగళ, త్రిదాసా, సయూక్.. ఇలా ప్రతి ప్రాజెక్టు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. హైదరాబాద్ రియల్ రంగంలో
తాజాగా, ఈ సంస్థ తెల్లాపూర్‌లో మై హోమ్ విపినా అనే ప్రాజెక్టును నిర్మించడానికి ప్రణాళికలను రచిస్తోంది. దాదాపు 21 ఎకరాల్లో ఎనిమిది టవర్లను కడుతోంది. ఇందులో ఎంతలేదన్నా 3700 ఫ్లాట్ల దాకా నిర్మిస్తారని సమాచారం. సుమారు నలభై అంతస్తులకు పైగా ఎత్తులో నిర్మిస్తున్న మై హోమ్ విపినా ప్రాజెక్టును ఈ నెల 12 లేదా 14న ఆరంభిస్తారని సమాచారం. మరి, ఈ ప్రాజెక్టు హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఎలాంటి రికార్డును సృష్టిస్తుందనే విషయం తెలియాలంటే కొంతకాలం చూస్తే తెలుస్తుంది.