- పేరు: మైహోమ్ అపాస్
- విస్తీర్ణం: 13.52 ఎకరాలు
- ఎత్తు: జి+44 అంతస్తులు
- 6 టవర్లు.. 1338 ఫ్లాట్లు
- ఎప్పటిలాగే సూపర్ రెస్పాన్స్
హైదరాబాద్ నిర్మాణ రంగంలో మై హోమ్ సంస్థకు ప్రత్యేకమైన గుర్తింపు, కొనుగోలుదారుల నుంచి చక్కటి ఆదరణ ఉంది. అందుకే, ఈ కంపెనీ నుంచి ఏ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన విడుదలైనా.. స్థానికులే కాదు దేశ విదేశాల్లో నివసించేవారు పోటీపడి ఫ్లాట్లను కొనుగోలు చేస్తారు. తాజాగా, మై హోమ్ అపాస్ ప్రాజెక్టును కోకాపేట్‌లో నిర్మిస్తున్నారనే విషయం తెలియగానే.. బయ్యర్లు పోటీపడి ఇళ్లను కొంటున్నారు. అసలెందుకు బయ్యర్లు అపాస్ గురించి ఆసక్తి చూపిస్తున్నారో తెలుసా..
మైహోమ్ అపాస్ ప్రాజెక్టును సుమారు 13.52 ఎకరాల్లో డిజైన్ చేశారు. ఇందులో వచ్చేవి ఆరు స్కై హై టవర్లు. ఒక్కో టవర్ ఎత్తు జి ప్లస్ 44 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 1338 ఫ్లాట్లను డెవలప్ చేస్తున్నారు. సుమారు 81. 6 శాతం స్థలాన్ని ఓపెన్ స్పేస్‌గా వదిలేశారు. అంటే నిర్మాణం వచ్చేది కేవలం 18.4 శాతం స్థలంలోనే. 2765 నుంచి 3860 చదరపు అడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో వచ్చవేన్నీ ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లే కావడం గమనార్హం. అపాస్‌లో ధర విషయానికొస్తే.. చదరపు అడుక్కీ రూ.10,000 చెబుతోంది. సుమారు 72 వేల చదరపు అడుగుల్లో క్లబ్ హౌజ్‌ను డెవలప్ చేస్తుంది.