- హాజెల్ టవర్లో చదరపు అడుగు రూ.7399కే
తెల్లాపూర్లో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న రాజపుష్ప ఇంపీరియాలో ఫైనల్ టవర్ కూడా లాంచ్ అయింది. హాజెల్ పేరుతో లాంచ్ అయిన ఈ టవర్ లో ప్రీమియం లైఫ్ స్టైల్ 2, 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు అందుబాటులోకి రానున్నాయి. రాజపుష్ప ఇంపీరియాలో ఫ్లాట్ సొంతం చేసుకుంటే హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో మీకు శాశ్వత చిరునామా ఉండటం ఒక్కటే కాదు.. అత్యంత సుందరమైన గేటెడ్ కమ్యూనిటీలో మహోన్నత జీవితం గడపడం ఖాయం అనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. మీ ఇంటిని చూసి మీ స్నేహితులు, బంధుగణం అసూయపడే స్థాయిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇంట్లోని ప్రతి చదరపు అడుగునూ ఆస్వాదించేలా, హాయిగొలిపే జీవనం మీ సొంతమవుతుంది. మొత్తం 24 ఎకరాల స్థలంలో 8 టవర్లు 40 అంతస్తులతో నిర్మాణమవుతున్నాయి. ప్రాజెక్టు విస్తీర్ణంలో 82 శాతం కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం విశేషం. వర్క్ ఫ్రం హోం స్పేస్ ఉండేలా అపార్ట్ మెంట్లు తీర్చిదిద్దుతున్నారు. డెక్ తో కూడిన రెండు స్విమ్మింగ్ పూల్స్ తోపాటు సన్ డెక్ అపార్ట్ మెంట్స్ కూడా ఉన్నాయి. 2, 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్లతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు 2026 మార్చి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఏడు టవర్లు లాంచ్ కాగా.. తాజాగా ఎనిమిదో టవర్ హాజెల్ కూడా లాంచ్ అయింది. ఇందులో చదరపు అడుగు కేవలం రూ.7,399కే ఇస్తున్నారు.
గ్రాండ్ క్లబ్ హౌస్..
రాజపుష్ప ఇంపీరియాకు మరో అదనపు ఆకర్షణ.. గ్రాండ్ క్లబ్ హౌస్. 1.2 లక్షల చదరపు అడుగుల్లో జీ ప్లస్ నాలుగు అంతస్తుల్లో నిర్మితమవుతున్న ఈ క్లబ్ హౌస్ లో అదిరిపోయే స్విమ్మింగ్ పూల్స్, మల్లీ ఫ్లోర్ జిమ్నాజియం, బాంకెట్ హాల్స్, స్పా, మెడిటేషన్ లాంజ్, లైబ్రరీ, బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు, ఇండోర్ గేమ్స్, రెస్టారెంట్లు, కేఫ్ ల వంటి పలు సౌకర్యాలు మీ ప్రీమియం జీవన అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళతాయి.
లొకేషన్ పరంగా..
లొకేషన్ పరంగా చూసినా ఇది మంచి ప్రాంతంలో ఉంది. తెల్లాపూర్ ఇప్పటికే చాలా బాగా అభివృద్ధి చెందింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఐటీ హబ్ ల నుంచి సైబర్ సిటీ, గచ్చిబౌలిలోని పలు కంపెనీలు చాలా దగ్గర్లో ఉన్నాయి. రాజపుష్ప ఇంపీరియా నుంచి ఔటర్ రింగ్ రోడ్డు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే పలు అంతర్జాతీయ స్కూళ్లు, ప్రముఖ విద్యా సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీలు, ఎంఎన్ సీలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వంటివి సమీపంలోనే ఉన్నాయి.