Categories: TOP STORIES

ఆఫీసులో మ‌ధ్యాహ్నం నిద్రొస్తుందా?

మీరు మీ ఆఫీసులో నిద్ర పోవాల్సి వస్తే.. మీకు పగటి నిద్ర కావాల్సి వస్తే మీరేం చేస్తారు? మ‌హా అయితే టేబుల్‌ మీద నిద్ర‌పోతారు. లేదా కుర్చీలోనే కొంత‌సేపు కునుకుపాట్లు ప‌డ‌తారు. అయితే, ఇక నుంచి ఇలాంటి ఇబ్బందుల్ని దూరం చేసేందుకు స‌రికొత్త వ‌స్తువు మార్కెట్లోకి అడుగుపెట్టింది. అదే అర్బ‌న్ న్యాప్‌.

మ‌ధ్యాహ్నం వేళ కునుకు తీస్తే.. ఆత‌ర్వాత మెద‌డెంతో చురుకుగా ప‌ని చేస్తుంద‌ని ప‌లు పరిశోధ‌న‌ల్లో అర్థ‌మైన విష‌యం తెలిసిందే. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అందుబాటులోకి వ‌చ్చిన స‌రికొత్త ఉత్ప‌త్తే.. అర్బ‌న్ న్యాప్‌. దీన్ని ఖ‌రీదు.. సుమారు రూ.7.5 ల‌క్ష‌లు. కావాలంటే నెల‌కు రూ.30 వేల అద్దెకు అర్బ‌న్ న్యాప్ ప‌రిక‌రం ల‌భిస్తుంది.

ఇందులో భాగంగా జీరో గ్రావిటీ సీట్, జెంటిల్ బ్యాక్ మసాజ్, ఆక్సిజన్ థెరపీ, మెడిటేషన్ మ్యూజిక్, వెంటిలేటెడ్ సీట్, ఫ్రెష్ ఎయిర్ ఇన్‌లెట్, టైమ్డ్ వేకింగ్ వంటివి ఉంటాయి. మధ్యాహ్నం పవర్ న్యాప్ (పగటి నిద్ర) మీ శరీరం మరియు మనస్సును రీఛార్జ్ చేయగలదు. మీ రోజులోని రెండవ భాగాన్ని పరిష్కరించడానికి అవసరమైన శక్తిని అందిస్తుంద‌ని టీఎఫ్ఎంసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ మతాల అన్నారు. ఇది ప్రతి కార్పొరేట్ హౌస్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ మరియు ఎయిర్‌పోర్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన వెల్‌నెస్ పరికరమ‌ని తెలిపారు.

This website uses cookies.