అందం.. ఆకర్షణీయం.. సౌకర్యవంతం.. ఇవే చాలామంది తమ గృహాలలో ఉండాలని భావిస్తారు. మరి వీటికి ఆధునికత, సాంకేతికత కూడా తోడైతే.. గృహమే కదా స్వర్గసీమ అనకుండా ఉండగలమా? మరి అలాంటి ఇల్లు కావాలంటే చలో ఓం శ్రీ గ్రాండ్. సికింద్రాబాద్ యాప్రాల్ లో నిర్మితమైన ఫ్యూచర్ రెడీ స్మార్ట్ హోమ్స్. మీ మాట, మీ స్పర్సతో మీ ఇల్లు మీరు చెప్పినట్టు చేస్తుందంటే అతిశయోక్తి కాదు. విలాసవంతమైన జీవనానికి సాంకేతికతను మేళవించి ఔరా అనే రీతిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. 2235 చదరపు అడుగుల నుంచి 3040 చదరపు అడుగుల మధ్య విస్తీర్ణంతో 3, 4 బీహెచ్ కే ఫ్లాట్లు దాదాపు రెడీగా ఉన్నాయి. వచ్చేనెల నుంచి గృహప్రవేశానికి సిద్ధమవుతాయి.
మొత్తం 60 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ హోం ఆటోమేషన్ టెక్నాలజీ ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. విశాలమైన క్లబ్ హౌస్ తో పాటు ఉష్ణోగ్రతను నియంత్రించే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సేవకుల కోసం ప్రత్యేక గదులు, వంద శాతం పవర్ బ్యాకప్, శద్ధిచేసిన నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి ప్లాంట్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ వంటి బోలెడు సౌకర్యాలున్నాయి. విశాలమైన ఆటస్థలంతోపాటు మల్టీపర్సస్ కోర్టు కూడా ఉంది.
చూస్తే కళ్లు చెదిరిపోయే రీతిలో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టుకు ఆటోమేషన్ అదనపు హంగు జోడించింది. ఇందులో భాగంగా మెయిన్ డోర్ కు డిజిటల్ లాక్ ఏర్పాటు చేశారు. అలాగే వాష్ రూంలో మోషన్ సెన్సార్ లైటింగ్ పెట్టారు. అంటే మనుషుల కదలికలను బట్టి అక్కడ లైట్లు వెలగడం, ఆరడం జరుగుతుంది. ఇక లైట్ లేదా ఫ్యాన్ వేసుకోవాలన్నా.. ఏసీ, టీవీ, గీజర్ ఆన్ చేసుకోవాలన్నా.. వాయిస్ లేదా యాప్ తో చేసుకోవచ్చు. ఇంట్లోని ఎలక్ట్రిక్ పరికరాలను మనం ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకునేందుకు వీలుగా గూగుల్, అలెక్సా వాయిస్ యాప్ తో అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పించారు.
అంటే.. మనం ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. మన ఇంటిని చూసుకోవచ్చు. లోపల వస్తువులను ఆపరేట్ చేసుకోవచ్చన్నమాట. భద్రతాపరంగా కూడా చాలా ఏర్పాట్లు చేశారు. 24 గంటల ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, నిరంతరాయంగా సీసీ కెమెరాల నిఘా, డోర్ వీడియో సెక్యూరిటీ సిస్టమ్.. ఇలా మొత్తం నాలుగంచెల భద్రతా వ్యవస్థ ఉంది. వంటింట్లో గ్యాస్ లీక్ అయితే గుర్తించే వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు.
ఎన్నో ప్రత్యేకతలున్న ఓం శ్రీ గ్రాండ్ ప్రాజెక్టు.. లోకేషన్ పరంగా కూడా బావుంది. ఔటర్ రింగు రోడ్డు నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది. శంషాబాద్ విమానాశ్రయానికి 45 నిమిషాల్లో వెళ్లొచ్చు. ఆర్ఎస్ఐ క్లబ్ 10 నిమిషాల దూరంలో ఉంది. ఐదు నిమిషాలు ప్రయాణిస్తే చాలు.. మోర్ సూపర్ మార్కెట్ వస్తుంది. ఎస్ బీఐ, ఐసీఐసీఐ, ఆంధ్రా బ్యాంకు వంటి పలు ప్రముఖ బ్యాంకులు చాలా దగ్గర్లోనే ఉన్నాయి. అతిపెద్ద ఆర్మీ గోల్ప్ కోర్టు అత్యంత సమీపంలోనే ఉంది.
అలాగే మిలటరీ ఆస్పత్రితోపాటు పలు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు దగ్గర్లోనే ఉన్నాయి. సీఎస్డీ క్యాంటీన్, ప్రముఖ డిఫెన్స్ క్యాంటీన్లను 10 నిమిషాల ప్రయాణంతో చేరుకోవచ్చు. కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే సీడీఎం కాలేజీ ఉంది. కేంద్రీయ విద్యాలయం కూడా 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈవీ చార్జింగ్ స్టేషన్ తోపాటు మరెన్నో సౌకర్యాలున్న ఓం శ్రీ గ్రాండ్ లో అపార్ట్ మెంట్ సొంతం చేసుకోవాలంటే వెంటనే ఓ లుక్కేసి రండి. 3 బీహెచ్ కే ధర రూ.1.58 కోట్ల నుంచి మొదలవుతుంది.
This website uses cookies.