Categories: TOP STORIES

ఎన్ – క‌న్వెన్ష‌న్ ఆక్ర‌మ‌ణ‌లు నిజ‌మేన‌న్న హైడ్రా

ఎన్ కన్వెన్ష‌న్ సెంట‌ర్‌పై గ‌తంలో ఏ కోర్టు స్టే ఇవ్వ‌లేదు

హైడ్రా ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

హైదరాబాద్‌లోని తమ్మిడికుంట చెరువు, ఖానామెట్ గ్రామం, మాదాపూర్‌లోని ఎఫ్‌టిఎల్ / బఫర్ జోన్‌లలో.. హైడ్రా, జిహెచ్‌ఎంసి, టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖల అధికారులు ఆక్రమణలను శ‌నివారం తొలగించారు. తొలగించబడిన అనేక నిర్మాణాలలో, అక్ర‌మంగా నిర్మించిన ఎన్ క‌న్వెన్ష‌న్ కూడా ఉన్న‌ద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

2014లో హెచ్ఎండీఏ తమ్మిడికుంట చెరువు పూర్తి ట్యాంక్ లెవల్ మరియు బఫర్ జోన్‌లకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2014లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎన్ కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించింది. ఎఫ్‌టిఎల్ నిర్ధారణకు సంబంధించి చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని హైకోర్టు ఆదేశించింది. దీని ప్రకారం పిటిషనర్ ఎన్‌ కన్వెన్షన్ సమక్షంలో ఎఫ్‌టీఎల్ సర్వే నిర్వహించి మరియు సర్వే నివేదిక వారికి అందించామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ తెలిపారు. ఈ క్ర‌మంలో ఎన్‌ కన్వెన్షన్ 2017లో సర్వే నివేదికపై మియాపూర్ అద‌న‌పు కోర్టు జిల్లా జడ్జి కోర్టు సంప్రదించింది. ఇక‌, అప్ప‌ట్నుంచి ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఏ కోర్టు నుండి ఎటువంటి స్టే ఉత్తర్వులు లేవ‌ని క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఎన్ క‌న్వెన్ష‌న్ సిస్టమ్స్ మ‌రియు ప్రాసెస్‌ను తారుమారు చేసింద‌ని.. ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్‌లలో నిర్మించిన అనధికార నిర్మాణాల ద్వారా వారి వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించింద‌ని పేర్కొంది. ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ఎఫ్‌టీఎల్‌లోని ఎక‌రా ప‌న్నెండు గుంట‌లు, బ‌ఫ‌ర్ జోన్‌లో 2 ఎక‌రాల 18 గుంట‌ల‌ను ఆక్ర‌మించిందని హైడ్రా క‌మిష‌న‌ర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్ క‌న్వెన్ష‌న్‌కు ఎలాంటి అనుమ‌తిని మంజూరు చేయ‌లేద‌ని పేర్కొన్నారు. నీటి పారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ తదితర శాఖలతో పాటు హైడ్రామా అధికారులు ఈరోజు ఉదయం తమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాలను నిర్ణీత ప్ర‌క్రియ ప్ర‌కారం పూర్తిగా కూల్చివేశామ‌ని.. ఈ క్ర‌మంలో తెలంగాణ హై కోర్టు శ‌నివారం మ‌ధ్యాహ్నం మ‌ధ్యంత‌ర స్టేను ఇచ్చింద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

This website uses cookies.