నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తన 2వ మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంను ఈనెల 15 నుంచి 17 వరకు మూడురోజులపాటు నిర్వహించనుంది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ (ఎన్ఐఆర్ఈడీ) బ్యానర్ పై ‘రెరా, రియల్ ఎస్టేట్ ఎసెన్షియల్స్’ పేరుతో ఢిల్లీలోని పీహెచ్ డీ హౌస్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. సమగ్ర శిక్షణ, వర్క్ షాపులు, కెపాసిటి బిల్డింగ్ కార్యక్రమాల ద్వారా రియల్ ఎస్టేట్ నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాలలోని వ్యక్తులు మరింత శక్తివంతం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
కార్యక్రమంలో భాగంగా పలు సెషన్లు నిర్వహిస్తారు. రియల్ రంగానికి సంబంధించిన దాదాపు అన్ని అంశాలపై చర్చ జరుగుతుంది. నేటి పోటీ వాతావరణంలో రియల్ పరిశ్రమను స్థిరమైన వృద్ధిబాటలో తీసుకెళ్లాలని, అందరికీ తగిన వృత్తి నైపుణ్యం అందించాలనే లక్ష్యం పెట్టుకున్నట్టు నరెడ్కో జాతీయ అధ్యక్షుడు జి.హరిబాబు తెలిపారు.
This website uses cookies.